ఎంత పెరిగిందో.. అంతా తగ్గుతోంది: బంగారం ధరల్లో భారీ పతనం
భారత్ లో నేడు బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. గ్లోబల్ మార్కెట్‌లో చోటుచేసుకుంటున్న తాజా పరిణామాల.. ప్రత్యేకించి మధ్యప్రాచ్యంలో నెలకున్న అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు ఇందుకు కారణమౌతున్నాయి. బంగారం ధరలు గత కొన్ని రోజులుగా స్థిరంగా పెరుగుతూ వచ్చినప్పటికీ.. ఒక్కసారిగా గిరాకీ తగ్గడంతో ధరలు దిగివచ్చాయి. దీంతో వినియోగదారులకు కొంత ఉపశమనం లభించినట్లయింది.
దేశీయ మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ 10 గ్రాముల బంగారం ధర 0.75 శాతం నష్టంతో రూ.1,58,410 వద్ద ట్రేడ్ అవుతోంది. గురువారం నాటి క్లోజింగ్ సెషన్ తో పోల్చుకుంటే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరలో 3,160 రూపాయల తగ్గుదల కనిపించింది. 22 క్యారెట్లు 2,900, 18 క్యారెట్లు 2,370 రూపాయల వరకు పడిపోయింది. అటు గ్లోబల్ మార్కెట్‌లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. స్పాట్ గోల్డ్ ధర 0.5 శాతం తగ్గి ఔన్సుకు 4,576.30 డాలర్ల వద్ద ముగిసింది.

యుఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ ధర సైతం 0.8 శాతం క్షీణించి 4,629 డాలర్లకు పడిపోయింది. ఈ నేపథ్యంలో బంగారం కొనుగోలుదారులు, పెట్టుబడిదారులు అంతర్జాతీయ పరిణామాలను నిశితంగా జాగ్రత్తగా గమనిస్తోన్నారు. పసిడి బాటలోనే వెండి ధర కూడా పయనించింది. ఎంసీఎక్స్ వెండి ఫ్యూచర్స్ 0.43 శాతం క్షీణించి కిలో వెండి రూ.2,40,750 వద్ద కొనసాగుతోంది. ఈ మధ్యకాలంలో ఈ స్థాయిలో బంగారం, వెండి రేట్లు తగ్గడం ఇదే తొలిసారి.
ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 1,58,430 వద్ద ట్రేడ్ అవుతోంది. 22 క్యారెట్లు రూ. 1,45,228గా రికార్డయింది. ఇక్కడ వెండి కిలో రూ. 2,40,150 వద్ద లభిస్తోంది. బెంగళూరులో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,58,340 కాగా 22 క్యారెట్లు రూ. 1,45,145 ల వద్ద నిలిచింది. వెండి కిలో రూ. 2,40,510 వద్ద ట్రేడ్ అయింది. హైదరాబాద్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు రూ. 1,58,460 పలకగా.. 22 క్యారెట్లు రూ. 1,45,255, వెండి కిలో రూ. 2,40,700 వద్ద నిలిచింది. చెన్నైలో 24 క్యారెట్లు రూ. 1,58,670, 22 క్యారెట్లు రూ. 1,45,448, వెండి కిలో రూ. 2,41,020 వద్ద కొనసాగుతోంది.
వివిధ నగరాల్లో నేడు నమోదైన బంగారం రేట్లు ఒక గ్రాముకు ఇలా ఉన్నాయి.
చెన్నై..
24 క్యారెట్లు- రూ. 15,982, 22 క్యారెట్లు - రూ. 14,650, 18 క్యారెట్లు - రూ. 12,420
ముంబై..
24 క్యారెట్లు - రూ. 15,982, 22 క్యారెట్లు- రూ. 14,650, 18 క్యారెట్లు - రూ. 11,987
బెంగళూరు..
24 క్యారెట్లు - రూ. 15,982, 22 క్యారెట్లు- రూ. 14,650, 18 క్యారెట్లు - రూ. 11,987
హైదరాబాద్..
24 క్యారెట్లు - రూ. 15,982, 22 క్యారెట్లు- రూ. 14,650, 18 క్యారెట్లు - రూ. 11,987
విజయవాడ..
24 క్యారెట్లు - రూ. 15,982, 22 క్యారెట్లు- రూ. 14,650, 18 క్యారెట్లు - రూ. 11,987
విశాఖపట్నం..
24 క్యారెట్లు - రూ. 15,982, 22 క్యారెట్లు- రూ. 14,650, 18 క్యారెట్లు - రూ. 11,987













Click it and Unblock the Notifications