పండగ సీజన్ ఆరంభంలో శుభసూచకం- దిగొస్తోన్న బంగారం ధరలు
అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న ఆర్థిక మార్పుల కారణంగా నేడు దేశీయంగా బంగారం, వెండి ధరల్లో తీవ్ర ఒడిదుడుకులు కొట్టొచ్చినట్లు కనిపిస్తోన్నాయి. దేశంలో పసిడి ధరలు తీవ్ర హెచ్చుతగ్గులను ఎదుర్కొంటోన్నాయి. ఈ క్రమంలో బంగారం ధరలు తగ్గగా.. వెండి ధరలు మాత్రం స్వల్పంగా పుంజుకొన్నాయి. పైపైకి ఎగబాకుతున్నాయి. గ్లోబల్ మార్కెట్‌లో నెలకొన్న తాజా పరిణామాలే ఇందుకు ప్రధాన కారణని భావిస్తోన్నారు.
ప్రపంచవ్యాప్తంగా అమెరికా డాలర్ విలువ బలోపేతం కావడం, యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల నిర్ణయంపై మదుపరులు వేచి చూసే ధోరణిని అవలంబిస్తుండటంతో అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలపై ఒత్తిడి పెరిగింది. స్పాట్ బంగారం ధర దాదాపు 1.1 శాతం మేర క్షీణించి ఔన్స్‌కు 4,032.42 డాలర్ల వద్ద స్థిరపడింది. పశ్చిమాసియాలో అమెరికా, ఇరాన్ మధ్య ముదురుతున్న ఉద్రిక్తతలు కూడా భయాందోళనలను మరింత రేకెత్తిస్తోన్నాయి.

వీటి ప్రభావం దేశీయ బులియన్ మార్కెట్లల్లో కనిపించింది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX) లో ఈ ఉదయం ప్రారంభ ట్రేడింగ్‌లో పసిడి రేటు నష్టాలతో ఆరంభమైంది. 0.11 శాతం నష్టంతో 10 గ్రాములకు రూ. 1,42,100 వద్ద ట్రెండ్ అయింది. మంగళవారం నాటి క్లోజింగ్ సెషన్ తో పోల్చి చూస్తే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 100 రూపాయల మేర తగ్గుదల కనిపించింది. 22 క్యారెట్లు 10 గ్రాములకు రూ. 600, 18 క్యారెట్లు రూ. 500 మేర తగ్గుముఖం పట్టింది.
దీనికి భిన్నంగా వెండి ఫ్యూచర్స్ మాత్రం ఈ ఒత్తిడిని అధిగమించింది. సానుకూలంగా స్పందించింది. ఎంసీఎక్స్ వెండి ధర సుమారు 0.31 శాతం మేర లాభపడి కిలోకు రూ. 2,17,160 వద్ద ట్రేడ్ అయింది. దేశంలో బంగారం ధరలు అంతర్జాతీయ విపణి ఒడిదుడుకులపైనే కాకుండా కస్టమ్స్ సుంకాలు, రాష్ట్ర ప్రభుత్వ పన్నులు, జీఎస్టీ రేట్ల ఆధారంగా మారుతుంటాయనే విషయం తెలిసిందే.
వివిధ నగరాల్లో నేడు నమోదైన బంగారం రేట్లు ఒక గ్రాముకు ఇలా ఉన్నాయి.
చెన్నై..
24 క్యారెట్లు- రూ. 14,351, 22 క్యారెట్లు - రూ. 13,155, 18 క్యారెట్లు - రూ. 10,970
ముంబై..
24 క్యారెట్లు - రూ. 14,351, 22 క్యారెట్లు- రూ. 13,155, 18 క్యారెట్లు - రూ. 10,763
బెంగళూరు..
24 క్యారెట్లు - రూ. 14,351, 22 క్యారెట్లు- రూ. 13,155, 18 క్యారెట్లు - రూ. 10,763
హైదరాబాద్..
24 క్యారెట్లు - రూ. 14,351, 22 క్యారెట్లు- రూ. 13,155, 18 క్యారెట్లు - రూ. 10,763
విజయవాడ..
24 క్యారెట్లు - రూ. 14,351, 22 క్యారెట్లు- రూ. 13,155, 18 క్యారెట్లు - రూ. 10,763
విశాఖపట్నం..
24 క్యారెట్లు - రూ. 14,351, 22 క్యారెట్లు- రూ. 13,155, 18 క్యారెట్లు - రూ. 10,763












Click it and Unblock the Notifications