పసిడి రేట్లకు పూనకాలు- తగ్గేదే లేదు

అంతర్జాతీయంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల పరిణామాల నేపథ్యంలో దేశంలో బంగారం ధరలు తగ్గేదే లేదంటోన్నాయి. నేడు మళ్లీ పెరిగాయి. పశ్చిమాసియాలో అమెరికా, ఇరాన్ మధ్య నెలకొన్న అనిశ్చితి, గ్లోబల్ మార్కెట్‌లో చోటుచేసుకున్న పరిణామాలు బంగారం ధరల పెరుగుదలకు ప్రధాన కారణం అయ్యాయి. అటు పండగ సీజన్ కావడం వల్ల బంగారం కొనుగోళ్లకు భారీగా గిరాకీ ఏర్పడింది.

మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX) లో నేడు పసిడి ధర 0.65 శాతం లాభపడి 10 గ్రాములకు రూ.1,63,870 వద్ద ట్రేడ్ అయింది. శుక్రవారం నాటి క్లోజింగ్ సెషన్ తో పోల్చుకుంటే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరలో 880 రూపాయల మేర పెరుగదల కనిపించింది. 22 క్యారెట్లలో రూ. 800, 18 క్యారెట్లల్లో రూ. 610 పెరిగాయి. కిందటి వారం నుంచీ బంగారం ధరలు ఈ తాకిడిని ఎదుర్యొంటూనే వస్తోన్నాయి. రూ. 4,000 రూపాయల వరకు పెరిగింది.

Gold Prices Climb in India After US Warns Major Financial Offensive Against Iran and inflation data

అదే సమయంలో వెండి ధరల్లో స్వల్ప క్షీణత నమోదైంది. దేశీయ వెండి ఫ్యూచర్స్ మార్కెట్లో కిలో వెండి ధర 0.13 శాతం తగ్గి రూ.2,47,230 వద్ద కొనసాగుతోంది. రిటైల్ మార్కెట్‌లో కూడా వెండి ధర నిలకడగా లేదా స్వల్ప నష్టాలతో ట్రేడ్ అవుతోంది. సాధారణంగా దేశీయ రిటైల్ మార్కెట్లో ఆభరణాల తయారీ కోసం కొనుగోలుదారులు ఎక్కువగా 22 క్యారెట్ల బంగారాన్ని ఎంచుకుంటారు. అదేవిధంగా పెట్టుబడి ప్రయోజనాల కోసం 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారాన్ని కొనుగోలు చేస్తుంటారు.

ఇరాన్ వద్ద తరగని గని- కొత్తగా 7.5 ట్రిలియన్ల క్యూబిక్ అడుగుల నేచురల్ గ్యాస్ గుర్తింపు
ఇరాన్ వద్ద తరగని గని- కొత్తగా 7.5 ట్రిలియన్ల క్యూబిక్ అడుగుల నేచురల్ గ్యాస్ గుర్తింపు

హైదరాబాద్ లో నేడు 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,63,600, 22 క్యారెట్లు రూ.1,49,967 కాగా వెండి కిలోకు రూ. 2,47,110 వద్ద ట్రేడ్ అవుతోంది. ముంబైలో 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి రూ.1,63,580 పలుకుతోంది. 22 క్యారెట్లు రూ.1,49,948, వెండి కిలో రూ.2,47,150 వద్ద నిలిచింది. బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,63,710, 22 క్యారెట్లు రూ.1,50,068, వెండి రూ. 2,47,350 వద్ద స్థిరపడ్డాయి. చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాములు పసిడి రూ.1,63,820, 22 క్యారెట్లు రూ.1,50,168, వెండి కిలో రూ.2,47,440 వద్ద నిలిచాయి.

దెబ్బకు సూపర్ హీరో ఇమేజ్.. అమాంతం పెరిగిన క్రేజ్
దెబ్బకు సూపర్ హీరో ఇమేజ్.. అమాంతం పెరిగిన క్రేజ్

వివిధ నగరాల్లో నేడు నమోదైన బంగారం రేట్లు ఒక గ్రాముకు ఇలా ఉన్నాయి.

చెన్నై..

24 క్యారెట్లు- రూ. 16,397, 22 క్యారెట్లు - రూ. 15,030, 18 క్యారెట్లు - రూ. 12,800

ముంబై..

24 క్యారెట్లు - రూ. 16,397, 22 క్యారెట్లు- రూ. 15,030, 18 క్యారెట్లు - రూ. 12,293

బెంగళూరు..

24 క్యారెట్లు - రూ. 16,397, 22 క్యారెట్లు- రూ. 15,030, 18 క్యారెట్లు - రూ. 12,293

హైదరాబాద్..

24 క్యారెట్లు - రూ. 16,397, 22 క్యారెట్లు- రూ. 15,030, 18 క్యారెట్లు - రూ. 12,293

విజయవాడ..

24 క్యారెట్లు - రూ. 16,397, 22 క్యారెట్లు- రూ. 15,030, 18 క్యారెట్లు - రూ. 12,293

విశాఖపట్నం..

24 క్యారెట్లు - రూ. 16,397, 22 క్యారెట్లు- రూ. 15,030, 18 క్యారెట్లు - రూ. 12,293

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+