పసిడి రేట్లను తీవ్రంగా ప్రభావితం చేస్తోన్న ఆ పరిణామాలు- ఈ వారంలో.. !!
దేశీయంగా బంగారం, వెండి ధరల హెచ్చుతగ్గులు సగటు వినియోగదారుడితో పాటు పెట్టుబడిదారులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. అంతర్జాతీయంగా చోటుచేసుకుంటున్న పరిణామాలు, ప్రపంచ వ్యాప్త ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, కరెన్సీ మార్పిడి రేట్ల దెబ్బకు బులియన్ మార్కెట్ లో అస్థిరత నెలకొంది. ఈ వారం మొత్తం కూడా బంగారం, వెండి ధరలలో ఎత్తు పల్లాలు నమోదయ్యాయి. రానున్న పండుగల సీజన్ నేపథ్యంలో వీటి ధరలు మున్ముందు ఎలా ఉండబోతాయనేది చర్చనీయాంశమైంది.
ప్రస్తుత వివరాల ప్రకారం.. దేశంలో అత్యంత స్వచ్ఛమైన 24 క్యారెట్ల (999 ప్యూర్ గోల్డ్) 10 గ్రాముల బంగారం ధర రూ. 1,42,520 వద్ద కొనసాగుతోంది. ఆభరణాల తయారీలో విస్తృతంగా ఉపయోగించే 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 1,30,640 గా నమోదైంది. 18 క్యారెట్ల పసిడి ధర 10 గ్రాములకు రూ. 1,07,470 రూపాయల వద్ద ట్రేడ్ అయింది. కిందటి వారంలో నమోదైన హెచ్చుతగ్గులు ఇక ముందు కూడా కొనసాగడానికే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.

ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 1,43,440 గా నమోదైంది. ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,43,290, 22 క్యారెట్లు రూ. 1,31,350, బెంగళూరులో 24 క్యారెట్లు, రూ. 1,43,290, 22 క్యారెట్లు రూ. 1,31,350 వద్ద రికార్డ్ అయ్యాయి. హైదరాబాద్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,43,290గా ఉండగా, 22 క్యారెట్లు రూ. 1,31,350 వద్ద స్థిరపడ్డాయి. విజయవాడ, విశాఖపట్నం వంటి ప్రధాన నగరాల్లోనూ దాదాపు ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ఈ రేట్లలో జీఎస్టీ, మేకింగ్ ఛార్జీలు, స్థానిక పన్నులను చేర్చలేదు.
పసిడి బాటలోనే వెండి ధరలు కూడా సాగుతున్నాయి. దేశంలో ప్రస్తుతం ఒక కిలో వెండి ధర సుమారు రూ. 2,29,900 వద్ద కొనసాగుతోంది. అదే సమయంలో సిల్వర్ 925 ధర కిలోకు రూ. 2,34,000 కు చేరుకుంది. ఢిల్లీ, ముంబై, కోల్‌కతా నగరాలలో 999 స్వచ్ఛత గల వెండి ధర కేజీ రూ. 2,29,900 వద్ద ట్రేడవుతోంది. ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ పరిణామాలు, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల విధానాలు బంగారం, వెండి ధరలను నిర్ణయించడంలో కీలకంగా మారాయి.
ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు (గ్రాముకు)
చెన్నై..
24 క్యారెట్లు- రూ. 14,329, 22 క్యారెట్లు - రూ. 13,135, 18 క్యారెట్లు - రూ. 10,950
ముంబై..
24 క్యారెట్లు - రూ. 14,329, 22 క్యారెట్లు- రూ. 13,135, 18 క్యారెట్లు - రూ. 10,747
బెంగళూరు..
24 క్యారెట్లు - రూ. 14,329, 22 క్యారెట్లు- రూ. 13,135, 18 క్యారెట్లు - రూ. 10,747
హైదరాబాద్..
24 క్యారెట్లు - రూ. 14,329, 22 క్యారెట్లు- రూ. 13,135, 18 క్యారెట్లు - రూ. 10,747
విజయవాడ..
24 క్యారెట్లు - రూ. 14,329, 22 క్యారెట్లు- రూ. 13,135, 18 క్యారెట్లు - రూ. 10,747
విశాఖపట్నం..
24 క్యారెట్లు - రూ. 14,329, 22 క్యారెట్లు- రూ. 13,135, 18 క్యారెట్లు - రూ. 10,747












Click it and Unblock the Notifications