బంగారానికి డిమాండ్ పిక్స్ అప్: పాజిటివ్ ట్రెండ్
దేశంలో నేడు బంగారం, వెండి ధరలు పెరిగాయి. పండుగలు, పెళ్లిళ్ల సీజన్ సమయంలో వీటి ధరలు ఎగబాకడం కొనుగోలుదారులకు ఆందోళన కలిగిస్తోంది. అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాలు, సానుకూల ట్రెండ్ వల్ల దేశీయంగా మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX) లో పసిడి ధరలు ప్రియం అయ్యాయి. 24 క్యారెట్ల బంగారం ధరల్లో దాదాపుగా 0.95 శాతం మేర పెరుగుదల రికార్డయింది. వెండిలోనూ ఇదే పరిస్థితి నెలకొంది.
దేశీయంగా 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధరలో రూ. 1,580 మేర పెరిగి రూ. 1,52,830 కి చేరింది. సాధారణంగా ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ. 1,450 మేర పెరిగి రూ. 1,40,090 మార్కును తాకింది. ఇక 18 క్యారెట్ల బంగారం ధర రూ. 1,190 పెరిగి ప్రస్తుతం రూ. 1,1790 వద్ద ట్రేడ్ అవుతోంది. దీంతో పసిడి కొనుగోలుదారులపై అదనపు భారం పడినట్టయింది. బంగారం ధరలు పికప్ అయ్యాయనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి.

బంగారం, వెండి ధరల్లో ఈ వారం తీవ్ర అస్థిరత కొనసాగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరల్లో మార్పులు, డాలర్ ఇండెక్స్ హెచ్చుతగ్గులు, బ్యాంక్ ఆఫ్ జపాన్ ద్రవ్య విధాన నిర్ణయాలు పసిడి, వెండి ధరలపై తీవ్ర ప్రభావం చూపనున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ఔన్స్‌కు 4,335 డాలర్ల వద్ద లభిస్తోంది. దేశీయ మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX) లో ప్రతి 10 గ్రాముల బంగారం రూ. 1,53,300 నుంచి రూ. 1,54,400 వరకు వెళ్లొచ్చు.
వివిధ నగరాల్లో నేడు నమోదైన బంగారం రేట్లు ఒక గ్రాముకు ఇలా ఉన్నాయి.
చెన్నై..
24 క్యారెట్లు- రూ. 15,283, 22 క్యారెట్లు - రూ. 14,009, 18 క్యారెట్లు - రూ. 11,779
ముంబై..
24 క్యారెట్లు - రూ. 15,442, 22 క్యారెట్లు- రూ. 14,155, 18 క్యారెట్లు - రూ. 11,582
బెంగళూరు..
24 క్యారెట్లు - రూ. 15,442, 22 క్యారెట్లు- రూ. 14,155, 18 క్యారెట్లు - రూ. 11,582
హైదరాబాద్..
24 క్యారెట్లు - రూ. 15,442, 22 క్యారెట్లు- రూ. 14,155, 18 క్యారెట్లు - రూ. 11,582
విజయవాడ..
24 క్యారెట్లు - రూ. 15,442, 22 క్యారెట్లు- రూ. 14,155, 18 క్యారెట్లు - రూ. 11,582
విశాఖపట్నం..
24 క్యారెట్లు - రూ. 15,442, 22 క్యారెట్లు- రూ. 14,155, 18 క్యారెట్లు - రూ. 11,582

Click it and Unblock the Notifications