Gold: పాతాళానికి పసిడి? పుతిన్ షాకింగ్ నిర్ణయం
బంగారం ధరల విషయంలో సామాన్యులకు షాకింగ్ అప్‌డేట్ ఇది. మొన్నటి వరకు "తులం బంగారం లక్షన్నర దాటుతుందా?" అన్న భయం నుంచి, ఇప్పుడు "మళ్ళీ లక్ష రూపాయల కంటే కిందకు వస్తుందా?" అన్న ఆశ రేకెత్తించేలా మార్కెట్ పరిస్థితులు మారిపోయాయి. రికార్డు స్థాయి గరిష్టాల నుంచి పసిడి దిగివస్తుండటంతో ఇన్వెస్టర్లు ఒక్కసారిగా డైలమాలో పడ్డారు. పసిడి మార్కెట్‌లో రాబోయే భారీ మార్పులపై నిపుణులు ఏమంటున్నారో చూడండి.
2026 ప్రారంభంలో పసిడి ధరలు చూసి కంగుతిన్న సామాన్యుడికి ఇప్పుడు ఊరట లభించే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ ఏడాది జనవరిలో MCXలో 10 గ్రాముల బంగారం ధర రూ. 1,80,779 అనే చారిత్రాత్మక గరిష్ట స్థాయిని తాకిన సంగతి తెలిసిందే. అయితే, ఆకాశమే హద్దుగా పెరిగిన ధరల ప్రభ ఇప్పుడు తగ్గుముఖం పట్టే సూచనలు బలంగా ఉన్నాయని మార్కెట్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Gold: 2027 నాటికి రూ. లక్ష దిగువకు?
ప్రముఖ మార్కెట్ విశ్లేషకుడు, PACE 360 చీఫ్ స్ట్రాటజిస్ట్ అమిత్ గోయల్ అంచనా ప్రకారం.. బంగారం పతనం ఇప్పుడే మొదలైంది. ప్రస్తుతం గరిష్ట స్థాయి నుంచి ధరలు 15 శాతం తగ్గినప్పటికీ, ఇది కేవలం ఆరంభం మాత్రమేనని ఆయన అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 3వేల డాలర్లకు చేరుకోవచ్చని, దీని ప్రభావంతో 2027 చివరి నాటికి భారతదేశంలో తులం బంగారం ధర లక్ష రూపాయల కంటే కిందికి పడిపోయే అవకాశం ఉందని ఆయన సంచలన అంచనా వేశారు.
పతనానికి పుతిన్ నిర్ణయమే కారణమా?
బంగారం ధరలు తగ్గడానికి ప్రధానంగా అంతర్జాతీయ రాజకీయాల్లో వస్తున్న మార్పులే కారణమని బ్లూమ్‌బెర్గ్ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి:
- రష్యా-అమెరికా స్నేహం: ఉక్రెయిన్ యుద్ధం ముగింపు దశకు చేరుకోవడం, అమెరికాలో ట్రంప్ ప్రభుత్వం రావడంతో రష్యా అధ్యక్షుడు పుతిన్ తన వ్యూహాన్ని మార్చారు.
- మళ్ళీ డాలర్ వైపు: డాలర్ ప్రభావాన్ని తగ్గించడానికి (De-dollarization) ఇప్పటివరకు బంగారాన్ని భారీగా నిల్వ చేసిన రష్యా, ఇప్పుడు తిరిగి అంతర్జాతీయ వాణిజ్యానికి అమెరికన్ డాలర్లనే వాడాలని నిర్ణయించుకుంది.
- బ్రిక్స్ (BRICS) కూటమిలో కీలక దేశమైన రష్యానే ఇలాంటి నిర్ణయం తీసుకోవడంతో బంగారంపై ఉన్న భారీ డిమాండ్ ఒక్కసారిగా పడిపోయింది.
సెంట్రల్ బ్యాంకుల అమ్మకాల ఒత్తిడి
గత నాలుగేళ్లలో (2020-24) ప్రపంచవ్యాప్తంగా అమ్ముడైన బంగారంలో సగం కంటే ఎక్కువ చైనా, రష్యా, భారత్ వంటి దేశాల సెంట్రల్ బ్యాంకులే కొనుగోలు చేశాయి. ట్రంప్ విధిస్తున్న ఆర్థిక ఆంక్షల నుంచి తప్పించుకోవడానికి ఈ దేశాలు బంగారాన్ని ఒక 'సేఫ్ హెవెన్'గా భావించాయి. అయితే ఇప్పుడు రష్యా తిరిగి డాలర్ వ్యవస్థలోకి వస్తుండటంతో, బ్యాంకులు తమ వద్ద ఉన్న గోల్డ్ నిల్వలను బహిరంగ మార్కెట్లో విక్రయించే (Selling Pressure) అవకాశం ఉంది. ఇదే జరిగితే మార్కెట్లోకి గోల్డ్ సప్లై పెరిగి ధరలు మరింత వేగంగా క్రాష్ అవుతాయని నిపుణుడు అనుజ్ గుప్తా వివరించారు.
డీ-డాలరైజేషన్‌కు గట్టి దెబ్బ
అమెరికా ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్ల తగ్గింపుపై ఉన్న అనిశ్చితి కూడా బంగారంపై నెగిటివ్ ప్రభావం చూపుతున్నాయి. డాలర్‌కు ప్రత్యామ్నాయంగా బంగారాన్ని నిలబెట్టాలన్న ప్రయత్నాలకు రష్యా తాజా నిర్ణయం గట్టి దెబ్బ కొట్టింది. మొత్తానికి బులియన్ మార్కెట్‌లో 'బేర్ మార్కెట్' (ధరలు తగ్గే కాలం) మొదలైందని, కొనుగోలు చేసేవారు కొద్ది రోజులు వేచి చూడటం ఉత్తమమని విశ్లేషకులు సూచిస్తున్నారు.
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి












Click it and Unblock the Notifications