పేక మేడలా కుప్పకూలుతున్న బంగారం ధరలు
దేశంలో బంగారం, వెండి ధరలు భారీగా తగ్గుముఖం పడుతున్నాయి. రికార్డు స్థాయికి చేరిన అనంతరం ఇక పేకమేడలా కుప్పకూలుతున్నాయి. ఈ వారం రోజుల్లోనే దాదాపుగా 10,000 రూపాయలకు పైగా బంగారం ధర తగ్గిందంటే దీని తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. బలహీనమైన డాలర్, అమెరికా ట్రెజరీ ఈల్డ్స్.. దీనికి ప్రధాన కారణాలు. ఈ వారంలో మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో 10 గ్రాముల బంగారం ధర దాదాపుగా రెండు శాతం వరకు తగ్గింది.
ఎంసీఎక్స్ బంగారం ధర 1,60,000 కంటే దిగువకు చేరింది. బంగారం, వెండి ధరలు వరుసగా రెండో వారం కూడా తగ్గడం సుదీర్ఘ విరామం తర్వాత ఇదే తొలిసారి. స్పాట్ బంగారం ఒక శాతం మేర తగ్గి ఔన్సుకు 5,050 డాలర్ల వద్ద నిలిచింది. అదే సమయంలో ఎంసీఎక్స్ వెండి కూడా ఒక శాతం తగ్గగా, స్పాట్ వెండి ఏకంగా నాలుగు శాతం మేర నష్టపోయి ఔన్సుకు 80.50 డాలర్ల వద్ద స్థిరపడింది.

డాలర్ బలపడటం, యుఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటు తగ్గింపు అంచనాలు మందగించడం బంగారం, వెండి ధరల పతనానికి ప్రధాన కారణం. ఇరాన్‌పై దాడుల ప్రకటన, స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ మూసివేత వార్తలతో డాలర్ మరింత పటిష్టమైంది. దీనితో పెట్టుబడిదారులు నగదు లభ్యత కోసం డాలర్‌ను ఆశ్రయించారు. సాధారణంగా భౌగోళిక రాజకీయ అస్థిరత బులియన్ డిమాండ్‌ను పెంచినా, బ్యారెల్ $100 దాటిన ముడి చమురు ధరల ద్రవ్యోల్బణం భయాలు రాబడినిచ్చే ఆస్తుల వైపు దృష్టి మళ్ళించాయని ట్రేడింగ్ ఎకనామిక్స్ పేర్కొంది.
ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు (గ్రాముకు)
చెన్నై..
24 క్యారెట్లు- రూ. 16,255, 22 క్యారెట్లు - రూ. 14,899, 18 క్యారెట్లు - రూ. 12,549
ముంబై..
24 క్యారెట్లు - రూ. 15,966, 22 క్యారెట్లు- రూ. 14,635, 18 క్యారెట్లు - రూ. 11,974
బెంగళూరు..
24 క్యారెట్లు - రూ. 15,966, 22 క్యారెట్లు- రూ. 14,635, 18 క్యారెట్లు - రూ. 11,974
హైదరాబాద్..
24 క్యారెట్లు - రూ. 15,966, 22 క్యారెట్లు- రూ. 14,635, 18 క్యారెట్లు - రూ. 11,974
విజయవాడ..
24 క్యారెట్లు - రూ. 15,966, 22 క్యారెట్లు- రూ. 14,635, 18 క్యారెట్లు - రూ. 11,974
విశాఖపట్నం..
24 క్యారెట్లు - రూ. 15,966, 22 క్యారెట్లు- రూ. 14,635, 18 క్యారెట్లు - రూ. 11,974
-
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
Gold: భారీగా పెరిగిన బంగారం ధరలు. పసిడి మార్కెట్లో పూనకాలు -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్












Click it and Unblock the Notifications