రూ.50,000 తగ్గిన బంగారం ధరలు.. దీపావళికి ముందే గోల్డెన్ ఛాన్స్!

దీపావళి, ధంతేరస్(ధనత్రయోదశి) పండుగలు సమీపిస్తున్న నేపథ్యంలో పసిడి ప్రియులకు, పెట్టుబడిదారులకు గుడ్ న్యూస్ అందింది. గత కొన్ని నెలలుగా ఆకాశాన్ని తాకిన బంగారం ధరలు ఒక్కసారిగా భారీగా దిగొచ్చాయి. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్(ఎంసీఎక్స్)లో శుక్రవారం సాయంత్రం 10 గ్రాముల బంగారం ధర సుమారు 2.50 శాతానికి పైగా పడిపోయి రూ.1,38,250 స్థాయికి చేరుకుంది. శుక్రవారం ఒక్కరోజే పసిడి ధర దాదాపు రూ.4 వేలకు పైగా తగ్గడం గమనార్హం.

బంగారం ధరల్లో షార్ప్ డౌన్ ఫాల్
బంగారం ధరల్లో షార్ప్ డౌన్ ఫాల్

ఈ సంవత్సరం జనవరిలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1.91 లక్షల ఆల్-టైమ్ రికార్డు స్థాయికి చేరింది. అయితే ఆ గరిష్ట స్థాయి నుంచి చూస్తే గత 10 నెలల్లో పసిడి ధర ఏకంగా రూ.50,000కు పైగా దిగొచ్చింది. గతేడాది దీపావళితో పోలిస్తే కూడా ఈ సారి బంగారం తక్కువ ధరకే లభిస్తుండటంతో కొనుగోలుదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Gold Prices Drops by Rs 50 000 Before Diwali Is This the Right Time to Buy Gold Check MCX gold rates

ధరలు తగ్గడానికి ప్రధాన కారణాలు
బంగారం ధర తగ్గడానికి గ్లోబల్ మార్కెట్ల ప్రభావమే ప్రధాన కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా అమెరికా-ఇరాన్ దేశాల మధ్య చెలరేగిన తీవ్ర ఉద్రిక్తతలు, ప్రపంచవ్యాప్తంగా నెలకొన్ని అనిశ్చితి పసిడి ధరలు పెరగడానికి కారణమని పేర్కొంటున్నారు. వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు వడ్డే రేట్లను పెంచడం కూడా ఓ కారణం. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ ముడిచమురు ధర 110 డాలర్లు దాటిన ప్రభావం కూడా బంగారం ధరలపై ప్రభావం చూపింది.

కొనుగోలుకు ఇదే సరైన సమయమా?
ఇండియాలో పండుగ రోజుల్లో బంగారం కొనడం శుభ పరిణామంగా భావిస్తారు. ధర రూ.50,000 వరకు తగ్గిన నేపథ్యంలో పసిడి లేదా ఆభరణాలు కొనాలనుకునే సామాన్యులకు ఇది మంచి అవకాశమని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఎరువులు, గ్యాస్‌పై పుకార్లు.. ప్రతిపక్షాలపై ప్రధాని ఫైర్!
ఎరువులు, గ్యాస్‌పై పుకార్లు.. ప్రతిపక్షాలపై ప్రధాని ఫైర్!

పెట్టుబడిదారులకు ఆర్థిక నిపుణుల సూచనలు
మార్కెట్లో అనిశ్చితి కొనసాగుతున్నందున డబ్బు మొత్తాన్ని ఒకేసారి పెట్టుబడి పెట్టకుండా సిప్ విధానంలో లేదా విడతల వారీగా కొనుగోలు చేయడం శ్రేయస్కరం. స్వల్పకాలిక లాభాల కంటే కనీసం 2 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలపరిమితిని లక్ష్యంగా పెట్టుకుని పెట్టుబడి పెట్టాలి. దీర్ఘకాలంలో బంగారం ఎల్లప్పుడూ ద్రవ్యోల్బణాన్ని తట్టుకుని ఉత్తమ రాబడులను ఇస్తుందని ఆర్థిక వేత్తలు గుర్తు చేస్తున్నారు. అమెరికాలో ద్రవ్యోల్బణం తగ్గి, వడ్డీ రేట్ల కోత చర్చలు మొదలవగానే బంగారం మళ్లీ పుంజుకునే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు ఆర్థిక సలహాదారుల అభిప్రాయం తీసుకోవడం మంచిది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+