పసిడి గమనం- భారీగా సెల్ ఆఫ్: మున్ముందు మరింత?
గ్లోబల్ మార్కెట్‌లో చోటుచేసుకుంటున్న శరవేగ పరిణామాల నేపథ్యంలో దేశీయంగా బంగారం, వెండి ధరలు భారీగా క్షీణించాయి. గత వారం రోజులుగా పసిడి, వెండి ధరల్లో తీవ్ర అమ్మకాల ఒత్తిడి కనిపించింది. దేశీయంగా మల్టీ కమొడిటీ ఎక్స్ఛేంజ్ (MCX) లో 10 గ్రాముల బంగారం ధర కీలకమైన రూ. 1.50 లక్షల మార్కు కంటే దిగువకు పడిపోగా, వెండి ధర కూడా ఊహించని రీతిలో భారీగా పతనమై ఇన్వెస్టర్లను ఆందోళనకు గురిచేసింది.
అమెరికాలో అంచనాలకు మించి నమోదైన ఉద్యోగాల గణాంకాలు, బలోపేతమైన డాలర్ ఇండెక్స్, ముడి చమురు ధరల అకస్మాత్తు పరుగు ఈ పతనానికి ప్రధాన కారణాలుగా నిలిచాయి. ఇరాన్‌పై దాడులు తీవ్రతరం చేస్తామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ మార్కెట్‌లో తీవ్ర భయాలను రేకెత్తించాయి. దీనివల్ల అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను ఎక్కువ కాలం పాటు గరిష్ట స్థాయిలోనే ఉంచుతుందనే అంచనాలు బలపడి పసిడిపై ఒత్తిడి పెంచాయి.

ప్రస్తుతం దేశీయ రిటైల్ మార్కెట్‌లో బంగారం ధర 10 గ్రాములకు రూ. 1.48 లక్షల నుంచి రూ. 1.49 లక్షల మధ్య ట్రేడవుతోంది. అదే సమయంలో కిలో వెండి ధర రూ. 2.50 లక్షల వద్ద కొనసాగుతోంది. రానున్న రోజుల్లో పసిడి గమనంపై మార్కెట్ విశ్లేషకులు సానుకూల అంచనాలు వ్యక్తం చేస్తున్నారు. ఎస్‌ఎంసీ గ్లోబల్ సెక్యూరిటీస్ నిపుణుల విశ్లేషణల ప్రకారం అంతర్జాతీయ పరిణామాలు అనుకూలిస్తే ఎంసీఎక్స్ బంగారం ధరలు రూ. 1.50 లక్షల నుంచి రూ. 1.550 లక్షల పరిధిలో కదలాడే అవకాశం ఉంది.
అలాగే వెండి ధరలు సైతం రూ. 2.50 లక్షల నుంచి రూ. 2.60 లక్షల బ్రాడ్ రేంజ్‌లో స్థిరంగా సాగవచ్చని బ్రోకరేజ్ సంస్థల విశ్లేషణలు వెల్లడిస్తున్నాయి. ప్రస్తుతం నెలకొన్న ఆర్థిక అనిశ్చితి సమయంలో బంగారాన్ని కేవలం ఒక రక్షణ ఆస్తిగా కాకుండా, కేంద్ర బ్యాంకులు తమ కొనుగోలు వ్యూహాల్లో భాగంగా వాడుతున్నాయి. అంతర్జాతీయ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తగ్గి, ముడి చమురు ధరలు మళ్లీ స్థిరపడే వరకు పసిడి మార్కెట్‌లో తీవ్రమైన ఒడిదొడుకులు కొనసాగే అవకాశం కనిపిస్తోంది.
చెన్నై..
24 క్యారెట్లు- రూ. 14,334, 22 క్యారెట్లు - రూ. 13,139, 18 క్యారెట్లు - రూ. 10,980
ముంబై..
24 క్యారెట్లు - రూ. 14,160, 22 క్యారెట్లు- రూ. 12,980, 18 క్యారెట్లు - రూ. 10,620
బెంగళూరు..
24 క్యారెట్లు - రూ. 14,160, 22 క్యారెట్లు- రూ. 12,980, 18 క్యారెట్లు - రూ. 10,620
హైదరాబాద్..
24 క్యారెట్లు - రూ. 14,160, 22 క్యారెట్లు- రూ. 12,980, 18 క్యారెట్లు - రూ. 10,620
విజయవాడ..
24 క్యారెట్లు - రూ. 14,160, 22 క్యారెట్లు- రూ. 12,980, 18 క్యారెట్లు - రూ. 10,620
విశాఖపట్నం..
24 క్యారెట్లు - రూ. 14,160, 22 క్యారెట్లు- రూ. 12,980, 18 క్యారెట్లు - రూ. 10,620












Click it and Unblock the Notifications