బంగారం ధరలు తలకిందులు
దేశంలో బంగారం, వెండి ధరలు పెరిగాయి. గత వారం నమోదైన కనిష్ఠాల నుండి కోలుకుంటోన్నాయి. భారీగా పుంజుకున్నాయి. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, డాలర్ విలువలోని హెచ్చుతగ్గుల నేపథ్యంలో పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తుల వైపు మొగ్గు చూపడంతో ఈ పెరుగుదల కనిపించింది. అంతర్జాతీయ స్పాట్ మార్కెట్‌లో ఔన్సు బంగారం ధర సుమారు 4,430.00 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది.
కిందటి సెషన్‌తో పోల్చుకుంటే ఇది సుమారు 1.2 శాతం పెరిగింది. దేశీయ మార్కెట్‌లోనూ బంగారం ధరల్లో పెరుగుదల కనిపించింది. 10 గ్రాముల పసిడి ధర 0.45 శాతం మేర పెరిగింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర చెన్నైలో అత్యధికంగా 1,46,520 రూపాయలుగా నమోదైంది. 22 క్యారెట్ల ధర రూ. 1,34,310. ముంబై, బెంగళూరు, హైదరాబాద్, పూణేలలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,44,720గా కొనసాగింది. 22 క్యారెట్ల ధర రూ.1,32,660 వద్ద స్థిరంగా ఉంది.

ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,44,870గా, 22 క్యారెట్లఉ రూ. 1,32,810గా నమోదైంది. అహ్మదాబాద్, వడోదరలో 24 క్యారెట్ల బంగారం రూ. 1,44,770, 22 క్యారెట్ల ధర రూ. 1,32,710గా ఉన్నాయి. ఈ నెలలో బంగారం ధరల కదలికలో గణనీయమైన హెచ్చుతగ్గులు కనిపించాయి. మార్చి 1న 24 క్యారెట్లు ఞక గ్రాముకు రూ. 17,309 కాగా, 22 క్యారెట్లు రూ. 15,865గా నమోదైంది. 24వ తేదీ నాటికి వీటి రేట్లు భారీగా పడిపోయాయి. కనిష్ఠాలను తాకాయి. నెల మొత్తం మీద 24 క్యారెట్ల, 22 క్యారెట్ల బంగారం ధరలు 16.39 శాతం మేర తగ్గుముఖం పట్టాయి.
ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు (గ్రాముకు)
చెన్నై..
24 క్యారెట్లు- రూ. 14,902, 22 క్యారెట్లు - రూ. 13,660, 18 క్యారెట్లు - రూ. 11,400
ముంబై..
24 క్యారెట్లు - రూ. 14,809, 22 క్యారెట్లు- రూ. 13,575, 18 క్యారెట్లు - రూ. 11,107
బెంగళూరు..
24 క్యారెట్లు - రూ. 14,809, 22 క్యారెట్లు- రూ. 13,575, 18 క్యారెట్లు - రూ. 11,107
హైదరాబాద్..
24 క్యారెట్లు - రూ. 14,809, 22 క్యారెట్లు- రూ. 13,575, 18 క్యారెట్లు - రూ. 11,107
విజయవాడ..
24 క్యారెట్లు - రూ. 14,809, 22 క్యారెట్లు- రూ. 13,575, 18 క్యారెట్లు - రూ. 11,107
విశాఖపట్నం..
24 క్యారెట్లు - రూ. 14,809, 22 క్యారెట్లు- రూ. 13,575, 18 క్యారెట్లు - రూ. 11,107

Click it and Unblock the Notifications