బంగారం ధరలపై దీపావళి, ధన్ తెరాస్ ప్రభావం..?

దేశీయ మార్కెట్‌లో బంగారం ధరలు కొత్త ట్రెండ్ కు తెరతీశాయి. పండగల సీజన్ లో పసిడి రేట్లు స్థిరత్వాన్ని నమోదు చేస్తోన్నాయి. రాబోయే దీపావళి, ధన్ తెరాస్ పండగల నేపథ్యంలో ఇది కొంతవరకు సాధారణ కొనుగోలుదారులకు ఊరట ఇస్తోన్నప్పటికీ.. ఈ వారంలో మరింత తగ్గొచ్చనే అంచనాలు కూడా లేకపోలేదు. దీంతో.. అందరి దృష్టీ కూడా సోమవారం నాటి ట్రేడింగ్ సెషన్ పై నిలిచింది. పసిడి, వెండి కొనుగోళ్లు ఎలా ఉంటాయనేది దాని మీదే ఆధారపడి ఉంది.

ప్రస్తుత బులియన్ రేట్ల ప్రకారం 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాములకు 1,42,580 రూపాయల వద్ద విక్రయమవుతోంది. సాధారణంగా నగల తయారీకి అత్యధికంగా ఉపయోగించే 22 క్యారెట్లు రూ. 1,30,700 వద్ద ట్రేడ్ అవుతోంది. 18 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 1,06,940 వద్ద నమోదైంది. సౌదీ అరేబియాపై హౌతీలు తాజా దాడులు ఆరంభించడం, దీని ప్రభావం అమెరికా- ఇరాన్ యుద్ధాన్ని తీవ్రతరం చేయొచ్చనే అంచనాల మధ్య బంగారం ధరల్లో తీవ్ర హెచ్చు తగ్గులు ఉండొచ్చని చెబుతున్నారు.

Gold and Silver prices at MCX records steady 24K 22K and 18K ahead of Dhanteras and Diwali Festive

హైదరాబాద్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,42,480, 22 క్యారెట్లు రూ. 1,30,060 గా రికార్డయ్యాయి. ఇక్కడ వెండి కిలో రూ. 2,02,140 గా నమోదైంది. చెన్నైలో 10 గ్రాముల బంగారం ధర 24 క్యారెట్లకు రూ. 1,42,810, 22 క్యారెట్లకు రూ. 1,30,350 కాగా వెండి 2,03,220 వద్ద ట్రేడ్ అయింది. ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు రూ. 1,42,480, రూ. 1,30,280 కాగా వెండి కిలో రూ. 2,02,910 వద్ద స్థిరపడ్డాయి. బెంగళూరులో 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 1,42,490, 22 క్యారెట్లు రూ. 1,30,116, వెండి రూ. 2,01,770 గా నమోదైంది.

నేడు నమోదైన బంగారం రేట్లు ఒక గ్రాముకు ఇలా ఉన్నాయి

చెన్నై..

24 క్యారెట్లు- రూ. 14,248, 22 క్యారెట్లు - రూ. 13,060, 18 క్యారెట్లు - రూ. 10,686

ముంబై..

24 క్యారెట్లు- రూ. 14,263, 22 క్యారెట్లు - రూ. 13,075, 18 క్యారెట్లు - రూ. 10,686

బెంగళూరు..

24 క్యారెట్లు- రూ. 14,263, 22 క్యారెట్లు - రూ. 13,075, 18 క్యారెట్లు - రూ. 10,686

హైదరాబాద్..

24 క్యారెట్లు- రూ. 14,263, 22 క్యారెట్లు - రూ. 13,075, 18 క్యారెట్లు - రూ. 10,686

విజయవాడ..

24 క్యారెట్లు- రూ. 14,263, 22 క్యారెట్లు - రూ. 13,075, 18 క్యారెట్లు - రూ. 10,686

విశాఖపట్నం..

24 క్యారెట్లు- రూ. 14,263, 22 క్యారెట్లు - రూ. 13,075, 18 క్యారెట్లు - రూ. 10,686

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+