బంగారం ధరల్లో డౌన్ ఫాల్ ఆరంభం

దేశీయ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు మళ్లీ తగ్గాయి. మల్టీ కమొడిటీ ఎక్స్ఛేంజ్ ట్రేడింగ్ ప్రారంభంలోనే వీటి ధరలు నష్టాల బాట పట్టాయి. అంతర్జాతీయంగా నెలకొన్న పరిణామాలు వీటి రేట్లను ప్రభావితం చేస్తోన్నాయి. పండగల సీజన్ నేపథ్యంలో కొనుగోలుదారులు, సామాన్య వినియోగదారులకు కాస్తంత ఊరటనిచ్చే అంశంగా మారింది. అయినప్పటికీ.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1.60 లక్షల వరకు ఉంటోంది.

ఎంసీఎక్స్ సెప్టెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ 0.36 శాతం వరకు తగ్గింది. బుధవారం నాటితో పోల్చుకుంటే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరలో 10 గ్రాములకు రూ. 770 మేర తగ్గింది. 22 క్యారెట్లు రూ. 700, 18 క్యారెట్లు రూ. 570 మేర తగ్గుముఖం పట్టింది. వెండి ధరల్లోనూ అదే ట్రెండ్ కనిపించింది గానీ అది పరిమితమే. వెండి ఫ్యూచర్స్ ధర కేజీకి 0.84 శాతం తగ్గుదల నమోదు చేసుకుంది. రూ. 2,41,648 వద్ద ట్రేడం అవుతోంది.

Gold and silver prices were trading Lower on the MCX after the both precious metals gaining Previous trading

హైదరాబాద్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,60,780, 22 క్యారెట్లు రూ.1,47,382 వద్ద స్థిరపడింది. ఇక్కడ వెండి కిలో రూ. 2,42,950 ఉంటోంది. చెన్నైలో 19 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,60,990 కాగా 22 క్యారెట్లు రూ.1,47,574, వెండి రూ.2,43,280 లుగా నమోదైంది. బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు రూ.1,60,660 ఉండగా.. 22 క్యారెట్లు రూ.1,47,272 పలుకుతోంది. ఇక్కడ వెండి ధర కిలోకు రూ. 2,42,740 నమోదైంది. ముంబైలో బంగారం 24 క్యారెట్లకు రూ.1,60,530, 22 క్యారెట్లు రూ.1,47,153 ఉంటోంది.

రేపే.. జనసేన కీలక భేటీ: మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు పిలుపు.. !!
రేపే.. జనసేన కీలక భేటీ: మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు పిలుపు.. !!

వివిధ నగరాల్లో నేడు నమోదైన బంగారం రేట్లు ఒక గ్రాముకు ఇలా ఉన్నాయి.

చెన్నై..

24 క్యారెట్లు- రూ. 16,298, 22 క్యారెట్లు - రూ. 14,940, 18 క్యారెట్లు - రూ. 12,710

ముంబై..

24 క్యారెట్లు - రూ. 16,298, 22 క్యారెట్లు- రూ. 14,940, 18 క్యారెట్లు - రూ. 12,224

బెంగళూరు..

24 క్యారెట్లు - రూ. 16,298, 22 క్యారెట్లు- రూ. 14,940, 18 క్యారెట్లు - రూ. 12,224

హైదరాబాద్..

24 క్యారెట్లు - రూ. 16,298, 22 క్యారెట్లు- రూ. 14,940, 18 క్యారెట్లు - రూ. 12,224

విజయవాడ..

24 క్యారెట్లు - రూ. 16,298, 22 క్యారెట్లు- రూ. 14,940, 18 క్యారెట్లు - రూ. 12,224

విశాఖపట్నం..

24 క్యారెట్లు - రూ. 16,298, 22 క్యారెట్లు- రూ. 14,940, 18 క్యారెట్లు - రూ. 12,224

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+