ఏపీలో తేలిన నామినేషన్ల లెక్క..! జగన్ మాటల్లో నిజమెంత ?

ఏపీలో జరుగుతున్న స్దానిక సంస్థల ఎన్నికల్లో పలు చోట్ల హింసాత్మక ఘటనలు నమోదవుతున్న నేపథ్యంలో తమ పార్టీ అభ్యర్ధులు నామినేషన్లు (Nominations) దాఖలు చేసే పరిస్ధితి లేదని, ఎస్ఈసీ పట్టించుకోవడం లేదంటూ వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ సుప్రీంకోర్టు వరకూ వెళ్లారు. ఈ నేపథ్యంలో తాజాగా ఎంపీటీసీ, జడ్పీటీసీ స్ధానాలకు (AP MPTC, ZPTC Polls) దాఖలైన నామినేషన్ల వివరాలను ఎస్ఈసీ వెల్లడించింది. వీటిని బట్టి చూస్తే జగన్ (YS Jagan) ఆరోపణల్లో పస ఉందా లేదా అనేది తెలుస్తుందని కూటమి పార్టీలు చెబుతున్నాయి.

సుప్రీం ఆదేశాలూ బేఖాతర్- ఎస్ఈసీ ఏం చేస్తోంది? ఎన్నికల హింసపై జగన్ ఫైర్..!
సుప్రీం ఆదేశాలూ బేఖాతర్- ఎస్ఈసీ ఏం చేస్తోంది? ఎన్నికల హింసపై జగన్ ఫైర్..!

రాష్ట్రంలోని 28 జిల్లాల్లో 9829 ఎంపీటీసీలకు గానూ మొత్తం 51,902నామినేషన్లు దాఖలు అయినట్లు ఎస్ఈసీ డేటా చెబుతోంది.
అలాగే 28 జిల్లాల్లో 659 జెడ్పీటీసీ స్థానాలకు గానూ మొత్తం 5724 నామినేషన్లు దాఖలు అయ్యాయని వెల్లడించింది. చివరి రోజున జెడ్పీటీసీ స్థానాలకు 3315, ఎంపీటీసీ స్థానాలకు 25016 నామినేషన్లను అన్ని పార్టీలు దాఖలు చేశాయి. ఇందులో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎంపీటీసీ స్థానాలకు టీడీపీ అభ్యర్ధులు మొత్తం 22,013 నామినేషన్లు వేసినట్లు తేలింది. అలాగే వైఎస్ఆర్సీపీ అభ్యర్ధులు
మొత్తం 20,556 నామినేషన్లు దాఖలు చేసినట్లు తేలింది. జనసేన పార్టీ తరపున 4609 మంది, బీజేపీ నుంచి 1150 నామినేషన్లు దాఖలయ్యాయి

Over 60 000 Nominations Filed for AP MPTC ZPTC Polls Do the Numbers Counter YS Jagan s Claims
జగన్ ఫేక్ ప్రచారం- మేం అడ్డుకుంటే ఇన్ని నామినేషన్లు ఎలా?- బోండా ఉమ కౌంటర్..!
జగన్ ఫేక్ ప్రచారం- మేం అడ్డుకుంటే ఇన్ని నామినేషన్లు ఎలా?- బోండా ఉమ కౌంటర్..!

అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జెడ్పీటీసీ స్థానాలకు టీడీపీ తరపున 2078 నామినేషన్లు దాఖలు కాగా.. వైఎస్ఆర్సీపీ నుంచి 1815 మంది నామినేషన్లు వేశారు. ఇక జనసేన పార్టీ నుంచి 679 మంది, బీజేపీ తరపున 255 మంది నామినేషన్లు దాఖలు చేశారు. దీంతో రాష్ట్రంలో తమ పార్టీ అభ్యర్ధులు నామినేషన్లు దాఖలు చేసే అవకాశమే లేకుండా పోతోందన్న జగన్ విమర్శల్లో పస లేదని కూటమి పార్టీలు స్పష్టం చేస్తున్నాయి. ఇంత భారీ ఎత్తున నామినేషన్లు దాఖలైనా కూటమి ప్రభుత్వంపై జగన్ తప్పుడు ఆరోపణలు చేశారని అవి చెప్తున్నాయి. బెంగళూరు నుంచి రావడం, తప్పుడు ఆరోపణలు చేయడం వెళ్లిపోవడం ఇదీ జగన్ హిట్ అండ్ రన్ థియరీ అని కూటమి పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి. కేవలం ప్రెస్ మీట్లు పెట్టడానికే జగన్ మోహన్ రెడ్డి బెంగళూరు నుంచి అమరావతి వస్తున్నట్లు దీన్ని బట్టి అర్ధమవుతోందని చెప్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+