బంగారం ధరల పతనాన్ని శాసిస్తోన్న ఆ పరిణామాలు- భారీగా తగ్గుముఖం

దేశీయంగా బంగారం, వెండి ధరలు నేడు భారీగా తగ్గుముఖం పట్టాయి. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో వీటి రేట్లు క్షీణించాయి. సాధారణంగా యుద్ధ వాతావరణం ఉన్నప్పుడు సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారానికి డిమాండ్ పెరుగుతుంది గానీ.. ఇక్కడి పరిస్థితులు మాత్రం భిన్నంగా ఉంటోన్నాయి. అంతర్జాతీయంగా అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరినప్పటికీ దేశీయ కమోడిటీలో బంగారం, వెండి ధరలు పతనం కావడం ఇన్వెస్టర్లను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

యుద్ధ భయాలతో అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను మరింత కాలం పాటు గరిష్ట స్థాయిలోనే ఉంచవచ్చనే అంచనాలు కూడా బంగారం, వెండి ధరలను ప్రభావితం చేశాయి. ఈ పరిణామాల నేపథ్యంలోనే నేడు ట్రేడింగ్‌లో ఎంసీఎక్స్ ఆగస్టు గోల్డ్ ఫ్యూచర్స్ 1.16 శాతం తగ్గి 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,41,820 వద్ద ట్రేడ్ అయింది. అలాగే సెప్టెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ ఏకంగా 2.34 శాతం నష్టపోయింది. కిలో రూ.2,17,448 స్థాయికి పడిపోయింది. సురక్షితమైన పెట్టుబడిగా భావించే వీటి గమనాన్ని అంతర్జాతీయ ట్రెండ్స్ శాసిస్తోన్నాయి.

Gold Price Slips MCX Futures as US-Iran Tensions Lift Dollar Silver Falls 2 Percent Amid Oil Surge

దేశంలోని ప్రముఖ జ్యువెలరీ బ్రాండ్లలో కూడా రిటైల్ ధరలు దాదాపు స్థిరంగా సాగుతున్నాయి. జాయ్‌ ఆలుక్కాస్, మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ వంటి ప్రముఖ సంస్థలు 22 క్యారెట్ల బంగారాన్ని గ్రాముకు రూ. 13,230 గా విక్రయిస్తున్నాయి. తనిష్క్ బ్రాండ్ లో ఈ రేటు రూ. 13,275లుగా నమోదైంది. 24 క్యారెట్ల ధర గ్రాముకు రూ. 14,482 వద్ద ట్రేడవుతోంది. ఆయా కంపెనీల బ్రాండ్ విలువ, స్థానిక పన్నుల బట్టి ఈ స్వల్ప తేడాలు ఉంటాయి.

హైదరాబాద్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,44,320, 22 క్యారెట్లు రూ. 1,32,290లకు లభిస్తోంది. బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 1,44,320, 22 క్యారెట్లు రూ. 1,32,290 వద్ద ట్రేడ్ అయింది. చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 1,45,080, 22 క్యారెట్లు రూ. 1,32,990 వద్ద స్థిరపడింది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు రూ. 1,44,320 కాగా 22 క్యారెట్లు రూ. 1,32,290 పలుకుతోంది.

ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు (గ్రాముకు)

చెన్నై..

24 క్యారెట్లు- రూ. 14,400, 22 క్యారెట్లు - రూ. 13,200, 18 క్యారెట్లు - రూ. 11,020

ముంబై..

24 క్యారెట్లు - రూ. 14,291, 22 క్యారెట్లు- రూ. 13,100, 18 క్యారెట్లు - రూ. 10,718

బెంగళూరు..

24 క్యారెట్లు - రూ. 14,291, 22 క్యారెట్లు- రూ. 13,100, 18 క్యారెట్లు - రూ. 10,718

హైదరాబాద్..

24 క్యారెట్లు - రూ. 14,291, 22 క్యారెట్లు- రూ. 13,100, 18 క్యారెట్లు - రూ. 10,718

విజయవాడ..

24 క్యారెట్లు - రూ. 14,291, 22 క్యారెట్లు- రూ. 13,100, 18 క్యారెట్లు - రూ. 10,718

విశాఖపట్నం..

24 క్యారెట్లు - రూ. 14,291, 22 క్యారెట్లు- రూ. 13,100, 18 క్యారెట్లు - రూ. 10,718

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
q