పాతాళానికి బంగారం ధరలు
దేశీయంగా బంగారం, వెండి ధరలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోన్నాయి. వారం రోజులుగా పసిడి, వెండి ధరలు భారీగా పతనమవడంతో పెట్టుబడిదారులు ఆందోళన చెందుతున్నారు. ఈ వారం వ్యవధిలోనే దేశీయ మార్కెట్ లో వెండి ధర కిలోకు రూ.10,000 పైగా పడిపోగా, పసిడి ధర 10 గ్రాములకు రూ.6,000 పైగా క్షీణించింది. అంతర్జాతీయంగా చోటుచేసుకుంటున్న పరిణామాలు ఈ భారీ పతనానికి ప్రధాన కారణంగా మారాయి.
అవే పరిస్థితులు నేడు కూడా కొనసాగాయి. దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్ ఎంసీఎక్స్ లో వెండి డిసెంబర్ ఫ్యూచర్స్ ధర వారం రోజుల్లో 4.25 శాతం తగ్గి కిలో రూ. 2,30,970 వద్ద ట్రేడ్ అవుతోంది. ప్రారంభ ట్రేడింగ్ లో వెండి ధర రూ. 3,156 నష్టపోయింది. అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ ధర అమాంతం పడిపోయింది. గురువారం నాటి ట్రేడింగ్ సెషన్ తో పోల్చుకుంటే 24 క్యారెట్ల 20 గ్రాముల బంగారం ధర ఏకంగా రూ. 2,620 మేర క్షీణించింది. 22 క్యారెట్లు రూ. 2,400, 18 క్యారెట్లు రూ. 1,960 దిగజారింది.

10 గ్రాముల బంగారం ధర రూ.1,51,045 వద్ద కొనసాగుతోంది. అంతర్జాతీయంగా కూడా ఈ రెండింటి రేట్లు మల్టీ-వీక్ కనిష్ట స్థాయిలకు పడిపోయాయి. అమెరికా డాలర్ బలోపేతం కావడం, యూఎస్ బాండ్ ఈల్డ్స్ భారీగా పెరగడం బంగారం, వెండి ధరలపై తీవ్ర ప్రభావం చూపాయి. అమెరికా బాండ్ ఈల్డ్స్ పెరిగినప్పుడు, ఎలాంటి వడ్డీ ఆదాయం ఇవ్వని బంగారం, వెండి వంటి ఆస్తులపై పెట్టుబడి పెట్టడం వల్ల వచ్చే ప్రయోజనం తగ్గుతుంది.
పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్నఉద్రిక్తతల వల్ల ముడి చమురు ధరలు పెరగడం కూడా ద్రవ్యోల్బణ భయాలను పెంచింది. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు 109 డాలర్లు దాటింది. వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ క్రూడ్ 104 డాలర్లు దాటింది. పెరుగుతున్న ముడి చమురు ధరలు ద్రవ్యోల్బణాన్ని మరింత పెంచుతాయనే అంచనాలు పెట్టుబడిదారుల నిర్ణయాలను ప్రభావితం చేస్తోన్నాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ మున్ముందు తీసుకోబోయే వడ్డీ రేట్ల నిర్ణయంపైనే ఇప్పుడు అందరి దృష్టి ఉంది.
వివిధ నగరాల్లో నేడు నమోదైన బంగారం రేట్లు ఒక గ్రాముకు ఇలా ఉన్నాయి.
చెన్నై..
24 క్యారెట్లు- రూ. 15,289, 22 క్యారెట్లు - రూ. 14,015, 18 క్యారెట్లు - రూ. 11,785
ముంబై..
24 క్యారెట్లు - రూ. 15,289, 22 క్యారెట్లు- రూ. 14,015, 18 క్యారెట్లు - రూ. 11,467
బెంగళూరు..
24 క్యారెట్లు - రూ. 15,289, 22 క్యారెట్లు- రూ. 14,015, 18 క్యారెట్లు - రూ. 11,467
హైదరాబాద్..
24 క్యారెట్లు - రూ. 15,289, 22 క్యారెట్లు- రూ. 14,015, 18 క్యారెట్లు - రూ. 11,467
విజయవాడ..
24 క్యారెట్లు - రూ. 15,289, 22 క్యారెట్లు- రూ. 14,015, 18 క్యారెట్లు - రూ. 11,467
విశాఖపట్నం..
24 క్యారెట్లు - రూ. 15,289, 22 క్యారెట్లు- రూ. 14,015, 18 క్యారెట్లు - రూ. 11,467












Click it and Unblock the Notifications
