వామ్మో.. బంగారం ధరల్లో భారీ క్రాష్
బంగారం ధరల్లో మరో భారీ పతనం చోటు చేసుకుంది. బుధవారం నాటి పతనం నేడు కూడా కొనసాగింది. ఇరాన్ పై అమెరికా దాడులు మళ్లీ తీవ్రతరం కావడం, హార్ముజ్ జలసంధిలో నౌకల రాకపోకలు స్తంభించడం వంటి పరిణామాలు దీనికి దారి తీశాయి. చమురు ధరల పెరుగుదల, డాలర్ విలువ బలపడటంతో భారత్ లో బంగారం, వెండి ధరలు వరుసగా రెండో రోజు కూడా పతనం అయ్యాయి. ఇది ఇక్కడితో ఆగేలా కనిపించట్లేదు.
గత 10 రోజులుగా బంగారం ధర 6.77 శాతం క్షీణతను నమోదు చేస్తూ వస్తోంది. ఈ క్రమంలో అమ్మకాల ఒత్తిడి నెలకొంది. నేడు 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ. 2130 తగ్గింది. 1,45,640 రూపాయలకు చేరింది.అలాగే 22 క్యారెట్ల బంగారం ధరలో కూడా తగ్గుదల కనిపించింది. ఒక గ్రాము 195 రూపాయలు తగ్గి రూ. 13,350 కాగా, 10 గ్రాముల ధర రూ. 1,950 తగ్గి 1,33,500 రూపాయలకు పడిపోయింది.

వెండి ధరలు ప్రస్తుతం మార్కెట్లో స్థిరంగా ఉన్నాయి. కిలో వెండి ధర 2,50,000 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది. గత పది రోజులలోనే బంగారం ధరలో సగటున 10,580 రూపాయల మేర తగ్గుదల నమోదవ్వడం విశేషం. ప్రస్తుతం బంగారం ధరలన్నీ ప్రతికూల ట్రెండ్‌లో పయనిస్తున్నాయి. ఈ పతనానికి ప్రధానంగా మధ్యప్రాచ్య రాజకీయ ఉద్రిక్తతలు కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా గల్ఫ్ దేశాలలో అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడుల వల్ల ముడి చమురు ధర బ్యారెల్‌కు 100 డాలర్లు దాటింది.
డాలర్ విలువ బలపడటం, అమెరికా ట్రెజరీ బాండ్ల రాబడి పెరగడం వల్ల కూడా బంగారం, వెండి ఆకర్షణ తగ్గుతోందని ఆర్థిక నిపుణులు గౌరవ్ గార్గ్ అభిప్రాయపడ్డారు. భౌగోళిక రాజకీయ పరిస్థితులు, ద్రవ్యోల్బణ భయాలు కొనసాగుతున్న నేపథ్యంలో, అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గే వరకు ఈ విలువైన లోహాల ధరల్లో కోలుకోవడం కష్టమని మార్కెట్ వర్గాల అంచనా.
చెన్నై..
24 క్యారెట్లు- రూ. 14,728, 22 క్యారెట్లు - రూ. 13,500, 18 క్యారెట్లు - రూ. 11,310
ముంబై..
24 క్యారెట్లు - రూ. 14,564, 22 క్యారెట్లు- రూ. 13,350, 18 క్యారెట్లు - రూ. 10,923
బెంగళూరు..
24 క్యారెట్లు - రూ. 14,564, 22 క్యారెట్లు- రూ. 13,350, 18 క్యారెట్లు - రూ. 10,923
హైదరాబాద్..
24 క్యారెట్లు - రూ. 14,564, 22 క్యారెట్లు- రూ. 13,350, 18 క్యారెట్లు - రూ. 10,923
విజయవాడ..
24 క్యారెట్లు - రూ. 14,564, 22 క్యారెట్లు- రూ. 13,350, 18 క్యారెట్లు - రూ. 10,923
విశాఖపట్నం..
24 క్యారెట్లు - రూ. 14,564, 22 క్యారెట్లు- రూ. 13,350, 18 క్యారెట్లు - రూ. 10,923

Click it and Unblock the Notifications