పసిడి ధరలు ఇచ్చే షాక్ కు సిద్ధంగా ఉండండి

పసిడి ప్రియులకు వచ్చే వారం షాక్ తగలడం ఖాయంగా కనిపిస్తోంది. దేశీయ మార్కెట్ లో బంగారం ధరలు మళ్లీ పుంజుకుంటోన్నాయి. ఈ వారం రోజుల వ్యవధిలో పసిడి ధరలలో గణనీయమైన పెరుగుదల నమోదైంది. పండుగలు, పెళ్లిళ్ల సీజన్ సమీపిస్తున్న తరుణంలో వీటి రేట్లు మరింత పెరగుతాయనే అంచనాలు ఉన్నాయి. ఇది.. సాధారణ కొనుగోలుదారులపై అదనపు భారాన్ని మోపనుండగా.. ఇప్పటికే కొన్న వారికి, దీర్ఘకాల పెట్టుబడులు పెట్టిన వారికీ లాభాలపంట పండించినట్టవుతోంది.

దేశంలో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర 10 గ్రాములకు 1,090 రూపాయల మేర పెరిగింది. 1,52,305 రూపాయల మార్కును తాకింది. అదేవిధంగా.. ఆభరణాల తయారీకి ఎక్కువగా కొనుగోలు చేసే 22 క్యారెట్ల పసిడి ధర 10 గ్రాములకు 1,000 రూపాయల మేర పెరిగి 1,39,650 రూపాయల వద్ద కొనసాగుతోంది. ఇక 18 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే పరిస్థితి నెలకొంది. 10 గ్రాములకు 820 రూపాయల పెరిగి.. 11,426 రూపాయలుగా స్థిరపడింది.

Gold Prices Hit 7-Week High as Safe-Haven Demand Rises lower US Treasury yields boosted safe-haven

ఈ మధ్యకాలంలో ఈ స్థాయిలో బంగారం రేట్లు పెరగడం ఇదే మొదటిసారి కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ నెల 6వ తేదీన అమాంతం పెరిగిన పసిడి ధర.. కిందికి దిగి రావట్లేదు. వచ్చే వారం కూడా ఇదే ట్రెండ్ కొనసాగుతుందని చెబుతున్నారు. దీనికి కారణాలు లేకపో్లేదు. అంతర్జాతీయంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, అమెరికా డాలర్ విలువలో హెచ్చుతగ్గులు, బ్యాంకులు తీసుకునే పరపతి విధాన నిర్ణయాలు బంగారం ధరలను ప్రభావితం చేస్తాయని, ఈ అనిశ్చితి కారణాల వల్ల భవిష్యత్తులో కూడా మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషిస్తున్నారు.

మూడేళ్లుగా తిరుగుతున్నా.. హెల్ప్ చేయండి: సీఎంకు అర్ధరాత్రి రిక్వెస్ట్ పెట్టిన టీమిండియా స్టార్
మూడేళ్లుగా తిరుగుతున్నా.. హెల్ప్ చేయండి: సీఎంకు అర్ధరాత్రి రిక్వెస్ట్ పెట్టిన టీమిండియా స్టార్

హైదరాబాద్ లో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 1,52,350, 22 క్యారెట్లు రూ. 1,39,650, 18 క్యారెట్లు రూ. 1,14,260 వద్ద కొనసాగుతోంది. చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 1,51,640 22 క్యారెట్లు రూ. 1,39,100, 18 క్యారెట్లు రూ.1,17,150 వద్ద స్థిరపడింది. ముంబైలో లో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 1,52,350 కాగా 22 క్యారెట్లు రూ. 1,39,650, 18 క్యారెట్లు రూ. 1,14,260కి చేరింది.

బేజారెత్తిస్తోన్న బంగారం ధరలు.. షార్ప్ రైజింగ్: షాక్ కొట్టేలా
బేజారెత్తిస్తోన్న బంగారం ధరలు.. షార్ప్ రైజింగ్: షాక్ కొట్టేలా

వివిధ నగరాల్లో నేడు నమోదైన బంగారం రేట్లు ఒక గ్రాముకు ఇలా ఉన్నాయి.

చెన్నై..

24 క్యారెట్లు- రూ. 15,164, 22 క్యారెట్లు - రూ. 13,900, 18 క్యారెట్లు - రూ. 11,715

ముంబై..

24 క్యారెట్లు - రూ. 15,235, 22 క్యారెట్లు- రూ. 13,965, 18 క్యారెట్లు - రూ. 11,462

బెంగళూరు..

24 క్యారెట్లు - రూ. 15,235, 22 క్యారెట్లు- రూ. 13,965, 18 క్యారెట్లు - రూ. 11,462

హైదరాబాద్..

24 క్యారెట్లు - రూ. 15,235, 22 క్యారెట్లు- రూ. 13,965, 18 క్యారెట్లు - రూ. 11,462

విజయవాడ..

24 క్యారెట్లు - రూ. 15,235, 22 క్యారెట్లు- రూ. 13,965, 18 క్యారెట్లు - రూ. 11,462

విశాఖపట్నం..

24 క్యారెట్లు - రూ. 15,235, 22 క్యారెట్లు- రూ. 13,965, 18 క్యారెట్లు - రూ. 11,462

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+