జగన్ మార్క్ రాజకీయం..! ఇండీ కూటమిలోకి వెళ్లట్లేదా ? ఈసీపై పోరు వెనుక..!

ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీతో రాజకీయ అరంగేట్రం చేసి, ఆ తర్వాత అదే పార్టీతో విభేదించి బయటికి వచ్చి వైఎస్సార్సీపీని స్ధాపించి ఏపీలో అదే కాంగ్రెస్ ను నామరూపాల్లేకుండా చేసిన వైఎస్ జగన్ (YS Jagan).. అధికారంలో ఉన్నా, లేకపోయినా బీజేపీకి, ప్రధాని మోడీకి మద్దతుగా నిలిచారు. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోవడం, జాతీయ స్ధాయిలో తాజాగా మారుతున్న రాజకీయ పరిస్ధితుల్లో వైఎస్ జగన్ ఇండియా కూటమివైపు మొగ్గుచూపుతున్నట్లు కనిపిస్తోంది. అయితే నిజంగానే జగన్ ఇండియా కూటమికి దగ్గరవుతున్నారా లేక దాన్ని బీజేపీపై ఒత్తిడి వ్యూహంగా మార్చుకుంటున్నారా అనే అంశంపై చర్చ జరుగుతోంది.

సుప్రీం ఆదేశాలూ బేఖాతర్- ఎస్ఈసీ ఏం చేస్తోంది? ఎన్నికల హింసపై జగన్ ఫైర్..!
సుప్రీం ఆదేశాలూ బేఖాతర్- ఎస్ఈసీ ఏం చేస్తోంది? ఎన్నికల హింసపై జగన్ ఫైర్..!

ఈసీపై వైఎస్ జగన్ పోరు (YS Jagan)

2024 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో సఖ్యతగా ఉన్నా ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయాక జగన్ అంతర్మథనంలో పడ్డారు. అయితే వెంటనే యూటర్న్ తీసుకున్నా ప్రయోజనం లేకపోవడంతో, ఈసీపై మాత్రమే పోరాటం చేస్తూ టైమ్ కోసం ఎదురుచూస్తూ సైలెంట్ గా ఉండిపోయారు. ఇప్పుడు అదే ఎన్నికల కమిషన్ ఎస్ఐఆర్ విషయంలో ఏపీలో తమ పార్టీకి న్యాయం చేసినా... జాతీయ స్దాయిలో మాత్రం అక్రమాలు బయటపడటం, విపక్షాల పోరాటం నేపథ్యంలో జగన్ ఏదో ఒకటి తేల్చుకోవాల్సిన పరిస్ధితి ఎదురైంది. దీంతో ఆయన ఎన్నికల కమిషనర్ల నియామక చట్టాన్ని కెలికారు. అప్పట్లో ఈ చట్టానికి మద్దతిచ్చు తప్పుచేశామని, ఇప్పుడు పశ్చాత్తాప పడుతున్నట్లు చేసిన ప్రకటనతో ఆయన.. విపక్ష ఇండియా కూటమివైపు మళ్లడం ఖాయమని అంతా భావించారు.

Is YS Jagan Moving Closer to INDIA Bloc or Using It to Pressure BJP Why Is Congress Silent

ఇండీ కూటమివైపు మొగ్గు సంకేతాలు

అయితే అంతకు ముందే రాష్ట్రంలో దశాబ్దకాలంగా మూలన పడి ఉన్న తన అక్రమాస్తుల కేసులతో పాటు బాబాయ్ వివేకా హత్య కేసు, తమ ప్రభుత్వంలో జరిగిందని ఆరోపిస్తున్న మద్యం స్కాం కేసు, చివరికి ఏపీపీఎస్సీ మూల్యాంకనం కేసులోనూ ఈడీ రంగంలోకి దిగి జగన్ తో పాటు ఆయన పార్టీ నేతల్ని ఒక్కొక్కరుగా టార్గెట్ చేయడం ప్రారంభించింది. దీంతో జగన్ ఇండియా కూటమి వైపు మొగ్గు చూపుతున్నట్లు అంతా భావించారు. కానీ ఈసీ నియామకాల చట్టంపై జగన్ మొదలుపెట్టిన పోరాటం వెనుక నాలుగు కారణాలు ఉండొచ్చని రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ నాగేశ్వర్ తన వెబ్ సైట్ లో ఓ కథనంలో వెల్లడించారు.

Is YS Jagan Moving Closer to INDIA Bloc or Using It to Pressure BJP Why Is Congress Silent
జగన్ ఫేక్ ప్రచారం- మేం అడ్డుకుంటే ఇన్ని నామినేషన్లు ఎలా?- బోండా ఉమ కౌంటర్..!
జగన్ ఫేక్ ప్రచారం- మేం అడ్డుకుంటే ఇన్ని నామినేషన్లు ఎలా?- బోండా ఉమ కౌంటర్..!

అసలు టార్గెట్ అదేనా?

ఇందులో కేంద్రంపై జనంలో అసంతృప్తి పెరుగుతుంటే, ఇండియా కూటమివైపు మొగ్గడం లేదా బీజేపీ చేతుల్లో ఉన్న దర్యాప్తు సంస్థలు కేసుల పేరుతో పెడుతున్న ఒత్తిడితో జాతీయ స్ధాయిలో మద్దతు కోసం ఇండియా కూటమివైపు మొగ్గడం, లేదా బీజేపీపై ఒత్తిడి పెంచే వ్యూహం, లేదా తన ప్రాంతీయ పార్టీ మనుగడ కాపాడుకునేందుకు కూడా కావచ్చని నాగేశ్వర్ విశ్లేషించారు. అయితే ఇందులో జగన్ ఇండియా కూటమిలో చేరడం కంటే, బీజేపీతో తన సంబంధాల విషయంలో రాజకీయ ఒత్తిడి పెంచి, బేరసారాల అవకాశాలను విస్తరించుకోవడమే ప్రస్తుత వైఖరి వెనుక ప్రధాన ఉద్దేశం కావచ్చని నాగేశ్వర్ విశ్లేషించారు. తాజాగా ఎప్పటిలాగే అమిత్ షాకు జగన్ పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడం, అందుకు ఆయన రిప్లై ఇవ్వడం కూడా జరిగింది. అందుకే కాంగ్రెస్ పార్టీ జగన్ విషయంలో ప్రస్తుతానికి మౌనం పాటిస్తున్నట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+