తారాజువ్వలా దూసుకెళ్తోన్న బంగారం ధరలు
భారత్ లో నేడు పసిడి ధరలు పెరిగాయి. ప్రారంభ ట్రేడింగ్ లో కొంత తగ్గుముఖం పట్టినప్పటికీ.. ఆ తర్వాత జూమ్ అంటూ ఎగిశాయి. డాలర్ లో స్థిరంగా కొనసాగడం, లాభాల స్వీకరణ, ఈ ఏడాది అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు అంచనాలు, అధిక చమురు ధరలు, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు ఈ పెరుగుదలకు కారణం అయ్యాయి. అటు పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల ప్రభావం కూడా పసిడి, వెండి రేట్లపై పడింది.
మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ లో జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ 0.21 శాతం పెరిగి 10 గ్రాములకు 1,57,600 రూపాయల వద్ద ట్రేడ్ అయింది. జూలై సిల్వర్ ఫ్యూచర్స్ లో 0.38 శాతం పెరుగుదల కనిపించింది. ఇది కిలోకు 2,69,500 రూపాయల వద్ద స్థిరపడింది. డాలర్ ఇండెక్స్ 0.10 శాతం పెరగడం పసిడి ధరలపై ఒత్తిడిని పెంచింది. ఏప్రిల్‌లో అమెరికా ద్రవ్యోల్బణం గత మూడేళ్లలో అత్యంత వేగంగా పెరిగడం దీనికి ప్రధాన కారణం. ముంబైలో 10 గ్రాములు 24 క్యారెట్ల బంగారం రూ. 1,57,210, 22 క్యారెట్లు రూ. 1,44,027, కిలో 999 ఫైన్ వెండి రూ. 2,68,950 ల వద్ద ట్రేడ్ అయింది.

న్యూఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ. 1,56,810 కాగా, 22 క్యారెట్లు రూ. 1,43,743 పలుకుతోంది. ఇక్కడ కిలో 999 ఫైన్ వెండి రూ. 2,68,350గా నమోదైంది. బెంగళూరులో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ. 1,57,200, 22 క్యారెట్లు రూ. 1,44,100గా నమోదైంది. ఇక్కడ కిలో వెండి రూ. 2,69,030 వద్ద స్థిరపడింది. కోల్‌కతాలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ. 1,56,870, 22 క్యారెట్లు రూ. 1,43,798, కిలో ఫైన్ వెండి రూ. 2,68,460, హైదరాబాద్లో 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి రూ. 1,57,330; 22 క్యారెట్లు రూ. 1,44,219, కిలో వెండి రూ. 2,69,240గా ఉంది.
24 క్యారెట్లు- రూ. 16,928, 22 క్యారెట్లు - రూ. 14,600, 18 క్యారెట్లు - రూ. 12,255
ముంబై..
24 క్యారెట్లు - రూ. 15,764, 22 క్యారెట్లు- రూ. 14,450, 18 క్యారెట్లు - రూ. 11,823
బెంగళూరు..
24 క్యారెట్లు - రూ. 15,764, 22 క్యారెట్లు- రూ. 14,450, 18 క్యారెట్లు - రూ. 11,823
హైదరాబాద్..
24 క్యారెట్లు - రూ. 15,764, 22 క్యారెట్లు- రూ. 14,450, 18 క్యారెట్లు - రూ. 11,823
విజయవాడ..
24 క్యారెట్లు - రూ. 15,764, 22 క్యారెట్లు- రూ. 14,450, 18 క్యారెట్లు - రూ. 11,823
విశాఖపట్నం..
24 క్యారెట్లు - రూ. 15,764, 22 క్యారెట్లు- రూ. 14,450, 18 క్యారెట్లు - రూ. 11,823

Click it and Unblock the Notifications