బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్
దేశంలో బంగారం, వెండి ధరలు నేడు గణనీయంగా పుంజుకున్నాయి. పెట్టుబడిదారులకు ఊరట కల్పించాయి. దేశీయ మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX) లో 10 గ్రాముల బంగారం ఫ్యూచర్స్ ధర 0.73 శాతం వృద్ధి చెంది 1,41,143 రూపాయల వద్ద స్థిరపడింది. కిలో వెండి ధర 2 శాతంతో దూసుకెళ్లింది. 2,24,300 వద్ద ట్రేడ్ అవుతోంది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు గత గరిష్ట స్థాయిల నుండి తగ్గినప్పటికీ, డాలర్ పటిష్టంగా కొనసాగింది.
ప్రస్తుత స్థూల ఆర్థిక ఒత్తిళ్లు పసిడి, వెండి ధరల పెరుగుదలకు ప్రధాన కారణం. ముఖ్యంగా పెరుగుతున్న ద్రవ్యోల్బణం ఆందోళనలు, దానికి ప్రతిస్పందనగా అధిక వడ్డీ రేట్లు, సురక్షిత పెట్టుబడిగా బంగారం, వెండికి డిమాండ్‌ను విపరీతంగా పెంచాయి. ఇరాన్ ఘర్షణల వల్ల చమురు మార్కెట్లు ప్రభావితం కావడంతోపాటు, ఇది అమెరికా డాలర్‌ను మరింత బలోపేతం చేసింది. దీంతో అటు అంతర్జాతీయ స్పాట్ మార్కెట్‌లోనూ బంగారం, వెండి ధరలు పెరిగాయి.

ప్రారంభ కొమెక్స్ ట్రేడింగ్‌లో ఔన్స్ స్పాట్ బంగారం 1.17 శాతం పెరిగి 4,427 డాలర్లు, వెండి ధర 1.18 శాతం పెరిగి ఔన్స్‌కు 68.75 డాలర్ల వద్ద నమోదైంది. ఫారిన్ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల నిరంతర అమ్మకాలు భారత రూపాయి బలహీనతకు కారణం అయ్యాయి. అంతకుముందు గురువారం నాటి సెషన్‌లో దేశీయ ఫ్యూచర్స్ బంగారం ధర స్వల్పంగా తగ్గింది. 10 గ్రాముల బంగారం 0.15 శాతం తగ్గి 1,39,905కి చేరుకోగా, కిలో వెండి 0.31 శాతం పడిపోయి రూ. 2,19,200 వద్ద ముగిసింది.
ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు (గ్రాముకు)
చెన్నై..
24 క్యారెట్లు- రూ. 14,651, 22 క్యారెట్లు - రూ. 13,430, 18 క్యారెట్లు - రూ. 11,200
ముంబై..
24 క్యారెట్లు - రూ. 14,471, 22 క్యారెట్లు- రూ. 12,265, 18 క్యారెట్లు - రూ. 10,853
బెంగళూరు..
24 క్యారెట్లు - రూ. 14,471, 22 క్యారెట్లు- రూ. 12,265, 18 క్యారెట్లు - రూ. 10,853
హైదరాబాద్..
24 క్యారెట్లు - రూ. 14,471, 22 క్యారెట్లు- రూ. 12,265, 18 క్యారెట్లు - రూ. 10,853
విజయవాడ..
24 క్యారెట్లు - రూ. 14,471, 22 క్యారెట్లు- రూ. 12,265, 18 క్యారెట్లు - రూ. 10,853
విశాఖపట్నం..
24 క్యారెట్లు - రూ. 14,471, 22 క్యారెట్లు- రూ. 12,265, 18 క్యారెట్లు - రూ. 10,853
-
బంగారం ధరల్లో లాభాల మోత -
Gold: బంగారం ఈ టాప్ ప్లేసెస్ లో కొంటేనే మీకు లాభం! -
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
వాస్తు ప్రకారం ఏ రాశివారికి ఏ దిక్కులో ఉండే ఇళ్లు కలిసివస్తాయి? -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
సీనియర్ ఎన్టీఆర్‌కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా












Click it and Unblock the Notifications