బంగారం ప్రియులకు భారీ షాక్..!!
వెనిజులాపై అమెరికా చేపట్టిన సైనిక చర్య.. బులియన్ మార్కెట్ పై తీవ్ర ప్రభావాన్ని చూపింది. బంగారం, వెండి ధరలు ప్రపంచవ్యాప్తంగా భారీగా పెరిగాయి. అమెరికా-వెనిజులా మధ్య నెలకొన్న ఈ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పసిడి, వెండి ధరల పెరుగుదలకు ఆజ్యం పోశాయి. అంతర్జాతీయ స్పాట్ మార్కెట్‌లో ఒక ఔన్స్ వెండి ధర 75 డాలర్లు కాగా, బంగారం ధర 1.91 శాతం పెరుగుదలతో 4,401 డాలర్లకు చేరుకుంది. ఈ పరిణామం పెట్టుబడిదారుల సెంటిమెంట్‌పై ప్రభావం చూపింది.
ఢిల్లీలో 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ. 1,37,550కి చేరగా, 22 క్యారెట్ల బంగారం రూ. 1,26,100కి లభించింది. స్పాట్ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ. 2,47,000 పలికింది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో గోల్డ్ ఫ్యూచర్స్ 1.12 శాతం పెరిగి 10 గ్రాములకు రూ. 1,37,281కి చేరింది. సిల్వర్ ఫ్యూచర్స్ దాదాపు మూడు శాతం ఎగిసి కిలోకు రూ. 2,43,181 పలికింది.

10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు ఢిల్లీ, జైపూర్‌లో రూ. 1,26,100; అహ్మదాబాద్, పుణెలో రూ. 1,26,000, ముంబై, హైదరాబాద్, బెంగళూరు, కోల్‌కతాలో రూ. 1,25,950గా నమోదయ్యాయి. 24 క్యారెట్ల బంగారం ధరలు ఢిల్లీ, జైపూర్‌లో రూ. 1,37,550; అహ్మదాబాద్, పుణెలో రూ. 1,37,450; ముంబై, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, కోల్‌కతాలో రూ. 1,37,400 చొప్పున పలికాయి. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం పది గ్రాములకు రూ. 1,23,490గా నమోదయింది.
ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు (గ్రాముకు)
చెన్నై..
24 క్యారెట్లు- రూ. 13,833, 22 క్యారెట్లు - రూ. 12,680, 18 క్యారెట్లు - రూ. 10,575
ముంబై..
24 క్యారెట్లు - రూ. 13,740, 22 క్యారెట్లు- రూ. 12,595, 18 క్యారెట్లు - రూ. 10,305
ఢిల్లీ..
24 క్యారెట్లు - రూ. 13,755, 22 క్యారెట్లు- రూ. 12,610, 18 క్యారెట్లు - రూ. 10,320
బెంగళూరు..
24 క్యారెట్లు - రూ. 13,740, 22 క్యారెట్లు- రూ. 12,595, 18 క్యారెట్లు- రూ. 10,305
హైదరాబాద్..
24 క్యారెట్లు - రూ. 13,740, 22 క్యారెట్లు- రూ. 12,595, 18 క్యారెట్లు- రూ. 10,305
విజయవాడ..
24 క్యారెట్లు - రూ. 13,740, 22 క్యారెట్లు- రూ. 12,595, 18 క్యారెట్లు- రూ. 10,305
విశాఖపట్నం..
24 క్యారెట్లు - రూ. 13,740, 22 క్యారెట్లు- రూ. 12,595, 18 క్యారెట్లు- రూ. 10,305












Click it and Unblock the Notifications