లాభాల పంట పండిస్తోన్న పసిడి రేట్లు- తగ్గేదే లేదు
దేశీయ మార్కెట్‌లో పసిడి ధరలు మళ్లీ క్రమంగా పుంజుకుంటోన్నాయి. అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు, ద్రవ్యోల్బణం, అమెరికన్ డాలర్ మారకపు విలువ, సెంట్రల్ బ్యాంకుల విధానాలు బంగారం ధరల కదలికలను ప్రభావితం చేస్తోన్నాయి. పండగ సీజన్ కూడా దీనికి తోడు కావడంతో ధరల్లో పాజిటివ్ ట్రెండ్ కనిపించింది. వరుసగా మూడో రోజు కూడా వాటి రేట్లు పెరుగుదల బాటపట్టాయి. ఇక మున్ముందు ఇదే ధోరణి కొనసాగుతుందనే అంచనాలకు తెర తీసింది.
దేశీయ మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ లో మంగళవారం నాటి క్లోజింగ్ సెషన్ తో పోల్చితే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరలో రూ. 660 మేర పెరుగుదల నమోదైంది. 22 క్యారెట్లల్లో రూ. 600, 18 క్యారెట్లల్లో రూ. 390 పెరిగాయి. మొత్తంగా 24 క్యారెట్ల స్వచ్ఛమైన 10 గ్రాముల బంగారం ధర రూ.1,43,950 వద్దకు చేరింది. ఆభరణాల తయారీకి ఎక్కువగా ఉపయోగించే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,31,950 కి పెరిగింది. 18 క్యారెట్ల10 గ్రాముల బంగారం ధర 1,07,796 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది.

హైదరాబాద్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,43,950 వద్ద ట్రేడ్ అయింది. 10 గ్రాముల 22 క్యారెట్లు రూ. 1,31,950 వద్ద స్థిరపడింది. ముంబైలో 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి రేటు రూ. 1,43,950 గా రికార్డు కాగా.. 22 క్యారెట్లు రూ. 1,31,900 ట్రేడ్ అయింది. చెన్నైలో ఇవే రేట్లు వరుసగా రూ. 1,44,100, రూ. 1,32,620 వద్ద నిలిచాయి. బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 1,43,990, 22 క్యారెట్లు రూ. 1,32,950 వద్ద కొనసాగుతున్నాయి.
నేడు నమోదైన బంగారం రేట్లు ఒక గ్రాముకు ఇలా ఉన్నాయి
చెన్నై..
24 క్యారెట్లు- రూ. 14,395, 22 క్యారెట్లు - రూ. 13,195, 18 క్యారెట్లు - రూ. 10,796
ముంబై..
24 క్యారెట్లు- రూ. 14,395, 22 క్యారెట్లు - రూ. 13,195, 18 క్యారెట్లు - రూ. 10,796
బెంగళూరు..
24 క్యారెట్లు- రూ. 14,395, 22 క్యారెట్లు - రూ. 13,195, 18 క్యారెట్లు - రూ. 10,796
హైదరాబాద్..
24 క్యారెట్లు- రూ. 14,395, 22 క్యారెట్లు - రూ. 13,195, 18 క్యారెట్లు - రూ. 10,796
విజయవాడ..
24 క్యారెట్లు- రూ. 14,395, 22 క్యారెట్లు - రూ. 13,195, 18 క్యారెట్లు - రూ. 10,796
విశాఖపట్నం..
24 క్యారెట్లు- రూ. 14,395, 22 క్యారెట్లు - రూ. 13,195, 18 క్యారెట్లు - రూ. 10,796












Click it and Unblock the Notifications
