వరలక్ష్మీ వ్రతం వేళ.. బంగారం ప్రియులకు బిగ్ షాక్
అంతర్జాతీయంగా చోటుచేసుకుంటున్న కీలక పరిణామాల నేపథ్యంలో దేశీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు మరోసారి పుంజుకున్నాయి. అమెరికాలో సంభవిస్తోన్న ఆర్థిక మార్పులతో పాటు భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు పసిడి ధరలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. మధ్యప్రాచ్యంలో అమెరికా, ఇరాన్ మధ్య నెలకొన్న తాజా పరిస్థితులు దీనికి ఆజ్యం పోస్తోంది. పసిడి రేట్లను పరుగులు పెట్టిస్తోన్నాయి.
దీనికి తోడు అమెరికా డాలర్ బలహీనపడటం, యూఎస్ ట్రెజరీ బాండ్ల కొనుగోలు వ్యూహం కూడా పసిడి సురక్షితమైన పెట్టుబడిగా మారడానికి దోహదం చేసింది. ఫలితంగా.. బంగారాన్ని కొనుగోలు చేయడానికి ఎగబడుతున్నారు. దీని ప్రభావంతో వీటి రేట్లు నేడు భారీగా పుంజుకొన్నాయి. కామెక్స్ లో స్పాట్ గోల్డ్ ధర 0.5 శాతం మేర లాభపడి ఔన్స్‌కు 4,540.18 డాలర్ల వద్ద స్థిరపడింది. అమెరికా గోల్డ్ ఫ్యూచర్స్ సైతం 0.6 శాతం పెరిగి 4,596.60 డాలర్ల మార్కును తాకింది.

దేశీయంగా మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ లో పసిడి ధర 0.19 శాతం లాభంతో రూ.1,60,180 వద్ద కొనసాగుతోంది. వెండి ఫ్యూచర్స్ ధర కూడా 0.65 శాతం లాభంతో రూ.2,45,990 వద్ద ట్రేడం అవుతోంది. గురువారం నాటి క్లోజింగ్ సెషన్స్ తో పోల్చుకుంటే నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరలో 1,210 రూపాయల పెరుగుదల కనిపించింది. 22 క్యారెట్లు రూ. 1,110, 18 క్యారెట్లు రూ. 900 మేర పెరిగింది.
ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,59,740 కు చేరింది. 22 క్యారెట్లు రూ.1,46,428, వెండి కిలో రూ.2,45,220 వద్ద స్థిరపడింది. బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,59,870 కాగా 22 క్యారెట్లు రూ.1,46,548, వెండి కిలో రూ. 2,45,420 వద్ద ట్రేడ్ అయింది. హైదరాబాద్ లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం దర రూ.1,59,990, 22 క్యారెట్లు రూ. 1,46,658 కాగా వెండి కిలో రూ. 2,45,610 వద్ద నిలిచింది. చెన్నైలో ఇవే ధరలు వరుసగా రూ.1,60,200, రూ.1,46,850, రూ.2,45,940 వద్ద కొనసాగుతున్నాయి.
వివిధ నగరాల్లో నేడు నమోదైన బంగారం రేట్లు ఒక గ్రాముకు ఇలా ఉన్నాయి.
వివిధ నగరాల్లో నేడు నమోదైన బంగారం రేట్లు ఒక గ్రాముకు ఇలా ఉన్నాయి.
చెన్నై..
24 క్యారెట్లు- రూ. 16,048, 22 క్యారెట్లు - రూ. 14,710, 18 క్యారెట్లు - రూ. 12,490
ముంబై..
24 క్యారెట్లు - రూ. 16,048, 22 క్యారెట్లు- రూ. 14,710, 18 క్యారెట్లు - రూ. 12,036
బెంగళూరు..
24 క్యారెట్లు - రూ. 16,048, 22 క్యారెట్లు- రూ. 14,710, 18 క్యారెట్లు - రూ. 12,036
హైదరాబాద్..
24 క్యారెట్లు - రూ. 16,048, 22 క్యారెట్లు- రూ. 14,710, 18 క్యారెట్లు - రూ. 12,036
విజయవాడ..
24 క్యారెట్లు - రూ. 16,048, 22 క్యారెట్లు- రూ. 14,710, 18 క్యారెట్లు - రూ. 12,036
విశాఖపట్నం..
24 క్యారెట్లు - రూ. 16,048, 22 క్యారెట్లు- రూ. 14,710, 18 క్యారెట్లు - రూ. 12,036

Click it and Unblock the Notifications