పసిడి ధరల్లో బిగ్ బ్లాస్ట్.. ఈ వారంలో
భారత మార్కెట్‌లో బంగారం ధరలు మళ్లీ పుంజుకొంటున్నాయి. గణనీయంగా కోలుకుంటోన్నాయి. ఇరాన్‌పై దాడులను తీవ్రతరం చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించినప్పటికీ పసిడి, వెండి ధరలు ఎగబాకడం ప్రాధాన్యతను సంతరించుకుంది. పశ్చిమ ఆసియాలో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు వీటిని ప్రభావితం చేస్తూనే ఉండటంతో నేడు దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరల్లో స్థిరత్వం కనిపించింది. ఫ్యూచర్స్ మార్కెట్లలో పదునైన క్షీణత తర్వాత వెండి ధరలు అస్థిరతను ప్రతిబింబించాయి.
మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ లో శుక్రవారం నాటి బంగారం ధరలే కొనసాగుతున్నాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 1,50,150 రూపాయల వద్ద స్థిరపడింది. ఇది- జనవరి నాటి రికార్డు రేటు 1,80,779 వద్ద కంటే సుమారు 17 శాతం తక్కువ. ఇటీవలి యూఎస్ ఉద్యోగాల గణాంకాల మద్దతు నేపథ్యంలో బంగారం ధరలు ఈ వారంలో సుమారు 2.2 శాతం వరకు లాభాన్ని నమోదు చేయవచ్చని మార్కెట్ వర్గాలు తెలిపాయి.

వెండి మాత్రం తిరోగమిస్తోంది. గత సెషన్‌లో వెండి ధర గణనీయంగా పడిపోయింది. అమెరికా-ఇరాన్ సంఘర్షణకు సంబంధించిన అనిశ్చితి కొనసాగుతుండటం, మార్కెట్‌పై నెలకొన్న ఒత్తిడి కారణంగా శుక్రవారం MCX ముగిసే సమయానికి కిలో వెండి ధర 10,901 రూపాయల మేర తగ్గింది. 4.5 శాతం తగ్గుదలను నమోదు చేసింది. నేడు కూడా ఇదే పరిస్థితి నెలకొంది. కిలో వెండి 2,32,600 రూపాయల వద్ద ట్రేడ్ అయింది.
ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 1,45,220, 22 క్యారెట్లు రూ. 1,36,785, 18 క్యారెట్లు రూ. 1,11,915 పలుకుతోంది. జైపూర్‌లో 24 క్యారెట్ల బంగారం రూ. 1,49,460, 22 క్యారెట్లు రూ. 1,37,005, 18 క్యారెట్లు రూ. 1,12,095గా నమోదయ్యాయి. ముంబై 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,49,480, 22 క్యారెట్లు రూ. 1,37,023, 18 క్యారెట్లరూ. 1,12,110గా ఉంది.
ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు (గ్రాముకు)
చెన్నై..
24 క్యారెట్లు- రూ. 15,218, 22 క్యారెట్లు - రూ. 13,950, 18 క్యారెట్లు - రూ. 11,635
ముంబై..
24 క్యారెట్లు - రూ. 15,093, 22 క్యారెట్లు- రూ. 13,835, 18 క్యారెట్లు - రూ. 11,320
బెంగళూరు..
24 క్యారెట్లు - రూ. 15,093, 22 క్యారెట్లు- రూ. 13,835, 18 క్యారెట్లు - రూ. 11,320
హైదరాబాద్..
24 క్యారెట్లు - రూ. 15,093, 22 క్యారెట్లు- రూ. 13,835, 18 క్యారెట్లు - రూ. 11,320
విజయవాడ..
24 క్యారెట్లు - రూ. 15,093, 22 క్యారెట్లు- రూ. 13,835, 18 క్యారెట్లు - రూ. 11,320
విశాఖపట్నం..
24 క్యారెట్లు - రూ. 15,093, 22 క్యారెట్లు- రూ. 13,835, 18 క్యారెట్లు - రూ. 11,320
-
రైతు భరోసా రెండో విడత నిధుల జమ షెడ్యూల్ ఖరారు, ఈ సారి వీరికే..!! -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
బంగారం ధరలకు గత వైభవం -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
Vijay: ఎంజీఆర్, జయలలిత చేయని సాహసం చేస్తున్న విజయ్? డీఎంకే కంచుకోటలో..! -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
బీఆర్ఎస్ లో చేరిక పై తేల్చేసిన జీవన్ రెడ్డి, వాట్ నెక్స్ట్..!! -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్‌న్యూస్ -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
విశాఖ రైల్వే జోన్ పరిధిలో కీలక మార్పులు, ప్రధాన మార్గం విలీనం..!! -
అదే గానీ జరిగితే.. పాకిస్థాన్‌కు రాజ్‌నాథ్ సింగ్ స్ట్రాంగ్ వార్నింగ్.. -
వివాహేతర సంబంధాల్లో రెండో స్థానంలో హైదరాబాద్.. తాజా సర్వేలో..












Click it and Unblock the Notifications