బంగారం ధరల్లో మరో మహా పతనం

భారత్ లో బంగారం, వెండి ధరలు పతనమౌతూనే వస్తోన్నాయి. దీనికి బ్రేకులు పడట్లేదు. అంతర్జాతీయంగా నెలకొన్న పరిణామాలు, గ్లోబల్ కమోడిటీ మార్కెట్లలో తలనెత్తిన హెచ్చుతగ్గులు, డాలర్ ఒడిదుడుకులు, ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లు.. ఇందుకు ప్రధాన కారణం అయ్యాయి. ఫలితంగా నేడు దేశంలో బంగారం, వెండి రేట్లు మరోసారి తగ్గుముఖం పట్టాయి. గురువారం నాటి ట్రేడింగ్‌తో పోల్చుకుంటే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరలో 1900 రూపాయల మేర తగ్గుదల నమోదైంది. 22 క్యారెట్లు రూ. 1,750, 18 క్యారెట్లు రూ. 1,430 మేర తగ్గాయి.

వెండి ధరలు కూడా అదే బాట పట్టాయి. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో వెండి 2.5 శాతం క్షీణించి ఇంట్రాడేలో కిలో రూ. 1.95 లక్షల కనిష్ట స్థాయికి పడిపోయింది. బంగారం ధర సుమారు ఒక శాతం మేర పడిపోయి 10 గ్రాములకు రూ. 1,42,300 లకు చేరుకుంది. అంతర్జాతీయంగా స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు 4,015 డాలర్ల వద్ద కొనసాగినప్పటికీ.. ఆ తర్వాత భారీగా క్షీణించింంది. 4,000 డాలర్ల వైపు అడుగులు వేస్తోంది.

Gold and Silver Rates Crashed at MCX in India Ahead of Dhanteras 24K 22K and 18K Fallen down

స్పాట్ సిల్వర్ ధర ఏకంగా 54 డాలర్ల దిగువకు జారిపోయింది. 2025 నవంబర్ తర్వాత అత్యంత కనిష్ట స్థాయిని నమోదు చేసింది. ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచితే, బాండ్ ఈల్డ్‌, యుఎస్ డాలర్ మరింత బలోపేతమవుతాయి. ఇటువంటి సమయాల్లో ఎటువంటి వడ్డీ రాబడి లేని బంగారం, వెండి వంటి సురక్షిత సాధనాల్లో పెట్టుబడులు పెట్టడానికి ఇన్వెస్టర్లు పెద్దగా ఆసక్తి చూపరు.

భారత్ లో యాపిల్ ఐఫోన్ ఫోల్డబుల్ డ్యూయో ఎంట్రీ: ఎక్స్ఛేంజ్, క్యాష్ బ్యాక్ ఆఫర్లు
భారత్ లో యాపిల్ ఐఫోన్ ఫోల్డబుల్ డ్యూయో ఎంట్రీ: ఎక్స్ఛేంజ్, క్యాష్ బ్యాక్ ఆఫర్లు

హైదరాబాద్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,42,480, 22 క్యారెట్లు రూ. 1,30,060 గా రికార్డయ్యాయి. ఇక్కడ వెండి కిలో రూ. 2,02,140 గా నమోదైంది. చెన్నైలో 10 గ్రాముల బంగారం ధర 24 క్యారెట్లకు రూ. 1,42,810, 22 క్యారెట్లకు రూ. 1,30,350 కాగా వెండి 2,03,220 వద్ద ట్రేడ్ అయింది. ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు రూ. 1,42,480, రూ. 1,30,280 కాగా వెండి కిలో రూ. 2,02,910 వద్ద స్థిరపడ్డాయి. బెంగళూరులో 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 1,42,490, 22 క్యారెట్లు రూ. 1,30,116, వెండి రూ. 2,01,770 గా నమోదైంది.

ఎల్లుండి బంగాళాఖాతంలో వాయుగుండం: ఏపీలోని ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు
ఎల్లుండి బంగాళాఖాతంలో వాయుగుండం: ఏపీలోని ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు

నేడు నమోదైన బంగారం రేట్లు ఒక గ్రాముకు ఇలా ఉన్నాయి

చెన్నై..

24 క్యారెట్లు- రూ. 14,248, 22 క్యారెట్లు - రూ. 13,060, 18 క్యారెట్లు - రూ. 10,686

ముంబై..

24 క్యారెట్లు- రూ. 14,263, 22 క్యారెట్లు - రూ. 13,075, 18 క్యారెట్లు - రూ. 10,686

బెంగళూరు..

24 క్యారెట్లు- రూ. 14,263, 22 క్యారెట్లు - రూ. 13,075, 18 క్యారెట్లు - రూ. 10,686

హైదరాబాద్..

24 క్యారెట్లు- రూ. 14,263, 22 క్యారెట్లు - రూ. 13,075, 18 క్యారెట్లు - రూ. 10,686

విజయవాడ..

24 క్యారెట్లు- రూ. 14,263, 22 క్యారెట్లు - రూ. 13,075, 18 క్యారెట్లు - రూ. 10,686

విశాఖపట్నం..

24 క్యారెట్లు- రూ. 14,263, 22 క్యారెట్లు - రూ. 13,075, 18 క్యారెట్లు - రూ. 10,686

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+