బంగారం ప్రియులకు బిగ్ షాక్.. ప్రధాన నగరాల్లో తాజా రేట్లు ఇవే..!

బంగారం, వెండి ప్రియులకు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. మొన్నటివరకు భారీగా క్షీణిస్తూ వచ్చిన పసిడి ధరలకు బ్రేక్ పడింది. వీటి రేట్లన్నీ కూడా షార్ప్ గా రివర్స్ గేర్ తీసుకున్నాయి. అమాంతం పెరిగాయి. బంగారం ధరలు రోజుకో రకంగా మారుతుండటంతో ఎప్పుడు కొనాలో తెలియక కస్టమర్లు అయోమయంలో ఉన్నారు. ఈ నెల ప్రారంభం నుంచి పసిడి ధరలు భారీగా మార్పులు కనిపిస్తున్నాయి. నేడు 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం (99.9 శాతం ప్యూరిటీ) ధర గ్రాముకు రూ.38 పెరిగి రూ.14,324 రూపాయల వద్ద ట్రేడవుతోంది. అదేవిధంగా ఆభరణాల తయారీకి ఎక్కువగా ఉపయోగించే 22 క్యారెట్ల బంగారం (91.6 శాతం స్వచ్ఛత) ధర కూడా పుంజుకుని 13,275 రూపాయల వద్ద కొనసాగుతోంది.

మధ్యతరగతి కొనుగోలుదారులు ఎక్కువగా ఇష్టపడే 18 క్యారెట్ల బంగారం ధర కూడా స్వల్పంగా పెరిగింది. ప్రస్తుతం 18 క్యారెట్ల పసిడి రేటు అంతకుముందు ధరతో పోలిస్తే కొద్దిగా పెరిగింది. గ్రాముకు 10,862 రూపాయలుగా రికార్డైంది. ఇవి బేసిక్ రేట్లు మాత్రమే. వీటిపై జీఎస్టీ, మేకింగ్ ఛార్జీలు అదనంగా ఉంటాయి. దేశంలోని వివిధ ప్రధాన నగరాల్లో పన్ను నిబంధనలు, స్థానిక రవాణా ఖర్చులు, అసోసియేషన్ నిర్ణయాలను బట్టి పసిడి ధరల్లో తేడాలుంటాయి.

Gold and Silver prices Rises Slightly in India Today amid US Iran Tensions in World Wide

ముఖ్యంగా హైదరాబాద్‌తో పాటు విజయవాడ, వైజాగ్, బెంగళూరు, ముంబై నగరాల్లో బంగారం ధరలు ఒకే విధంగా ఉన్నాయి. చెన్నైలో మాత్రం దేశంలోని ఇతర మెట్రో నగరాల కంటే ధరలు కొద్దిగా ఎక్కువగా నమోదవుతుంటాయి. హైదరాబాద్ లో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 1,44,820, 22 క్యారెట్లు రూ. 1,32,750లుగా రికార్డయ్యాయి. చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,45,640, 22 క్యారెట్లు రూ. 1,33,500 రూపాయల వద్ద ట్రేడ్ అయింది.

ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు (గ్రాముకు)

చెన్నై..

24 క్యారెట్లు- రూ. 14,564, 22 క్యారెట్లు - రూ. 13,350, 18 క్యారెట్లు - రూ. 11,170

ముంబై..

24 క్యారెట్లు - రూ. 14,324, 22 క్యారెట్లు- రూ. 13,275, 18 క్యారెట్లు - రూ. 10,862

బెంగళూరు..

24 క్యారెట్లు - రూ. 14,324, 22 క్యారెట్లు- రూ. 13,275, 18 క్యారెట్లు - రూ. 10,862

హైదరాబాద్..

24 క్యారెట్లు - రూ. 14,324, 22 క్యారెట్లు- రూ. 13,275, 18 క్యారెట్లు - రూ. 10,862

విజయవాడ..

24 క్యారెట్లు - రూ. 14,324, 22 క్యారెట్లు- రూ. 13,275, 18 క్యారెట్లు - రూ. 10,862

విశాఖపట్నం..

24 క్యారెట్లు - రూ. 14,324, 22 క్యారెట్లు- రూ. 13,275, 18 క్యారెట్లు - రూ. 10,862

వెండి ధరలు
వెండి ధరలు కేజీకి రూ. 2,45, 00 వద్ద కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో నగరాన్ని బట్టి ధరల్లో స్వల్వ తేడాలు ఉండొచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+