బంగారం.. తలకిందులుగా తపస్సు చేసినా కొనలేం భయ్యా!!
బంగారం ధరలు నానాటికీ పెరుగుతున్నాయి. ఏ ఒక్క రోజు కూడా అవి తగ్గే సూచనలు కనిపించట్లేదు. వెండిదీ ఇదే పరిస్థితి. పసిడి- వెండి రేట్లు పైపైకి దూసుకెళ్తున్నాయి. ఈ దూకుడు నేడు కూడా కొనసాగింది. అంతర్జాతీయ మార్కెట్ లో ఒక ఔన్స్ బంగారం ధర 5,000 డాలర్లను దాటిపోయింది. దీని ప్రభావం దేశీయ బంగారం అమ్మకాలపై పడింది. పెరుగుతున్న భౌగోళిక-రాజకీయ అనిశ్చితుల నేపథ్యంలో బంగారం ధర రికార్డు స్థాయికి చేరింది.
అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ అనిశ్చితి, కేంద్ర బ్యాంకుల నుంచి పెరిగిన డిమాండ్, ఆర్థిక అస్థిరత కారణంగా బంగారం, వెండి ధరలు రికార్డు గరిష్ట స్థాయిలను నమోదు చేశాయి. ఎంసీఎక్స్ లో బంగారం ఫ్యూచర్స్ 1.96 శాతం పెరిగి, రూ. 1,60,789లకు చేరుకున్నాయి. వెండి ఫ్యూచర్స్ 5.62 శాతం ఎగిసింది, కిలో రూ. 3,76,300లకు చేరింది. కామెక్స్ లో బంగారం రెండు శాతానికి పైగా వృద్ధితో ఔన్స్‌కు 5,227.50, వెండి 8.52 శాతం పెరుగుదలతో ఔన్స్‌కు 114.99 డాలర్ల వద్ద ట్రేడ్ అయ్యాయి.

ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు (గ్రాముకు)
చెన్నై..
24 క్యారెట్లు- రూ. 16,734, 22 క్యారెట్లు - రూ. 15,330, 18 క్యారెట్లు - రూ. 12,785
ముంబై..
24 క్యారెట్లు - రూ. 16,517, 22 క్యారెట్లు- రూ. 15,140, 18 క్యారెట్లు - రూ. 12,388
బెంగళూరు..
24 క్యారెట్లు - రూ. 16,517, 22 క్యారెట్లు- రూ. 15,140, 18 క్యారెట్లు- రూ. 12,388
హైదరాబాద్..
24 క్యారెట్లు - రూ. 16,517, 22 క్యారెట్లు- రూ. 15,140, 18 క్యారెట్లు- రూ. 12,388
విజయవాడ..
24 క్యారెట్లు - రూ. 16,517, 22 క్యారెట్లు- రూ. 15,140, 18 క్యారెట్లు- రూ. 12,388
విశాఖపట్నం..
24 క్యారెట్లు - రూ. 16,517, 22 క్యారెట్లు- రూ. 15,140, 18 క్యారెట్లు- రూ. 12,388
-
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
IPL తొలి మ్యాచ్ లోనే సెన్సేషన్, ఎవరీ కూపర్ కనోలీ - సూర్యవంశీని డామినేట్ చేస్తూ..!! -
పాల ధరలు భారీగా పెంపు, ఒకే సారి - కొత్త రేట్లు ఇలా..!! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
Amaravati Bill: పార్లమెంట్ లో అమరావతి బిల్లు..! కాంగ్రెస్ స్టాండ్ ఇదే..! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
జన్మ నక్షత్రం మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
ఈ టైంలో కరెంట్ వాడితే బాదుడే, విద్యుత్ ఛార్జీల్లో మార్పులు - నేటి నుంచే అమలు..!!












Click it and Unblock the Notifications