Gold Prices; ఆ సమయంలో మిమ్మల్ని రక్షించేది బంగారమే

ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందికి ఆర్థిక పాఠాలు నేర్పిన "రిచ్ డాడ్ పూర్ డాడ్" రచయిత రాబర్ట్ కియోసాకి మరోసారి ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై గంభీరమైన హెచ్చరికలు జారీ చేశారు. మనం వాడుతున్న నోట్లు (డాలర్, రూపాయి వంటి ఫియాట్ కరెన్సీలు) భవిష్యత్తులో కేవలం కాగితపు ముక్కలుగా మిగిలిపోయే ప్రమాదం ఉందని, ఆ సమయంలో మిమ్మల్ని రక్షించేది 'బంగారం' మాత్రమేనని ఆయన కుండబద్దలు కొట్టారు.

డబ్బు కనుమరుగు.. బంగారం రాజ్యమేలుతుందా? రాబర్ట్ కియోసాకి సంచలన హెచ్చరిక! ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందికి ఆర్థిక పాఠాలు నేర్పిన "రిచ్ డాడ్ పూర్ డాడ్" రచయిత రాబర్ట్ కియోసాకి మరోసారి ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై గంభీరమైన హెచ్చరికలు జారీ చేశారు. మనం వాడుతున్న నోట్లు (డాలర్, రూపాయి వంటి ఫియాట్ కరెన్సీలు) భవిష్యత్తులో కేవలం కాగితపు ముక్కలుగా మిగిలిపోయే ప్రమాదం ఉందని, ఆ సమయంలో మిమ్మల్ని రక్షించేది 'బంగారం' మాత్రమేనని ఆయన కుండబద్దలు కొట్టారు.

Gold Prices Robert Kiyosaki Warns Gold Prices Will Surge Amid Global Economic Uncertainty and Inflation Risks

కియోసాకి ప్రధానంగా వేలెత్తి చూపిస్తున్నది ఫియాట్ కరెన్సీల పతనాన్ని. ప్రభుత్వాలు ఇష్టానుసారంగా నోట్లను ముద్రించడం, పెరిగిపోతున్న దేశాల అప్పుల భారం వల్ల కరెన్సీ తన అసలు విలువను కోల్పోతోందని ఆయన వాదన. "ప్రభుత్వ హామీ ఉన్నా, ద్రవ్యోల్బణం అనే భూతం మీ జేబులోని డబ్బును తినేస్తోంది" అని ఆయన హెచ్చరిస్తున్నారు. ఆర్థిక మాంద్యం, బ్యాంకింగ్ సంక్షోభం తలెత్తినప్పుడు స్టాక్ మార్కెట్లు కుప్పకూలవచ్చు, కానీ బంగారం ఎప్పుడూ తన విలువను కోల్పోదు. కియోసాకి దృష్టిలో బంగారం కేవలం ఒక లోహం కాదు, అది "నిజమైన డబ్బు".

వేల ఏళ్లుగా బంగారం తన విలువను నిలబెట్టుకుంది. దీనిని ఏ ప్రభుత్వం కావాలని సృష్టించలేదు, కనుక దీని విలువను తగ్గించలేరు. యుద్ధాలు, రాజకీయ అస్థిరత ఉన్న సమయంలో బంగారం పెట్టుబడిదారులకు ఒక 'సేఫ్ హెవెన్' (సురక్షిత ఆశ్రయం) లాంటిది. అని అన్నారు. కేవలం బంగారం మీద మాత్రమే కాకుండా, భవిష్యత్తు ఆర్థిక షాక్‌ల నుంచి తప్పించుకోవడానికి కియోసాకి ఒక మూడు అంచెల వ్యూహాన్ని (Diversification) సూచిస్తున్నారు. బంగారం (Gold) దీర్ఘకాలిక స్థిరత్వం కోసం. వెండి (Silver)ని తక్కువ ధరలో లభించే ఆస్తిగా.. బిట్‌కాయిన్ (Bitcoin)ను డిజిటల్ యుగంలో విప్లవాత్మక ఆస్తిగా అభివర్ణించారు.

ధనవంతులు ఎందుకు ధనవంతులు అవుతారు?

"ఆర్థిక సంక్షోభం అందరికీ నష్టం కలిగించదు, సిద్ధంగా ఉన్నవాళ్లకు అది ఒక అద్భుతమైన అవకాశం" అని కియోసాకి అంటారు. సాధారణ ప్రజలు ధరలు పెరుగుతున్నాయని భయపడి ఆస్తులు అమ్ముకుంటే, తెలివైన పెట్టుబడిదారులు బంగారం వంటి ఆస్తులను పోగేసుకుని సంక్షోభం తర్వాత మరింత ధనవంతులుగా మారుతారని ఆయన విశ్లేషించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+