రానున్న రోజుల్లో బంగారం నిలదొక్కుకోవాలంటే..!!

దేశీయ మార్కెట్‌తో పాటు అంతర్జాతీయంగా బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా భారీ పతనాన్ని నమోదు చేస్తూ వస్తోన్నాయి. ప్రత్యేకించి.. వెండి ధరలు దారుణంగా పడిపోతున్నాయి. అమెరికా బాండ్ ఈల్డ్స్ పెరగడం, డాలర్ బలోపేతం కావడం, వడ్డీ రేట్ల పెంపుపై వస్తున్న అంచనాలే పసిడి, వెండి ధరల పతనానికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. ఈ ఒక్కవారంలోనే బంగారం ధరల్లో రూ. 6,000 లకు పైగా తగ్గుదల నమోదు కావడం ఆందోళనకు గురి చేస్తోంది.

దేశీయ మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ ధర 10 గ్రాములకు రూ. 1,296 అంటే.. 0.85 శాతం తగ్గి రూ.1,51,045 వద్ద ట్రేడ్ అయింది. వెండి డిసెంబర్ ఫ్యూచర్స్ వారం రోజుల వ్యవధిలో రూ. 10,241 అంటే.. 4.25 శాతం) నష్టపోయాయి. కేజీ రూ. 2,30,970 వద్ద స్థిరపడింది. శుక్రవారం ఒక్క రోజే వెండి రూ. 3,156 పడిపోవడం గమనార్హం. మున్ముందు ఈ రేట్లు మరింత తగ్గొచ్చనే అంచనాలు వ్యక్తమౌతోన్నాయి. కామెక్స్ లో బంగారం ఔన్స్ కు 4,350 - 4,310 డాలర్లు, ఎంసీఎక్స్ లో రూ.1,51,100 - రూ.1,50,150 కంటే దిగువకు పడిపోవచ్చని అంచనా వేస్తోన్నారు.

Gold and Silver Prices Drop Sharply as US Bond Yields Rise and Dollar Strengthens Resistance Levels

అమెరికాలో ద్రవ్యోల్బణ భయాలు మళ్లీ తెరపైకి రావడంతో ఇన్వెస్టర్లు అప్రమత్తం అయ్యారు. ఆగస్టు నెలకు సంబంధించి యూఎస్ ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్ 0.4 శాతం పెరిగింది. పశ్చిమ ఆసియాలో పెరుగుతున్న యుద్ధ ఉద్రిక్తతల వల్ల చమురు సరఫరాకు ఆటంకం ఏర్పడి ద్రవ్యోల్బణం పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తోన్నాయి. వెస్ట్ టెక్సాస్ ఇండెక్స్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 104 డాలర్లు, బ్రెంట్ క్రూడ్ 109 డాలర్లను దాటాయి.

ఇది చేప.. అనుకుంటే పొరపడ్డట్టే- చైనా మరో ఘనత: సముద్ర గర్భంలో.. !!
ఇది చేప.. అనుకుంటే పొరపడ్డట్టే- చైనా మరో ఘనత: సముద్ర గర్భంలో.. !!

అటు యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ కూడా వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు పెంచి 2.65 శాతానికి చేరింది. ఇది కూడా మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. ఆయా పరిణామాల వల్ల వడ్డీ రహిత బంగారం వంటి ఆస్తులపై పెట్టుబడులకు డిమాండ్ తగ్గింది. ఫలితంగా అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం ధర 1.20 శాతం తగ్గి 4,407.30 డాలర్లు, వెండి ధర 5.42 శాతం క్షీణించి 64.927 డాలర్ల కనిష్టస్థాయికి పడిపోయాయి.

వారం తిరక్కముందే బిగ్ బాస్ లో మరో షాకింగ్ ఎలిమినేషన్: ట్విస్ట్ అద్దిరింది.. !!
వారం తిరక్కముందే బిగ్ బాస్ లో మరో షాకింగ్ ఎలిమినేషన్: ట్విస్ట్ అద్దిరింది.. !!

ధరల పతనం బంగారం, వెండికే పరిమితం కాలేదు. గ్లోబల్ కమోడిటీ మార్కెట్లో పారిశ్రామిక అవసరాలకు వాడే ఇతర మెటల్స్ సైతం భారీ నష్టాలను చవిచూశాయి. కాపర్ గరిష్ఠ స్థాయి నుంచి ఒకే సెషన్‌లో ఏకంగా 600 డాలర్లు దిగివచ్చింది. జింక్ ధరలు నాలుగు శాతం మేర కుప్పకూలాయి. అల్యూమినియం ధర 2.5 శాతం క్షీణించి ఇన్వెస్టర్లకు షాక్ ఇచ్చింది.

తిరుమలలో వారికీ డ్రెస్ కోడ్: టీటీడీ తాజా ఆదేశాలు
తిరుమలలో వారికీ డ్రెస్ కోడ్: టీటీడీ తాజా ఆదేశాలు

రానున్న రోజుల్లో బంగారం రేట్లు నిలదొక్కుకోవాలంటే యూఎస్ కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ (CPI) నివేదిక అత్యంత కీలకం కానుంది. సీపీఐ మీద అందరి చూపూ నిలిచింది. చమురు ధరల పెరుగుదల, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు సద్దుమణిగితే తప్ప బంగారం, వెండి ధరల్లో స్థిరత్వం ఊహించలేమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+