అమాంతం కుప్పకూలిన బంగారం రేట్లు- డేంజరస్ రెడ్ జోన్

భారత్ లో బంగారం, వెండి ధరలు భారీగా పడిపోయాయి. అంతర్జాతీయంగా నెలకొన్న ప్రతికూల పరిస్థితులు, అమెరికా డాలర్ బలపడటం, రూపాయి క్షీణత, వడ్డీ రేట్లు మరింత పెరగవచ్చనే అంచనాలు వీటి ధరలను తీవ్రంగా ప్రభావితం చేశాయి. ఫలితంగా మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX) వేదికగా బంగారం ధరలు అమాంతం కుప్పకూలాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం 1,50,000 కంటే దిగువకు పడిపోయాయి. ఈ మధ్యకాలంలో ఈ స్థాయిలో పడిపోవడం ఇదే మొదటిసారి.

ఎంసీఎక్స్ గోల్డ్ ఫ్యూచర్స్ ఆగస్టు డెలివరీ కోసం 1.65 శాతం మేర తగ్గాయి. 10 గ్రాములపై 2,517 రూపాయల మేర క్షీణించి రూ. 1,49,926 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. అంతకుముందు రోజు ధర రూ. 1,52,443గా ముగిసింది. ప్రారంభ ట్రేడింగ్‌లో కొంత మేర కోలుకున్నప్పటికీ, ధరలు రూ. 1,50,213 వద్ద కొనసాగుతున్నాయి. వెండి ధరల్లోనూ అమ్మకాల ఒత్తిడి కనిపించింది. ఎంసీఎక్స్ వెండి ఫ్యూచర్స్ జూలై డెలివరీ మునుపటి ముగింపు రూ. 2,38,528 తో పోలిస్తే 1.89 శాతం తగ్గి రూ. 2,34,009 వద్ద ప్రారంభమయ్యాయి.

Gold and Silver Tumble by by Rs 2 517 at MCX on Stronger Dollar 24K 22K and 18K Bets CB Signals

అంతర్జాతీయంగా స్పాట్ గోల్డ్ ధరలో ఇదే పరిస్థితి కనిపించింది. కిందటి క్లోజింగ్ సెషన్ తో కంపేర్ చేసి చూస్తే 1.8 శాతం తగ్గి 4,187.59 డాటర్ల వద్దకు చేరుకుంది. ఇది మార్చి 23 తర్వాత నమోదైన అత్యల్ప స్థాయి. అదేవిధంగా, అమెరికా గోల్డ్ ఫ్యూచర్స్ కూడా 1.7 శాతం క్షీణించి 4,213.40 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి. బలమైన అమెరికా డాలర్ ఇతర కరెన్సీలు కలిగిన వారికి బంగారం ధరలను మరింత ఖరీదుగా మారుస్తోంది. దీనివల్ల బంగారంపై డిమాండ్ తగ్గుతోంది.

ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 1,48,960 రూపాయలకు చేరింది. జైపూర్‌లో రూ. 1,48,960, అహ్మదాబాద్‌లో రూ. 1,48,910కు చేరింది. పుణె, ముంబై, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, కోల్‌కతాలల్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,48,860 చొప్పున ధరలు నమోదయ్యాయి. 22 క్యారెట్లు 10 గ్రాములకు ఢిల్లీ, జైపూర్‌లో రూ. 1,36,600, అహ్మదాబాద్‌లో రూ. 1,36,500, ముంబై, పుణె, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, కోల్‌కతాల్లో రూ. 1,36,450ల వద్ద స్థిరపడింది.

చెన్నై..

24 క్యారెట్లు- రూ. 15,055, 22 క్యారెట్లు - రూ. 13,800, 18 క్యారెట్లు - రూ. 11,570

ముంబై..

24 క్యారెట్లు - రూ. 14,886, 22 క్యారెట్లు- రూ. 13,645, 18 క్యారెట్లు - రూ. 11,164

బెంగళూరు..

24 క్యారెట్లు - రూ. 14,886, 22 క్యారెట్లు- రూ. 13,645, 18 క్యారెట్లు - రూ. 11,164

హైదరాబాద్..

24 క్యారెట్లు - రూ. 14,886, 22 క్యారెట్లు- రూ. 13,645, 18 క్యారెట్లు - రూ. 11,164

విజయవాడ..

24 క్యారెట్లు - రూ. 14,886, 22 క్యారెట్లు- రూ. 13,645, 18 క్యారెట్లు - రూ. 11,164

విశాఖపట్నం..

24 క్యారెట్లు - రూ. 14,886, 22 క్యారెట్లు- రూ. 13,645, 18 క్యారెట్లు - రూ. 11,164

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+