ఇక ధన్ తెరాస్ కు ధనాధన్: బంగరాం ధరల్లో నిలకడ

అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. నేడు గ్లోబల్ మార్కెట్‌లో ఔన్స్ బంగారం ధర 4,117 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల నిర్ణయాలు, ద్రవ్యోల్బణ పరిస్థితులపై పెట్టుబడిదారులు తీవ్రంగా దృష్టి సారించిన నేపథ్యంలో పసిడి మదుపరులు అచితూచి వ్యవహరిస్తున్నారు. అదే సమయంలో దేశీయంగానూ బంగారం, వెండి ధరల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకుంటోన్నాయి. విజయదశమి ముగియడంతో నవంబర్ 6వ తేదీ నాటి ధన్ తెరాస్ కోసం కొనుగోలుదారులు ఎదురు చూస్తోన్నారు.

గ్లోబల్ మార్కెట్‌లో యుఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ 0.18 శాతం తగ్గి ఔన్స్‌కు 4,135.10 డాలర్ల వద్ద నమోదయ్యాయి. అమెరికాలో ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, వడ్డీ రేట్ల భవిష్యత్తు విధానాలపై స్పష్టత లేకపోవడమే ఈ పరిస్థితికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. గ్లోబల్ ఆర్థిక సంకేతాలను గమనిస్తూ ఇన్వెస్టర్లు సురక్షితమైన ఇన్వెస్ట్‌మెంట్‌గా బంగారాన్ని ఎంచుకుంటుండటంతో అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు సమతుల్యంగా ఉన్నాయి.

Gold held its price steady just above MCX was trading lower and silver edged down previous close

దేశీయ మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో డిసెంబర్ 4 డెలివరీ కాంట్రాక్ట్ బంగారం ధర 0.02 శాతం స్వల్పంగా తగ్గి 10 గ్రాములకు రూ. 1,46,488 వద్ద ట్రేడ్ అయింది. మరోవైపు, కేజీ వెండి ధర 0.29 శాతం క్షీణించి రూ. 2,10,877 వద్ద కొనసాగింది. అంతర్జాతీయ మార్కెట్ సంకేతాలు సమతుల్యంగా ఉండటంతో దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్‌లోనూ పెద్దగా వ్యత్యాసాలు నమోదు కాలేదు. స్పాట్ మార్కెట్ లో అక్టోబర్ 20 ముగింపు సమయానికి 10 గ్రాముల స్పాట్ బంగారం ధర రూ. 1,45,353 వద్ద స్థిరపడింది. అదేవిధంగా 999 స్వచ్ఛత కలిగిన కేజీ వెండి ధర రూ. 2,08,380 వద్ద ముగిసింది.

బంగాళాఖాతంలో బలపడ్డ ఆవర్తనం: ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలకు ఛాన్స్
బంగాళాఖాతంలో బలపడ్డ ఆవర్తనం: ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలకు ఛాన్స్

నేడు నమోదైన బంగారం రేట్లు ఒక గ్రాముకు ఇలా ఉన్నాయి

చెన్నై..

24 క్యారెట్లు- రూ. 14,608, 22 క్యారెట్లు - రూ. 13,390, 18 క్యారెట్లు - రూ. 10,970

ముంబై..

24 క్యారెట్లు- రూ. 14,608, 22 క్యారెట్లు - రూ. 13,390, 18 క్యారెట్లు - రూ. 10,956

బెంగళూరు..

24 క్యారెట్లు- రూ. 14,608, 22 క్యారెట్లు - రూ. 13,390, 18 క్యారెట్లు - రూ. 10,956

హైదరాబాద్..

24 క్యారెట్లు- రూ. 14,608, 22 క్యారెట్లు - రూ. 13,390, 18 క్యారెట్లు - రూ. 10,956

విజయవాడ..

24 క్యారెట్లు- రూ. 14,608, 22 క్యారెట్లు - రూ. 13,390, 18 క్యారెట్లు - రూ. 10,956

విశాఖపట్నం..

24 క్యారెట్లు- రూ. 14,608, 22 క్యారెట్లు - రూ. 13,390, 18 క్యారెట్లు - రూ. 10,956

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+