పసిడి ధరల్లో అనూహ్యం- ప్రాఫిట్ బుకింగ్ ఆవిరి

పశ్చిమ ఆసియాలో మరోసారి ఉద్రిక్తతలు పెరిగాయి. సోమవారం అమెరికా సైన్యం దక్షిణ ఇరాన్‌పై దాడి చేసింది. ఆత్మరక్షణలో భాగంగానే ఈ దాడులు జరిపినట్లు అమెరికా రక్షణ శాఖ పేర్కొంది. ఇరాన్‌కు చెందిన క్షిపణి ప్రయోగ కేంద్రాలు, సముద్రంలో మైన్‌లు వేసే పడవలు లక్ష్యంగా ఈ దాడులు కొనసాగాయి. ఇది నిలిచిపోయిన ఇరాన్-అమెరికా యుద్ధానికి తిరిగి సంకేతాలుగా భావిస్తున్నారు. కాల్పుల విరమణ ఒప్పందం బ్రేక్ అయినట్టే కనిపిస్తోంది.

ఈ పరిణామాలు బంగారం ధరలను ప్రభావితం చేశాయి. నేడు పసిడి రేట్లు భారీగా తగ్గాయి. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా (MCX)లో బంగారం ధరల ట్రేడింగ్ లోయర్ సర్క్యుట్ లో ఆరంభమైంది. ఎంసీఎక్స్ లో జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ 0.24 శాతం మేర తగ్గింది. 10 గ్రాములకు 1,58,135 రూపాయల వద్ద ట్రేడ్ అయ్యింది. అదే సమయంలో, జూలై సిల్వర్ ఫ్యూచర్స్ ఏకంగా 1.09 శాతం పడిపోయి కిలోకు 2,73,689 రూపాయలకు చేరాయి. మంగళవారంతో పోలిస్తే గణనీయమైన పతనంగా చెప్పుకోవచ్చు.

Gold Price Today Tumbles as US-Iran Tensions Send Shivers Through Markets Raising Peace Talks Doubt

అంతర్జాతీయంగా కూడా బులియన్ ధరలు పడిపోయాయి. 0.7% వరకు పడిపోయి ఔన్సుకు 4,540 డాలర్లకు చేరుకున్నాయి. దేశంలోని వివిధ నగరాల్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధరలను పరిశీలిస్తే ఢిల్లీ, జైపూర్‌లో రూ. 1,58,150, అహ్మదాబాద్, పూణేలో రూ. 1,58,100; ముంబై, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, కోల్‌కతాలో రూ. 1,58,050గా నమోదైంది. అలాగే, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు ఢిల్లీ, జైపూర్‌లో రూ. 1,44,880; అహ్మదాబాద్, పూణేలో రూ. 1,44,830; ముంబై, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, కోల్‌కతాలో రూ. 1,44,790గా నమోదయ్యాయి.

24 క్యారెట్లు- రూ. 16,125, 22 క్యారెట్లు - రూ. 14,781, 18 క్యారెట్లు - రూ. 12,401

ముంబై..

24 క్యారెట్లు - రూ. 15,889, 22 క్యారెట్లు- రూ. 14,565, 18 క్యారెట్లు - రూ. 11,917

బెంగళూరు..

24 క్యారెట్లు - రూ. 15,889, 22 క్యారెట్లు- రూ. 14,565, 18 క్యారెట్లు - రూ. 11,917

హైదరాబాద్..

24 క్యారెట్లు - రూ. 15,889, 22 క్యారెట్లు- రూ. 14,565, 18 క్యారెట్లు - రూ. 11,917

విజయవాడ..

24 క్యారెట్లు - రూ. 15,889, 22 క్యారెట్లు- రూ. 14,565, 18 క్యారెట్లు - రూ. 11,917

విశాఖపట్నం..

24 క్యారెట్లు - రూ. 15,889, 22 క్యారెట్లు- రూ. 14,565, 18 క్యారెట్లు - రూ. 11,917

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+