పరుగులు పెడుతున్న పసిడి రేట్లు?
దేశీయ మార్కెట్లలో బంగారం ధరల్లో భారీ మార్పులు చోటు చేసుకుంటోన్నాయి. అంతర్జాతీయంగా ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్‌ల మధ్య భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతలు వీటిని అస్థిరంగా ఉంచుతున్నాయి, సురక్షిత పెట్టుబడుల డిమాండ్‌ను పెంచుతున్నాయి. శుక్రవారం బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. నేడూ అదే పరిస్థితి నెలకొంది. అమెరికా, ఇరాన్‌ల మధ్య తాత్కాలిక కాల్పుల విరమణ తరువాత డాలర్ బలహీనపడటం దీనికి కారణమైంది.
కాల్పుల విరమణ చర్చలు ఎంత వరకు ఫలిస్తాయనేది వీటి రేట్లను మరింత ప్రభావితం చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ పరిణామాల మధ్య 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం 1,52,360 రూపాయలకు చేరుకోగా, 22 క్యారెట్ల బంగారం కూడా పెరిగింది. 10 గ్రాములకు 1,39,660 రూపాయలుగా నమోదైంది. ప్రధాన నగరాల్లో 24 క్యారెట్ల బంగారం ధరలను పరిశీలిస్తే.. ముంబై, కోల్‌కతా, హైదరాబాద్‌లలో 10 గ్రాములకు రూ. 1,52,360గా నిలిచింది. చెన్నైలో మాత్రం ప్రీమియంతో రూ. 1,54,100 పలికింది.

దేశ రాజధానిలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,52,510గా నమోదైంది. 22 క్యారెట్ల బంగారం ముంబై, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్‌లలో 10 గ్రాములకు రూ. 1,39,660 వద్ద ట్రేడ్ అయింది. చెన్నైలో దీని ధర రూ. 1,41,260 కాగా, ఢిల్లీలో 10 గ్రాములకు రూ. 1,39,810కి చేరింది. వెండి ధరలు కూడా కిలో రేటు 100 పెరుగుదలను నమోదు చేశాయి. ఢిల్లీ, ముంబై, కోల్‌కతాలో వెండి కిలో రూ. 2,60,100 వద్ద పలకగా, చెన్నైలో ఈ రేటు రూ. 2,65,100 వద్ద స్థిరపడింది.
ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు (గ్రాముకు)
చెన్నై..
24 క్యారెట్లు- రూ. 15,382, 22 క్యారెట్లు - రూ. 14,100, 18 క్యారెట్లు - రూ. 11,760
ముంబై..
24 క్యారెట్లు - రూ. 15,284, 22 క్యారెట్లు- రూ. 14,010, 18 క్యారెట్లు - రూ. 11,463
బెంగళూరు..
24 క్యారెట్లు - రూ. 15,284, 22 క్యారెట్లు- రూ. 14,010, 18 క్యారెట్లు - రూ. 11,463
హైదరాబాద్..
24 క్యారెట్లు - రూ. 15,284, 22 క్యారెట్లు- రూ. 14,010, 18 క్యారెట్లు - రూ. 11,463
విజయవాడ..
24 క్యారెట్లు - రూ. 15,284, 22 క్యారెట్లు- రూ. 14,010, 18 క్యారెట్లు - రూ. 11,463
విశాఖపట్నం..
24 క్యారెట్లు - రూ. 15,284, 22 క్యారెట్లు- రూ. 14,010, 18 క్యారెట్లు - రూ. 11,463
-
బంగారం ధరలు రివర్స్ గేర్ -
2,500 ఏళ్ల నాటి 'బంగారు కళ్ల' కిరీటం, దుష్టశక్తి భయంకరమైన నిజాలు! -
Tamil Nadu Survey: తమిళనాడు విజేతను తేల్చేసిన ఏబీపీ సర్వే-ఎవరికెన్ని సీట్లంటే..? -
రైతు భరోసా రెండు, మూడో విడత నిధుల జమ షెడ్యూల్ ఫిక్స్- ఎవరికి ఎప్పుడు..!! -
కిల్లర్ మిల్లర్.. గాయాన్ని సైతం లెక్కచేయని మొండిధైర్యం -
ఈ రాశి వారికి ఆస్తి తగాదాలు తప్పవు..!! -
బుమ్రా బౌలింగ్.. అంత ఏం లేదు: వైభవ్ సూర్యవంశీ -
తన భార్య గురించి విజయ్ సంచలన కామెంట్స్. 30 ఏళ్లు ఎదురుచూసి! -
రామ్ చరణ్ "పెద్ది" కోసం ప్రభాస్ ఫేవరెట్ బ్యూటీ.. -
Humsafar Express: శ్రీకాకుళం-తిరుపతి కొత్త వీక్లీ ఎక్స్ ప్రెస్-ఆ రోజు నుంచే..! -
సెకెనుకు 40,000 కి. మీ వేగంతో.. భూమి వైపు -
వాస్తు ప్రకారం ఐశ్వర్యాన్ని తెచ్చేది మనీప్లాంట్ కాదు.. 'క్రాసులా' మొక్కను పెంచాలి












Click it and Unblock the Notifications