బంగాళాఖాతంలో బలపడ్డ ఆవర్తనం: ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలకు ఛాన్స్

బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఏపీలో పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. బలమైన ఈదురుగాలులు, పిడుగులతో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదవుతున్నాయి. నైరుతి రుతుపవనాలు నిరాశపరిచినప్పటికీ ఈ ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఒకింత వర్షాలకు లోటు ఉండట్లేదు. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు పలు జిల్లాల్లో తరచూ వర్షాలు పడుతున్నాయి.

ఇవే పరిస్థితులు ఈ సాయంత్రం కూడా కొనసాగనున్నాయి. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో శుక్రవారం నాటికి బంగాళాఖాతం ఆగ్నేయ ప్రాంతం, దానికి ఆనుకుని ఉన్న తూర్పు- మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వెల్లడించారు. అనంతరం అది వాయవ్య దిశగా కదులుతూ మరింత బలపడే అవకాశం అంచనా వేసినట్లు చెప్పారు.

Heavy rain for Nellore and Tirupati as low-pressure area forming southeast and central Bay of Bengal

ప్రస్తుతం బంగాళాఖాతంపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం.. ఉత్తరాంధ్ర వరకు విస్తరించింది. దీని ప్రభావంతో నేడు పోలవరం, కోనసీమ, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో చెదురుమదురుగా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే మిగిలిన జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయి. ద్రోణి ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా ఆకాశం మేఘవృతమై ఉంటుందని, చల్లటి వాతావరణంతో పాటు అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు పడొచ్చు.

ఆస్ట్రేలియాపై సెంచరీతో తడాఖా చూపిన బావుమా
ఆస్ట్రేలియాపై సెంచరీతో తడాఖా చూపిన బావుమా

రాగల మూడు గంటల్లో నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. వాతావరణ పరిస్థితుల తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ఈ రెండు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ సైతం జారీ చేసింది. నెల్లూరు, పొదలకూరు, రాపూరు, వెంకటగిరి, శ్రీకాళహస్తి, సూళ్లూరుపేట, నాయుడుపేట, ఓజిలి, కోట, మనుబోలు, తిరుపతి, రేణిగుంట తదితర ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

59 మంది పోలీసుల వివరాలను ఎస్ఈసీకి అందజేసిన వైసీపీ
59 మంది పోలీసుల వివరాలను ఎస్ఈసీకి అందజేసిన వైసీపీ

పిడుగులు పడుతున్నప్పుడు గానీ, ఈదురుగాలులు వీస్తున్నప్పుడు శిథిల నివాసాలు, గోడలు, చెట్లు, హోర్డింగుల కింద తలదాచుకోవద్దని ప్రఖర్ జైన్ సూచించారు. ఆకాశం మేఘావృతమై ఉరుములు వినిపించిన వెంటనే పొలాల్లో పనిచేసే రైతులు, రైతు కూలీలు, శ్రామికులు, పశుకాపరులు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+