బంగారం ధరల పతనానికి చిన్న బ్రేక్.. !!
దేశీయంగా కొన్ని రోజులుగా వరుసగా క్షీణిస్తూ వచ్చిన బంగారం, వెండి ధరలు నేడు స్వల్పంగా కోలుకున్నాయి. పండగ సీజన్ లో కొనుగోళ్లు ఊపందుకోవడంతో పసిడి ధరల్లో పాజిటివ్ ట్రెండ్ కనిపించింది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX) ఓపెనింగ్ ట్రేడింగ్ సెషన్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ఫ్యూచర్స్ ధర 0.21 శాతం పెరిగింది. 1,42,810 రూపాయల వద్ద లాభాల్లో ట్రేడ్ అయింది. వెండి ఫ్యూచర్స్ ధర కూడా పుంజుకొంది. 0.36 శాతం మేర లాభపడి, రూ. 1,97,300 స్థాయిని తాకింది.
శుక్రవారం నాటి క్లోజింగ్ సెషన్ తో పోల్చుకుంటే 24 క్యారెట్ల బంగారం ధరలో రూ. 170 మేర పెరుగుదల కనిపించింది. 22 క్యారెట్లు రూ. 150, 18 క్యారెట్లు రూ. 120 మేర పెరిగాయి. గ్లోబల్ మార్కెట్ లో చోటుచేసుకుంటోన్న పరిణామాలు భారతీయ మార్కెట్‌పై నేరుగా ప్రభావం చూపుతోన్నాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ రాబోయే వడ్డీ రేట్ల నిర్ణయాలు, ముడిచమురు ధరల పెరుగుదల వల్ల తలెత్తిన ద్రవ్యోల్బణ ఆందోళనల మధ్య అంతర్జాతీయంగా స్పాట్ గోల్డ్ వెనకడుగు వేసింది.

కామెక్స్ లో స్పాట్ గోల్డ్ ఔన్స్ 0.6 శాతం తగ్గి 4,000 డాలర్ల దిగువకు చేరింది. 3,998.49 వద్ద స్థిరపడింది. జూలై తర్వాత పసిడి ధర అంతర్జాతీయంగా ఈ స్థాయిలో పడిపోవడం ఇదే మొదటిసారి. హైదరాబాద్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,42,770 వద్ద ట్రేడ్ అయింది. 10 గ్రాముల 22 క్యారెట్లు రూ. 1,30,873 వద్ద స్థిరపడింది. ఇక్కడ వెండి కిలో రూ. 1,96,980 వద్ద కొనసాగుతోంది.
ముంబైలో 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి రేటు రూ. 1,42,540 గా రికార్డు కాగా.. 22 క్యారెట్లు రూ. 1,30,662 ట్రేడ్ అయింది. కిలో వెండి రూ. 1,96,670 నమోదైంది. చెన్నైలో ఇవే రేట్లు వరుసగా రూ. 1,42,780, రూ. 1,30,882, రూ. 1,96,509 నిలిచాయి. బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 1,42,650, 22 క్యారెట్లు రూ. 1,30,763, వెండి 1,96,820 వద్ద కొనసాగుతున్నాయి.
నేడు నమోదైన బంగారం రేట్లు ఒక గ్రాముకు ఇలా ఉన్నాయి
చెన్నై..
24 క్యారెట్లు- రూ. 14,275, 22 క్యారెట్లు - రూ. 13,085, 18 క్యారెట్లు - రూ. 10,705
ముంబై..
24 క్యారెట్లు- రూ. 14,275, 22 క్యారెట్లు - రూ. 13,085, 18 క్యారెట్లు - రూ. 10,706
బెంగళూరు..
24 క్యారెట్లు- రూ. 14,275, 22 క్యారెట్లు - రూ. 13,085, 18 క్యారెట్లు - రూ. 10,706
హైదరాబాద్..
24 క్యారెట్లు- రూ. 14,275, 22 క్యారెట్లు - రూ. 13,085, 18 క్యారెట్లు - రూ. 10,706
విజయవాడ..
24 క్యారెట్లు- రూ. 14,275, 22 క్యారెట్లు - రూ. 13,085, 18 క్యారెట్లు - రూ. 10,706
విశాఖపట్నం..
24 క్యారెట్లు- రూ. 14,275, 22 క్యారెట్లు - రూ. 13,085, 18 క్యారెట్లు - రూ. 10,706












Click it and Unblock the Notifications
