బంగారానికి భారీ గిరాకీ- హై రేంజ్ ట్రేడింగ్
పశ్చిమాసియాలో చోటుచేసుకుంటున్న తాజా పరిణామాలు, అంతర్జాతీయ ఉద్రిక్తతల నేపథ్యంలో దేశీయ రిటైల్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు మళ్లీ పుంజుకున్నాయి. నేడు దేశవ్యాప్తంగా పసిడి హై రేంజ్ లో ట్రేడ్ అవుతోంది. పండగ సీజన్ సమీపించడంతో రిటైల్ మార్కెట్ లో కొనుగోళ్లు పెరగడం, అంతర్జాతీయ మార్కెట్ లో డాలర్ విలువ బలహీనపడటం.. వంటి పరిణామాలు దీనికి కారణం అయ్యాయి. అటు దీర్ఘకాలిక పెట్టుబడిదారులూ బంగారం కొనుగోళ్లకు ప్రాధాన్యత ఇస్తోన్నారు.
ఈ ఉదయం ట్రేడింగ్ ఆరంభం అయ్యే సమయానికి 24 క్యారెట్ల బంగారం ధర 0.72 శాతం పెరిగింది. సోమవారం నాటి క్లోజింగ్ సెషన్ తో పోల్చుకుంటే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరలో 1,200 రూపాయల మేర పెరుగుదల కనిపించింది. 24 క్యారెట్లు 1,110, 18 క్యారెట్లు 900 రూపాయల మేర లాభపడింది. మొత్తం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,54,080 వద్ద కొనసాగుతోంది. రెండు వారాల కిందటి ఇదే ధర రూ. 1,64,000 దాటిన విషయం తెలిసిందే.

అటు అంతర్జాతీయ మార్కెట్ లో కూడా స్పాట్ గోల్డ్ ధర 0.7 శాతం లాభపడి ఔన్స్‌కు 4,435 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. డాలర్ ఇండెక్స్ క్షీణత, భౌగోళిక రాజకీయ అనిశ్చితి వల్ల ఇన్వెస్టర్లు సురక్షిత ఆస్తుల వైపు మొగ్గు చూపుతున్నట్టు విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు మల్టీ కమొడిటీ ఎక్స్ఛేంజ్ లో వెండి ఫ్యూచర్స్ కూడా 0.71 శాతం పెరిగి కిలో రూ. 2,40,700 కు చేరింది.
ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,53,930, 22 క్యారెట్లు రూ. రూ. 1,41,103, వెండి కిలో రూ. 2,40,050 వద్ద స్థిరపడింది. బెంగళూరులో ఇవే రేట్లు వరుసగా రూ. 1,54,050, రూ. 1,41,213, రూ. 2,40,240 గా నమోదయ్యాయి. హైదరాబాద్ లో 24 క్యారెట్లు రూ. 1,54,170, 22 క్యారెట్లు రూ. 1,41,323, వెండి రూ. 2,40,430 వద్ద కొనసాగింది. చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,54,3700, 22 క్యారెట్లు రూ. 1,41,506, వెండి రూ. 2,40,750 వద్ద ట్రేడ్ అయింది.
వివిధ నగరాల్లో నేడు నమోదైన బంగారం రేట్లు ఒక గ్రాముకు ఇలా ఉన్నాయి.
చెన్నై..
24 క్యారెట్లు- రూ. 15,567, 22 క్యారెట్లు - రూ. 14,270, 18 క్యారెట్లు - రూ. 12,040
ముంబై..
24 క్యారెట్లు - రూ. 15,535, 22 క్యారెట్లు- రూ. 14,240, 18 క్యారెట్లు - రూ. 11,651
బెంగళూరు..
24 క్యారెట్లు - రూ. 15,535, 22 క్యారెట్లు- రూ. 14,240, 18 క్యారెట్లు - రూ. 11,651
హైదరాబాద్..
24 క్యారెట్లు - రూ. 15,535, 22 క్యారెట్లు- రూ. 14,240, 18 క్యారెట్లు - రూ. 11,651
విజయవాడ..
24 క్యారెట్లు - రూ. 15,535, 22 క్యారెట్లు- రూ. 14,240, 18 క్యారెట్లు - రూ. 11,651
విశాఖపట్నం..
24 క్యారెట్లు - రూ. 15,535, 22 క్యారెట్లు- రూ. 14,240, 18 క్యారెట్లు - రూ. 11,651












Click it and Unblock the Notifications
