బంగారం ధరలు తగ్గట్లేదు- అదే దూకుడు
దేశవ్యాప్తంగా పండుగల సీజన్ నడుస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో దేశీయంగా బంగారం, వెండి ధరల పెరుగుదల కొనసాగుతోంది. నేడు పసిడి ధరలు స్వల్పంగా పుంజుకొన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లల్లో చోటుచేసుకుంటోన్న పరిణామాలు, పశ్చిమాసియాలో చల్లారని ఉద్రిక్తతలు, అమెరికా డాలర్ విలువ, ట్రెజరీ బాండ్ల రాబడులు క్షీణించడం.. వంటి పలు ఆర్థిక కారణాల వల్లే దేశీయంగా బంగారం, వెండికి ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది.
దేశీయ మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ లో పసిడి ధర 0.59 శాతం లాభపడింది. 10 గ్రాముల 24 క్యారరెట్ల బంగారం ధర 1.50 లక్షల రూపాయల మార్క్ ను అధిగమించింది. అదే క్రమంలో వెండి ఫ్యూచర్స్ ధర కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో పెరిగింది. ఎంసీఎక్స్ లో 1.12 శాతం పెరుగుదలను నమోదు చేసుకుంది. కిలోకు 2,24,180 రూపాయల వద్ద ట్రేడింగ్ అవుతోంది. ఈ పెరుగుదల.. పండగ సీజన్ లో సామాన్య కొనుగోలుదారులపై అదనపు భారాన్ని మోపినట్టయింది.

శుక్రవారం నాటి క్లోజింగ్ ట్రేడింగ్ సమయానికి 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరలో రూ. 710 పెరుగుదల కనిపించింది. 22 క్యారెట్లు రూ. 650, 18 క్యారెట్లు రూ. 540 మేర పెరిగాయి. హైదరాబాద్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,51,420 వద్ద ట్రేడ్ అయింది. 22 క్యారెట్లు రూ. 1,38,800 వద్ద స్థిరపడగా.. వెండి రూ. 2,26,110 గా నమోదైంది.
ముంబైలో 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి రేటు రూ. 1,51,420 కాగా 22 క్యారెట్లు రూ. 1,38,800 వద్ద కొనసాగుతోంది. ఇక్కడ వెండి కిలో రూ. 2,26,770 పలుకుతోంది. బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు రూ. 1,51,400గా రికార్డయింది. 22 క్యారెట్లు రూ. 1,38,800, వెండి రూ. 2,26,930 వద్డ ట్రేడింగ్ అయ్యాయి. చెన్నైలో ఇవే రేట్లు వరుసగా రూ. 1,51,420, రూ. 1,38,880, రూ. 2,26,000 గా రికార్డయ్యాయి.
వివిధ నగరాల్లో నేడు నమోదైన బంగారం రేట్లు ఒక గ్రాముకు ఇలా ఉన్నాయి.
చెన్నై..
24 క్యారెట్లు- రూ. 15,142, 22 క్యారెట్లు - రూ. 13,880, 18 క్యారెట్లు - రూ. 11,400
ముంబై..
24 క్యారెట్లు- రూ. 15,142, 22 క్యారెట్లు - రూ. 13,880, 18 క్యారెట్లు - రూ. 11,357
బెంగళూరు..
24 క్యారెట్లు- రూ. 15,142, 22 క్యారెట్లు - రూ. 13,880, 18 క్యారెట్లు - రూ. 11,357
హైదరాబాద్..
24 క్యారెట్లు- రూ. 15,142, 22 క్యారెట్లు - రూ. 13,880, 18 క్యారెట్లు - రూ. 11,357
విజయవాడ..
24 క్యారెట్లు- రూ. 15,142, 22 క్యారెట్లు - రూ. 13,880, 18 క్యారెట్లు - రూ. 11,357
విశాఖపట్నం..
24 క్యారెట్లు- రూ. 15,142, 22 క్యారెట్లు - రూ. 13,880, 18 క్యారెట్లు - రూ. 11,357












Click it and Unblock the Notifications
