‘జైలర్ 2’తో సరికొత్త చరిత్ర సృష్టించిన తలైవా రజనీకాంత్
వయసు కేవలం ఒక సంఖ్య మాత్రమే అని సూపర్ స్టార్ రజనీకాంత్ మరోసారి నిరూపించారు. 75 ఏళ్ల వయసులోనూ ఆయన బాక్సాఫీస్ వద్ద సృష్టిస్తున్న సంచలనాలు తెలుగు, తమిళ ఇండస్ట్రీలను విస్మయానికి గురిచేస్తున్నాయి. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ బ్లాక్‌బస్టర్ 'జైలర్ 2' థియేటర్లలో కాసుల వర్షం కురిపిస్తూ సరికొత్త చరిత్ర సృష్టిస్తోంది. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రంపై మొదటి నుంచి భారీ అంచనాలున్నాయి. ఆ అంచనాలను నిజం చేస్తూ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టిస్తోంది.
కేవలం 8 రోజుల్లో రూ. 600 కోట్ల క్లబ్
మొదటి భాగం 'జైలర్' విజయం ఎంత పెద్దదో తెలిసిందే. దానిని మించేలా ఉన్న ఈ సీక్వెల్ కేవలం ఎనిమిది రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించి 100 శాతం రికవరీతో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. రెండో వారంలోకి అడుగుపెట్టిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 606.05 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి దూసుకుపోతోంది. ఇండియన్ మార్కెట్ గ్రాస్ రూ.391.55 కోట్లు (నెట్: రూ.334.35 కోట్లు) కాగా, ఓవర్సీస్ మార్కెట్ గ్రాస్ రూ.214.50 కోట్లుగా ఉంది. కేవలం ఎనిమిది రోజుల్లోనే ఈ చిత్రాన్ని సుమారు 2.20 కోట్లకు పైగా ప్రేక్షకులు థియేటర్లలో వీక్షించడం రజినీ క్రేజ్ ఏపాటిదో చెప్పకనే చెబుతోంది.

పూనకాలు తెప్పిస్తున్న క్యామియోలు, నటన
రిటైర్డ్ జైలర్ టైగర్ ముత్తువేల్ పాండియన్ ప్రశాంత జీవితంలోకి నేర సామ్రాజ్యం నుంచి ఎదురయ్యే సరికొత్త సవాళ్లు, కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఆయన చేసే పోరాటం ప్రేక్షకులను సీట్లకు కట్టిపడేస్తోంది. రజనీకాంత్ మార్క్ స్టైల్, యాక్షన్ సీక్వెన్స్‌లతో పాటు అనిరుధ్ రవిచందర్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ థియేటర్లలో ఫ్యాన్స్‌కు గూస్‌బంప్స్ తెప్పిస్తోంది. ఇక ఈ సినిమాలో నటీనటుల వల్లే హైప్ తారాస్థాయికి చేరింది. మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్, జాకీ ష్రాఫ్‌లతో పాటు బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్, విద్యాబాలన్ స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాను నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్లాయి. రమ్యకృష్ణ అభినయం, యోగిబాబు - నమో నారాయణల కామెడీ ట్రాక్ ఫ్యామిలీ ఆడియన్స్‌ను కడుపుబ్బా నవ్విస్తున్నాయి.
రూ. 1000 కోట్ల క్లబ్ దిశగా రజనీ
ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఉన్న ట్రెండ్, వీకెండ్ అడ్వాన్స్ బుకింగ్స్ గమనిస్తే.. రెండో వారం పూర్తయ్యేసరికి 'జైలర్ 2' సునాయాసంగా రూ. 800 కోట్ల క్లబ్‌లోకి ప్రవేశిస్తుందని ట్రేడ్ పండితులు విశ్లేషిస్తున్నారు. ఇదే జోరు కొనసాగితే లాంగ్ రన్‌లో రజనీకాంత్ కెరీర్‌లోనే ఆల్-టైమ్ హైయెస్ట్ కలెక్షన్ల రికార్డును బ్రేక్ చేయడమే కాకుండా, ప్రతిష్టాత్మక రూ. 1000 కోట్ల క్లబ్‌లో తలైవా అడుగుపెట్టడం ఖాయమని సినీ వర్గాలు బలంగా అంచనా వేస్తున్నాయి.














Click it and Unblock the Notifications
