పాతాళానికి పసిడి రేట్లు

దేశీయ మార్కెట్ లో నేడు బంగారం, వెండి ధరలు తీవ్ర ఒత్తిడికి లోనయ్యాయి. భారీగా పడిపోయాయి. ఈ ఉదయం ట్రేడింగ్ లో స్పాట్ గోల్డ్ ఔన్సుకు 4,700 డాలర్లకు స్థిరపడింది. ముగింపు సెషన్ తో పోల్చుకుంటే 0.9 శాతం మేర తగ్గింది. అదేవిధంగా స్పాట్ సిల్వర్ కూడా ఒక శాతం క్షీణించింది. అమెరికా-ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి వెండి ధరలు కనీసం 15 శాతం పడిపోయాయి. మార్కెట్‌లో ఆందోళన ట్రెండ్‌ను అనుసరించి మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ లో గోల్డ్ ధర తగ్గి రూ. 1,53,550 వద్ద నిలిచింది.

ముంబైలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 1,53,550కి చేరగా, 22 క్యారెట్ల బంగారం రూ. 1,40,750 వద్ద లభించింది. అంతర్జాతీయంగా స్పాట్ గోల్డ్ ధర 0.7 శాతం తగ్గి ఔన్సుకు 4,705.09 డాలర్లకు చేరుకుంది. పెరిగిన చమురు ధరల వల్ల ద్రవ్యోల్బణం ఆందోళనలు, వడ్డీ రేట్లు దీర్ఘకాలం అధికంగా ఉండవచ్చనే అంచనాలు బలపడ్డాయి. దీనికి తోడు అమెరికా-ఇరాన్ మధ్య నిలిచిపోయిన శాంతి చర్చలపై స్పష్టత లేకపోవడమూ బంగారం, వెండి ధరలు క్షీణించడానికి ఒక ప్రధాన కారణం.

Gold and Silver Prices Fall in India Today to Rs 153550 in Mumbai 24K 22K Rates in Global Scenario

మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో ప్రారంభ ట్రేడింగ్‌లో బంగారం 0.34 శాతం తగ్గి 10 గ్రాములకు రూ. 1,52,138 వద్ద ట్రేడ్ అయింది. అదే సమయంలో వెండి 1.63 శాతం క్షీణించి కిలోకు రూ. 2,44,309కి పడిపోయింది. ముంబైలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ. 1,53,550, 22 క్యారెట్ల బంగారం ₹1,40,750కి అమ్ముడవుతోంది. ఢిల్లీ, జైపూర్ 22 క్యారెట్ల బంగారం 1,40,900, 24 క్యారెట్లు రూ. 1,53,700 వద్ద ట్రేడ్ అయింది. అహ్మదాబాద్ లో 22 క్యారెట్ల బంగారం రూ. 1,40,800, 24 క్యారెట్లు రూ. 1,53,600 పలుకుతోంది. పుణె, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, కోల్‌కతాల్లో 22 క్యారెట్లు రూ. 1,41,850, 24 క్యారెట్లు 1,53,550 వద్ల లభిస్తోంది.

ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు (గ్రాముకు)

చెన్నై..

24 క్యారెట్లు- రూ. 15,448, 22 క్యారెట్లు - రూ. 14,160, 18 క్యారెట్లు - రూ. 11,810

ముంబై..

24 క్యారెట్లు - రూ. 15,355, 22 క్యారెట్లు- రూ. 14,075, 18 క్యారెట్లు - రూ. 11,516

బెంగళూరు..

24 క్యారెట్లు - రూ. 15,355, 22 క్యారెట్లు- రూ. 14,075, 18 క్యారెట్లు - రూ. 11,516

హైదరాబాద్..

24 క్యారెట్లు - రూ. 15,355, 22 క్యారెట్లు- రూ. 14,075, 18 క్యారెట్లు - రూ. 11,516

విజయవాడ..

24 క్యారెట్లు - రూ. 15,355, 22 క్యారెట్లు- రూ. 14,075, 18 క్యారెట్లు - రూ. 11,516

విశాఖపట్నం..

24 క్యారెట్లు - రూ. 15,355, 22 క్యారెట్లు- రూ. 14,075, 18 క్యారెట్లు - రూ. 11,516

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+