Gold: భారీగా పెరిగిన బంగారం ధరలు. పసిడి మార్కెట్లో పూనకాలు

పశ్చిమ ఆసియాలో నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతలు ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలను కుదిపేస్తున్నాయి. ముఖ్యంగా ఇన్వెస్టర్లు అత్యంత సురక్షితంగా భావించే బులియన్ మార్కెట్ ప్రస్తుతం తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతోంది. గత రెండు రోజులుగా భారీ పతనాన్ని చవిచూసిన బంగారం ధరలు, నేడు (మార్చి 25, బుధవారం) అనూహ్యంగా మళ్లీ పుంజుకున్నాయి.

స్టాక్ మార్కెట్లలో కొనసాగుతున్న రక్తపాతం కారణంగా ఇన్వెస్టర్లు తమ నష్టాలను పూడ్చుకునేందుకు ఒకవైపు బంగారాన్ని విక్రయిస్తుండగా, మరోవైపు అంతర్జాతీయ అనిశ్చితి ధరలను మళ్లీ పైకి నెడుతోంది.

దేశీయంగా నేడు బంగారం ధరల పెరుగుదల భారీగా నమోదైంది. 24 క్యారట్ల ఒక గ్రాము బంగారం ధర రూ. 376 పెరిగి రూ. 14,667 వద్దకు చేరింది. అదేవిధంగా 22 క్యారట్ల బంగారం గ్రాముకు రూ. 345 పెరిగి రూ. 13,445 వద్ద, 18 క్యారట్ల బంగారం రూ. 282 పెరిగి రూ. 11,001 వద్ద ట్రేడ్ అవుతోంది. పెద్ద మొత్తంలో చూస్తే, 100 గ్రాముల 24 క్యారట్ల పసిడి ధర ఏకంగా రూ. 37,600 పెరిగి రూ. 14,66,700 కు చేరుకోవడం మార్కెట్ తీవ్రతను సూచిస్తోంది.

Gold Prices Rebound Sharply on March 25 Prices Surge Amid West Asia Conflict and Global Market Volatility

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో ధరలు ఒకేలా కొనసాగుతున్నాయి. ఈ నగరాల్లో 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ. 3,760 పెరిగి రూ. 1,46,670 గా నమోదైంది. 22 క్యారట్ల 10 గ్రాముల ధర రూ. 1,34,450 వద్ద, 18 క్యారట్ల ధర రూ. 1,10,010 వద్ద కొనసాగుతున్నాయి. వినియోగదారులు ఒక్క రోజులోనే ఇంతటి మార్పు రావడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

దేశంలోని ఇతర మెట్రో నగరాల్లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. చెన్నైలో అత్యధికంగా 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ. 1,48,370 వద్ద ట్రేడ్ అవుతుండగా, దేశ రాజధాని ఢిల్లీలో రూ. 1,46,820 గా ఉంది. ముంబై, బెంగళూరు, కోల్‌కతా నగరాల్లో హైదరాబాద్ తరహాలోనే 24 క్యారట్ల బంగారం రూ. 1,46,670 వద్ద స్థిరపడింది. అహ్మదాబాద్‌లో మాత్రం స్వల్ప మార్పుతో రూ. 1,46,720 గా నమోదైంది. మార్కెట్ నిపుణుల విశ్లేషణ ప్రకారం పశ్చిమ ఆసియాలో శాంతి నెలకొనే వరకు పసిడి ధరల్లో ఈ అనిశ్చితి కొనసాగే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+