పసిడి ప్రియులకు పండగే.. !!

దేశీయ మార్కెట్‌లో పసిడి ప్రియులకు మరోసారి ఉపశమనం లభించింది. బంగారం ధరలు నేడు తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న ఆందోళనకర పరిస్థితులు, ద్రవ్యోల్బణ భయాలు స్థానిక రిటైల్ విపణిపై స్పష్టమైన ప్రభావం చూపుతోన్నాయి. డాలర్ బలపడటం, ఫెడ్ రిజర్వ్ విధానాలు దీనికి తోడయ్యాయి. రాబోయే పెళ్లిళ్ల సీజన్ లో బులియన్ మార్కెట్‌లో ధరలు మరింత తగ్గడం కొనుగోలుదారుల్లో ఉత్సాహాన్ని నింపినట్టయింది.

శుక్రవారం నాటి చివరి ట్రేడింగ్ సెషన్ తో పోల్చుకుంటే 24 క్యారెట్ల బంగారం ధరలో 820 రూపాయల మేర తగ్గుదల కనిపించింది. 22 క్యారెట్లల్లో రూ. 750, 18 క్యారెట్లల్లో రూ. 620 మేరకు తగ్గాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.1,36,800 వద్ద కొనసాగుతుండగా, ఆభరణాల తయారీకి ఎక్కువగా వాడే 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,25,400 వద్ద స్థిరపడింది. వివాహాల సీజన్ నడుస్తున్న తరుణంలో ఈ స్వల్ప తగ్గింపు కొనుగోలుదారులకు కొంత ఊరటనిస్తోంది.

Gold and silver prices edged lower in domestic market MCX amid continued uncertainty fading hopes

అంతర్జాతీయంగా కూడా బంగారం ధరల్లో క్షీణత నెలకొంది. కామెక్స్ లో 0.3 శాతం తగ్గి స్పాట్ గోల్డ్ ఔన్స్ కు 3,892.42 వద్ద నిలిచింది. డిసెంబర్ డెలివరీ కోసం యూఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ 0.2 శాతం తగ్గింది. 3,895.60 డాలర్లకు చేరుకుంది. పెరుగుతున్న చమురు ధరలు, వడ్డీ రేట్లు దీర్ఘకాలం పాటు అధికంగా ఉంటాయనే అంచనాలు బలపడటంతో కిందటి వారం బులియన్ 4.5 శాతం పడిపోయింది. ఇప్పుడది కొనసాగుతోంది.

టాలీవుడ్ లో హీరోయిన్ గా టీమిండియా స్టార్ ప్లేయర్ మాజీ భార్య డెబ్యూ
టాలీవుడ్ లో హీరోయిన్ గా టీమిండియా స్టార్ ప్లేయర్ మాజీ భార్య డెబ్యూ

హైదరాబాద్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,36,410 వద్ద స్థిరపడింది. 10 గ్రాముల 22 క్యారెట్లు రూ. 1,25,043 గా నమోదైంది. ముంబైలో 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి రేటు రూ. 1,36,140 గా రికార్డు కాగా.. 22 క్యారెట్లు రూ. రూ. 1,24,795 వద్ద ట్రేడ్ అయింది. చెన్నైలో ఇవే రేట్లు వరుసగా రూ. 1,36,590, రూ.1,25,208 వద్ద నిలిచాయి. బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 1,36,300, 22 క్యారెట్లు రూ. 1,24,942 వద్ద కొనసాగుతున్నాయి.

నేడు తెరచుకోనున్న శబరిమల ఆలయం: నీలక్కల్, పంబలో స్పాట్ బుకింగ్- ఏర్పాట్లు
నేడు తెరచుకోనున్న శబరిమల ఆలయం: నీలక్కల్, పంబలో స్పాట్ బుకింగ్- ఏర్పాట్లు

నేడు నమోదైన బంగారం రేట్లు ఒక గ్రాముకు ఇలా ఉన్నాయి

చెన్నై..

24 క్యారెట్లు- రూ. 13,680, 22 క్యారెట్లు - రూ. 12,540, 18 క్యారెట్లు - రూ. 10,260

ముంబై..

24 క్యారెట్లు- రూ. 13,688, 22 క్యారెట్లు - రూ. 12,540, 18 క్యారెట్లు - రూ. 10,260

బెంగళూరు..

24 క్యారెట్లు- రూ. 13,688, 22 క్యారెట్లు - రూ. 12,540, 18 క్యారెట్లు - రూ. 10,260

హైదరాబాద్..

24 క్యారెట్లు- రూ. 13,688, 22 క్యారెట్లు - రూ. 12,540, 18 క్యారెట్లు - రూ. 10,260

విజయవాడ..

24 క్యారెట్లు- రూ. 13,688, 22 క్యారెట్లు - రూ. 12,540, 18 క్యారెట్లు - రూ. 10,260

విశాఖపట్నం..

24 క్యారెట్లు- రూ. 13,688, 22 క్యారెట్లు - రూ. 12,540, 18 క్యారెట్లు - రూ. 10,260

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+