పసిడి ధరల్లో బిగ్ లాస్- వారం రోజుల్లో భారీ తగ్గుదల నమోదు
దేశీయంగా ఈ వారం పసిడి ధరలు భారీగా పతనం అయ్యాయి. గత వారం గరిష్టంగా నమోదైన రూ.1,47,850 ధరతో పోలిస్తే మార్కెట్లలో స్పష్టమైన తగ్గుదల కనిపించింది. వారాంతంలో కమొడిటీ మార్కెట్లల్లో కార్యకలాపాలు నమోదు కాకపోవడం వల్ల శుక్రవారం నాటి క్లోజింగ్ సెషన్ రేట్లే నేడు అమలులో ఉంటోన్నాయి. శుక్రవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి 10 గ్రాముల బంగారం ధర 1,44,020 రూపాయల వద్ద నిలిచింది.
పశ్చిమాసియాలో అమెరికా, ఇరాన్ దేశాల మధ్య మళ్లీ మొదలైన భౌగోళిక రాజకీయ ఘర్షణలు ప్రపంచ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. వ్యూహాత్మక ప్రాధాన్యత కలిగిన స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు చోటు చేసుకోవడం పెట్టుబడిదారుల ఆందోళనలను పెంచింది. ఈ ఉద్రిక్తతల కారణంగా అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని భావిస్తున్నారు.

బంగారంతో పాటే ఈ వారం వెండి ధరలలో కూడా భారీ పతనం కనిపించింది. గత వారంతో పోలిస్తే దేశీయ మార్కెట్లలో వెండి ధరలు ఏకంగా 6.19 శాతం మేర క్షీణించాయి. 999 స్వచ్ఛత గల ఒక కేజీ వెండి ధర శుక్రవారం నాటి ముగింపునకు రూ. 2,22,980 వద్ద స్థిరపడింది. ఎమ్‌సీఎక్స్ లో నేడు బంగారం ధరలో ఎటువంటి మార్పు లేదు. 10 గ్రాముల బంగారం ధర రూ. 1,43,480 వద్ద కొనసాగగా, వెండి ఫ్యూచర్స్ మాత్రం 0.01 శాతం పెరిగి రూ. 2,22,680 వద్ద ముగిసింది.
ఈ నెల 3వ తేదీ నుండి కూడా బంగారం ధరలు అంతర్జాతీయ స్పాట్ మార్కెట్ నమోదవుతున్న హెచ్చుతగ్గులు, డాలర్- రూపాయి మారకం విలువపై ఆధారపడి క్షీణిస్తూనే వస్తోన్నాయి. అయినప్పటికీ, వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ విడుదల చేసిన మధ్యంతర నివేదిక ప్రకారం భౌగోళిక రాజకీయ అనిశ్చితులు, ప్రపంచ ఆర్థిక సంక్షోభ పరిస్థితులు మరింత క్లిష్టంగా మారితే దీర్ఘకాలిక పెట్టుబడిదారుల మద్దతుతో బంగారం ధరలు రాబోయే కాలంలో 4,500 డాలర్ల మార్కును తాకే అవకాశం ఉంది.
ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు (గ్రాముకు)
చెన్నై..
24 క్యారెట్లు- రూ. 14,509, 22 క్యారెట్లు - రూ. 13,300, 18 క్యారెట్లు - రూ. 11,120
ముంబై..
24 క్యారెట్లు - రూ. 14,433, 22 క్యారెట్లు- రూ. 13,230, 18 క్యారెట్లు - రూ. 10,825
బెంగళూరు..
24 క్యారెట్లు - రూ. 14,433, 22 క్యారెట్లు- రూ. 13,230, 18 క్యారెట్లు - రూ. 10,825
హైదరాబాద్..
24 క్యారెట్లు - రూ. 14,433, 22 క్యారెట్లు- రూ. 13,230, 18 క్యారెట్లు - రూ. 10,825
విజయవాడ..
24 క్యారెట్లు - రూ. 14,433, 22 క్యారెట్లు- రూ. 13,230, 18 క్యారెట్లు - రూ. 10,825
విశాఖపట్నం..
24 క్యారెట్లు - రూ. 14,433, 22 క్యారెట్లు- రూ. 13,230, 18 క్యారెట్లు - రూ. 10,825












Click it and Unblock the Notifications