అగ్నిపర్వతంలా పేలిన బంగారం ధరలు
కేంద్ర ప్రభుత్వం బాంబు పేల్చింది. పసిడిపై దిగుమతి సుంకాలను అమాంతం పెంచేసింది. వెండి, ప్లాటినమ్, ఇతర విలువైన లోహాలు కూడా దీని పరిధిలోకి చేర్చింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఓ నోటిఫికేషన్ విడుదల చేసింది. పెంచిన ట్యాక్స్ నేటి నుంచే అమలులోకి వచ్చింది కూడా. దీని దెబ్బకు బంగారం, వెండి రేట్లు ఆకాశానికి ఎగబాకాయి. ఒక్కసారిగా అగ్నిపర్వతంలా పేలాయి.. వీటి రేట్లు. అందనంత ఎత్తుకు చేరాయి.
మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ లో బంగారం ధర ఆరు శాతానికి పైగా పెరిగింది. ఈ మధ్యకాలంలో ఈ స్థాయిలో పెరగడం ఇదే మొదటిసారి. 10 గ్రాముల బంగారం రూ. 1,53,962 వద్ద లాభాలతో ఓపెన్ అయింది. ఆ కొద్ది నిమిషాల్లోనే రూ. 1,63,243 గరిష్ట స్థాయికి చేరింది. దీంతో ఇంట్రాడే 13,500 రూపాయలకు పైగా లాభాన్ని నమోదు చేసింది. ఈ ట్రెండ్ మరింత కొనసాగడం కనిపించింది. ఒక దశలో 14,000 రూపాయలను తాకింది. అంతర్జాతీయంగా కూడా ఇదే ట్రెండ్ కనిపించింది. కామెక్స్ లో ఔన్సుకు 4,830 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది.

ఢిల్లీ, జైపూర్‌లలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 1,51,500 కాగా, 24 క్యారెట్లు బంగారం రూ. 1,63,090కి నమోదయ్యాయి. అహ్మదాబాద్, పూణేలలో 22 క్యారెట్ల పసిడి రూ. 1,51,450, 24 క్యారెట్ల పసిడి రూ. 1,63,990 పలికాయి. ముంబై, హైదరాబాద్, చెన్నై, బెంగళూరులో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం రూ. 1,51,400 కాగా, 24 క్యారెట్లు రూ. 1,62,990గా కొనసాగింది. కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1,53,400, 24 క్యారెట్ల బంగారం ధర ₹1,62,830గా నమోదైంది.
చెన్నై..
24 క్యారెట్లు- రూ. 16,800, 22 క్యారెట్లు - రూ. 15,400, 18 క్యారెట్లు - రూ. 12,860
ముంబై..
24 క్యారెట్లు - రూ. 16,789, 22 క్యారెట్లు- రూ. 15,390, 18 క్యారెట్లు - రూ. 12,592
బెంగళూరు..
24 క్యారెట్లు - రూ. 16,789, 22 క్యారెట్లు- రూ. 15,390, 18 క్యారెట్లు - రూ. 12,592
హైదరాబాద్..
24 క్యారెట్లు - రూ. 16,789, 22 క్యారెట్లు- రూ. 15,390, 18 క్యారెట్లు - రూ. 12,592
విజయవాడ..
24 క్యారెట్లు - రూ. 16,789, 22 క్యారెట్లు- రూ. 15,390, 18 క్యారెట్లు - రూ. 12,592
విశాఖపట్నం..
24 క్యారెట్లు - రూ. 16,789, 22 క్యారెట్లు- రూ. 15,390, 18 క్యారెట్లు - రూ. 12,592

Click it and Unblock the Notifications