బంగారం ధరల స్ట్రాంగ్ అవుట్‌లుక్- ఈ వారంలో కమ్‌బ్యాక్ కు ఛాన్స్
అంతర్జాతీయంగా కొనసాగుతున్న పరిణామాల వల్ల బంగారం, వెండి ధరలు ఇటీవలి కాలంలో రెండు నెలల కనిష్ఠ స్థాయికి పడిపోయాయి. ఈ పతనం తాత్కాలికమేనని, స్పష్టమైన బ్రేక్‌అవుట్ కనిపించిన వెంటనే పసిడి, వెండి రేట్లు మళ్లీ బలంగా పుంజుకునే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తోన్నాయి. కిందటి వారంలో పసిడి రేట్లల్లో పెరుగుదల కనిపించిది గానీ.. అది నామమాత్రమే. భారీగా పెరుగుదలలేవీ చోటు చేసుకోవట్లేదు. పండగ సీజన్ లో సాధారణ కొనుగోలుదారులకు ఇది ఊరట కలిగిస్తోంది.
బులియన్ మార్కెట్‌లో నెలకొన్న ఈ ధరల తగ్గుదల వల్ల రిటైలర్లు గానీ, దీర్ఘకాలిక ఇన్వెస్టర్లు గానీ బంగారం కొనుగోలుకు ఓ చక్కని అవకాశంగా మారింది. ఇది ఎంతో కాలం ఉండకపోవచ్చని కేడియానోమిక్స్ వ్యవస్థాపకుడు సుశీల్ కేడియా పేర్కొన్నారు. ఓ బిజ్ వెబ్ సైట్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. పసిడి, వెండి మార్కెట్ లో కొత్తగా పొజిషన్లు తీసుకోబోయే ముందు టెక్నికల్ ఛార్ట్ లను క్షుణ్ణంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.

మార్కెట్‌లో స్పష్టమైన బ్రేక్‌అవుట్ కనిపించేంత వరకు వేచి చూసే ధోరణిని అవలంభించడం మంచిదని అభిప్రాయపడ్డారు. దీపావళి సమయానికి బంగారం ధరలు పూర్వవైభవాన్ని సంతరించుకునే అవకాశం ఉందని కేడియా పేర్కొన్నారు. వెండి కూడా ఊహించని రీతిలో పుంజుకునే అవకాశం ఉందని అన్నారు. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ లో వెండి ధర రూ. 2.5 లక్షల మార్కును తాకినా ఆశ్చర్యపోనక్కర్లేదని వ్యాఖ్యానించారు.
వ్యాపార రీత్యా కాకుండా ఆభరణాలు కొనుగోలు చేయాలనుకునే సాధారణ వినియోగదారులకు ఈ ధరల క్షీణత ఒక మంచి అవకాశంగా ఉపయోగపడుతుందని కేడియా అభిప్రాయపడ్డారు. బంగారం, వెండి వస్తువులను కొనుగోలు చేసే ముందు వినియోగదారులు తమ వ్యక్తిగత ప్రాధాన్యతలు, ఆర్థిక అవసరాలు, అందుబాటులో ఉన్న బడ్జెట్‌ను సరిగ్గా అంచనా వేసుకోవడం చాలా ముఖ్యమనిని ఆయన వివరించారు. తొందరపడి బడ్జెట్‌కు మించి కొనుగోళ్ళు చేయకూడదని సూచించారు.
శుక్రవారం ఎంసీఎక్స్ క్లోజింగ్ సెషన్ నాటికి వివిధ నగరాల్లో నేడు నమోదైన బంగారం రేట్లు ఒక గ్రాముకు ఇలా ఉన్నాయి.
చెన్నై..
24 క్యారెట్లు- రూ. 15,142, 22 క్యారెట్లు - రూ. 13,880, 18 క్యారెట్లు - రూ. 11,400
ముంబై..
24 క్యారెట్లు- రూ. 15,142, 22 క్యారెట్లు - రూ. 13,880, 18 క్యారెట్లు - రూ. 11,357
బెంగళూరు..
24 క్యారెట్లు- రూ. 15,142, 22 క్యారెట్లు - రూ. 13,880, 18 క్యారెట్లు - రూ. 11,357
హైదరాబాద్..
24 క్యారెట్లు- రూ. 15,142, 22 క్యారెట్లు - రూ. 13,880, 18 క్యారెట్లు - రూ. 11,357
విజయవాడ..
24 క్యారెట్లు- రూ. 15,142, 22 క్యారెట్లు - రూ. 13,880, 18 క్యారెట్లు - రూ. 11,357
విశాఖపట్నం..
24 క్యారెట్లు- రూ. 15,142, 22 క్యారెట్లు - రూ. 13,880, 18 క్యారెట్లు - రూ. 11,357












Click it and Unblock the Notifications
