పండగ సీజన్ వేళ.. పసిడి ధరల్లో తీవ్ర అస్థిరత
అంతర్జాతీయ మార్కెట్‌లో చోటుచేసుకుంటున్న పరిణామాలు, అమెరికా డాలర్ విలువలో మార్పుల ప్రభావం దేశీయంగా బంగారం, వెండి ధరలపై స్పష్టంగా కనిపిస్తోంది. నేడు దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్ లో పసిడి ధరల్లో హెచ్చుతగ్గులు నమోదయ్యాయి. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో నవంబర్ 5 నాటి గడువు గల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,48,129 వద్ద ట్రేడ్ కాగా, డిసెంబర్ 4 గడువు కలిగిన వెండి ఫ్యూచర్ కాంట్రాక్ట్స్ కిలోకు రూ. 2,26,393 వద్ద కొనసాగాయి.
24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 1,49,540గా ఉండగా, ఆభరణాల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,37,078 వద్ద ట్రేడ్ అయింది. అదేవిధంగా కిలో వెండి ధర రూ.2,26,770గా నమోదైంది. అమెరికా-ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు బులియన్ మార్కెట్లో అనిశ్చితికి కారణమౌతోన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో పెట్టుబడిదారులు బంగారం వైపు మళ్లడం, ఫలితంగా వాటి ధరల్లో హెచ్చుతగ్గులు నమోదు కావడం ఆనవాయితీగా వస్తోంది.

హైదరాబాద్ లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,50,540 వద్ద స్థిరపడింది. 22 క్యారెట్లు రూ.1,37,995 పలకగా.. వెండి కిలో రూ. 2,26,570 వద్ద నిలిచింది. ముంబైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,50,300 కాగా, 22 క్యారెట్లు రూ.1,37,775 వద్ద నిలిచింది. ఇక్కడ వెండి రూ. 2,26,220 వద్ద ట్రేడ్ అయింది. చెన్నైలో ఇవే ధరలు వరుసగా రూ. 1,50,740, రూ.1,38,178, రూ. 2,26,870 వద్ద కొనసాగాయి. బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,50,420, 22 క్యారెట్లు రూ.1,37,885, వెండి రూ.2,26,390 గా ట్రేడ్ అయ్యాయి.
వివిధ నగరాల్లో నేడు నమోదైన బంగారం రేట్లు ఒక గ్రాముకు ఇలా ఉన్నాయి.
చెన్నై..
24 క్యారెట్లు- రూ. 14,918, 22 క్యారెట్లు - రూ. 13,675, 18 క్యారెట్లు - రూ. 11,235
ముంబై..
24 క్యారెట్లు - రూ. 15,028, 22 క్యారెట్లు- రూ. 13,675, 18 క్యారెట్లు - రూ. 11,189
బెంగళూరు..
24 క్యారెట్లు - రూ. 15,028, 22 క్యారెట్లు- రూ. 13,675, 18 క్యారెట్లు - రూ. 11,189
హైదరాబాద్..
24 క్యారెట్లు - రూ. 15,028, 22 క్యారెట్లు- రూ. 13,675, 18 క్యారెట్లు - రూ. 11,189
విజయవాడ..
24 క్యారెట్లు - రూ. 15,028, 22 క్యారెట్లు- రూ. 13,675, 18 క్యారెట్లు - రూ. 11,189
విశాఖపట్నం..
24 క్యారెట్లు - రూ. 15,028, 22 క్యారెట్లు- రూ. 13,675, 18 క్యారెట్లు - రూ. 11,189

Click it and Unblock the Notifications