నేడు బంగారం ధరలు తగ్గాయన్న మాటే గానీ.. !!

దేశంలో నేడు బంగారం ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. సోమవారం నాటి రేట్లతో పోల్చుకుంటే దేశవ్యాప్తంగా పసిడి ధరల్లో కొంత ఉపశమనం లభించింది. పండగల సీజన్ నేపథ్యంలో కొనుగోలుదారులు, సామాన్య వినియోగదారులకు కాస్తంత ఊరటనిచ్చే అంశంగా మారింది. అయినప్పటికీ.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1.63 లక్షలకు పైమాటే. ఇప్పుడు తగ్గింది నామమాత్రమే. మున్ముందు మరింత పెరుగుతుందనే అంచనాలు ఉన్నాయి.

దేశీయ మార్కెట్లో నేటి క్రయవిక్రయాల వివరాల ప్రకారం.. అత్యంత స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 1,63,750 రూపాయలుగా నమోదైంది. సోమవారంతో పోలిస్తే 24 క్యారెట్ల ధర 220 రూపాయల మేర తగ్గింది. ఆభరణాల తయారీకి ఎక్కువగా ఉపయోగించే 22 క్యారెట్ల బంగారం ధరలో రూ. 200, 18 క్యారెట్లల్లో రూ. 120 తగ్గుదల కనిపించింది. వారం రోజులుగా క్రమం తప్పకుండా పెరుగుతూ వచ్చిన బంగారం రేట్లకు తాత్కాలికంగా బ్రేక్ పడినట్టయింది.

Gold and silver prices Edged Lower as Dollar strengthen in International weighed on domestic rates

హైదరాబాద్ లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 1,63,750 రూపాయల వద్ద స్థిరపడింది. 22 క్యారెట్లు 10 గ్రాములకు 1,50,100 రూపాయల వద్ద నిలిచింది. 18 క్యారెట్లు రూ. 1,22,810 వద్ద ట్రేడ్ అవుతోంది. చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రూ. 1,63,750, 22 క్యారెట్లు రూ. 1,50,100, 18 క్యారెట్లు రూ. రూ. 1,27,800 గా స్థిరపడింది. ముంబైలో రూ. 1,63,750, 22 క్యారెట్లు రూ. 1,50,100, 18 క్యారెట్లు రూ. 1,22,810 గా నమోదైంది.

చక్కెరపై కేంద్రం తాజా నిర్ణయం
చక్కెరపై కేంద్రం తాజా నిర్ణయం

వివిధ నగరాల్లో నేడు నమోదైన బంగారం రేట్లు ఒక గ్రాముకు ఇలా ఉన్నాయి.

చెన్నై..

24 క్యారెట్లు- రూ. 16,375, 22 క్యారెట్లు - రూ. 15,010, 18 క్యారెట్లు - రూ. 12,780

ముంబై..

24 క్యారెట్లు - రూ. 16,375, 22 క్యారెట్లు- రూ. 15,010, 18 క్యారెట్లు - రూ. 12,281

బెంగళూరు..

24 క్యారెట్లు - రూ. 16,375, 22 క్యారెట్లు- రూ. 15,010, 18 క్యారెట్లు - రూ. 12,281

హైదరాబాద్..

24 క్యారెట్లు - రూ. 16,375, 22 క్యారెట్లు- రూ. 15,010, 18 క్యారెట్లు - రూ. 12,281

విజయవాడ..

24 క్యారెట్లు - రూ. 16,375, 22 క్యారెట్లు- రూ. 15,010, 18 క్యారెట్లు - రూ. 12,281

విశాఖపట్నం..

24 క్యారెట్లు - రూ. 16,375, 22 క్యారెట్లు- రూ. 15,010, 18 క్యారెట్లు - రూ. 12,281

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+