బంగారం ధరల్లో ఎట్టకేలకు.. !!
అంతర్జాతీయ విపణిలో చోటుచేసుకుంటున్న ప్రతికూల పరిణామాల కారణంగా దేశీయ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు భారీగా దిగొచ్చాయి. గ్లోబల్ మార్కెట్లలో తీవ్ర అమ్మకాల ఒత్తిడి ప్రభావంతో పసిడి ధర శుక్రవారం ఒక్కరోజే ఏకంగా రూ.1,900 వరకు తగ్గగా, వెండి ధర ఏకంగా 10 నెలల కనిష్ఠ స్థాయికి పడిపోయింది. దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్ ఎంసీఎక్స్ (MCX)లో బంగారం, వెండి రెండూ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. వరుస నష్టాలను నమోదు చేశాయి.
ఎంసీఎక్స్‌లో డిసెంబర్ బంగారం ఫ్యూచర్స్ ట్రేడింగ్ సమయంలో 10 గ్రాములకు రూ. 839 తగ్గి, రూ. 1,42,470 వద్ద కొనసాగింది. ఇంట్రాడే వ్యవధిలో ఇది రూ. 1,41,806 వద్ద కనిష్ఠ రికార్డు స్థాయిని కూడా తాకింది. మరోవైపు, వెండి డిసెంబర్ కాంట్రాక్టులు రూ. 3,305 వరకు నష్టపోయి, కిలోకు రూ. 1,96,294 వద్దకు చేరాయి. గత ఏడాది డిసెంబర్ నెల తర్వాత వెండి ధర ఇంతటి అల్పస్థాయికి పడిపోవడం ఇదే మొదటిసారి. నేడు సెలవుదినం కావడం వల్ల ట్రేడింగ్ జరగట్లేదు. శుక్రవారం నాటి క్లోజింగ్ సెషన్ పోల్చుకుంటే రేట్లు దాదాపుగా ఫ్లాట్ గా రికార్డయ్యాయి. భారీగా నష్టపోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో బంగారం ధరలకు ఎట్టకేలకు బ్రేక్ పడినట్టయింది.

హైదరాబాద్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,42,480, 22 క్యారెట్లు రూ. 1,30,060 గా రికార్డయ్యాయి. ఇక్కడ వెండి కిలో రూ. 2,02,140 గా నమోదైంది. చెన్నైలో 10 గ్రాముల బంగారం ధర 24 క్యారెట్లకు రూ. 1,42,810, 22 క్యారెట్లకు రూ. 1,30,350 కాగా వెండి 2,03,220 వద్ద ట్రేడ్ అయింది. ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు రూ. 1,42,480, రూ. 1,30,280 కాగా వెండి కిలో రూ. 2,02,910 వద్ద స్థిరపడ్డాయి. బెంగళూరులో 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 1,42,490, 22 క్యారెట్లు రూ. 1,30,116, వెండి రూ. 2,01,770 గా నమోదైంది.
నేడు నమోదైన బంగారం రేట్లు ఒక గ్రాముకు ఇలా ఉన్నాయి
చెన్నై..
24 క్యారెట్లు- రూ. 14,248, 22 క్యారెట్లు - రూ. 13,060, 18 క్యారెట్లు - రూ. 10,686
ముంబై..
24 క్యారెట్లు- రూ. 14,263, 22 క్యారెట్లు - రూ. 13,075, 18 క్యారెట్లు - రూ. 10,686
బెంగళూరు..
24 క్యారెట్లు- రూ. 14,263, 22 క్యారెట్లు - రూ. 13,075, 18 క్యారెట్లు - రూ. 10,686
హైదరాబాద్..
24 క్యారెట్లు- రూ. 14,263, 22 క్యారెట్లు - రూ. 13,075, 18 క్యారెట్లు - రూ. 10,686
విజయవాడ..
24 క్యారెట్లు- రూ. 14,263, 22 క్యారెట్లు - రూ. 13,075, 18 క్యారెట్లు - రూ. 10,686
విశాఖపట్నం..
24 క్యారెట్లు- రూ. 14,263, 22 క్యారెట్లు - రూ. 13,075, 18 క్యారెట్లు - రూ. 10,686













Click it and Unblock the Notifications
