కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఎందుకిలా

బంగారం ధరల్లో అనూహ్య పరిణామాలు సంభవిస్తోన్నాయి. కొనుగోలుదారులను అయోమయానికి గురి చేస్తోన్నాయి. అమెరికా ఉద్యోగ గణాంకాలతో వడ్డీ రేట్ల తగ్గింపు అంచనాలు సన్నగిల్లడం.. వీటిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. వారం రోజుల కనిష్టానికి చేరిన బంగారం, వెండి ధరలు నేడు పెరిగాయి. అధిక అమ్మకాల ఒత్తిడితో కీలక మద్దతు స్థాయి కంటే దిగువకు పడి తీవ్ర నష్టాలను చవిచూసిన పసిడి, వెండి ధరల్లో చెప్పుకోదగ్గ స్థాయిలో తగ్గాయి. బంగారం ధర ఇటీవలి పెరుగుదలతో పోల్చుకుంటే తక్కువకే ట్రేడ్ అవుతోంది. గరిష్టంగా 1,90,000 రూపాయల నుంచి పడిపోయింది.

సుమారు 10 గ్రాములకు 36,000 రూపాయలకు పైగా డౌన్ ఫాల్ కనిపించింది. దేశంలోని ప్రధాన నగరాల్లో 24 క్యారెట్ల బంగారం ఢిల్లీ రూ. 1,55,940, ముంబై రూ. 1,56,210, కోల్‌కతా రూ. 1,56,010, చెన్నై రూ. 1,56,670, బెంగళూరు రూ. 1,56,340లు పలుకుతోంది. 22 క్యారెట్లు ఢిల్లీ రూ. 1,42,945, ముంబై రూ. 1,43,193, కోల్‌కతా రూ. 1,43,009, చెన్నై రూ. 1,43,614, బెంగళూరు రూ. 1,43,312 లు ఉంటోంది. కిలో వెండి ఢిల్లీ రూ. 2,45,150, ముంబై రూ. 2,45,570, కోల్‌కతా రూ. 2,45,250, చెన్నై రూ. 2,46,290, బెంగళూరు రూ. 2,45,760 గా రికార్డయింది.

Gold Price Today in India Slides as Physical Benchmark Weakens Even as Futures Bounce straight day

కిలో వెండి ధర మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో గత శుక్రవారం ఫ్యూచర్స్ ట్రేడింగ్‌లో రూ. 2,44,360 వద్ద ముగిసింది. ఇది అంతకుముందు ముగింపు ధర కంటే 7,925 ఎక్కువ. అయినప్పటికీ, వెండి దాని జీవితకాల గరిష్ట స్థాయిని పోలిస్తే, ప్రస్తుత ధర గణనీయంగా తక్కువగా ఉంది. జనవరి 29న వెండి ఏకంగా రూ. 4,20,048 పలికి చరిత్ర సృష్టించింది. ఒక కిలో వెండికి ఇది గరిష్ట స్థాయి. ఆ తర్వాత వాటి ధరలు పడిపోవడం మొదలైంది. రూ. 2.25 లక్షలకు చేరుకుంది.

ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు (గ్రాముకు)

చెన్నై..

24 క్యారెట్లు- రూ. 15,884, 22 క్యారెట్లు - రూ. 14,560, 18 క్యారెట్లు - రూ. 12,450

ముంబై..

24 క్యారెట్లు - రూ. 15,775, 22 క్యారెట్లు- రూ. 14,460, 18 క్యారెట్లు - రూ. 11,831

బెంగళూరు..

24 క్యారెట్లు - రూ. 15,775, 22 క్యారెట్లు- రూ. 14,460, 18 క్యారెట్లు - రూ. 11,831

హైదరాబాద్..

24 క్యారెట్లు - రూ. 15,775, 22 క్యారెట్లు- రూ. 14,460, 18 క్యారెట్లు - రూ. 11,831

విజయవాడ..

24 క్యారెట్లు - రూ. 15,775, 22 క్యారెట్లు- రూ. 14,460, 18 క్యారెట్లు - రూ. 11,831

విశాఖపట్నం..

24 క్యారెట్లు - రూ. 15,775, 22 క్యారెట్లు- రూ. 14,460, 18 క్యారెట్లు - రూ. 11,831

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+