పసిడి రేట్లు బౌన్స్ బ్యాక్

దేశంలో బంగారం, వెండి ధరలు పెరిగాయి. స్పాట్ మార్కెట్‌లో నెలకొన్న డిమాండ్ దీనికి ప్రధాన కారణం. ముంబైలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ. 1,50,920కు చేరింది. 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 1,38,340 రూపాయలుగా నమోదైంది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో ప్రారంభ ట్రేడింగ్‌లో బంగారం ధర 0.10 శాతం మేర పెరుగుదల చోటు చేసుకుంది. వెండి ధర కూడా స్వల్పంగా 0.21 శాతం పెరిగి కిలోగ్రాముకు రూ. 2,43,284 వద్ద ట్రేడ్ అయింది.

అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా స్పాట్ బంగారం పెరిగింది. 0.1 శాతం పెరిగి ఔన్సుకు 4,597.07 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. అంతకు ముందు సెషన్‌లో వీటి రేటు కనిష్ట స్థాయికి పడిపోయింది. ఏప్రిల్ 2 తర్వాత అదే అత్యల్పం. నేడు స్వల్పంగా పుంజుకొంది. యూఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ జూన్ డెలివరీకి 4,610.20 డాలర్ల వద్ద స్థిరంగా కొనసాగింది. ఫెడరల్ రిజర్వ్ రెండు రోజుల సమావేశం ముగియబోతోండటంతో వడ్డీ రేట్లను స్థిరంగా ఉండొచ్చని పెట్టుబడిదారులు ఆశిస్తున్నారు.

Gold Prices Spike slightly at MCX in India 24K 22K and 18K at spot and Silver was marginally up

కాగా.. దేశంలోని ప్రధాన నగరాల్లో నమోదైన బంగారం ధరల వివరాలి ఉన్నాయి. ఢిల్లీలో 24 క్యారెట్ల పసిడి రూ. 1,51,070గా నమోదు కాగా, హైదరాబాద్, చెన్నైలలో ₹1,50,920 వద్ద ఉంది. జైపూర్‌లో 22 క్యారెట్ల బంగారం రూ. 1,38,490, 24 క్యారెట్లు రూ. 1,51,070గా రికార్డయింది. అహ్మదాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1,38,390, 24 క్యారెట్లు రూ. 1,50,970 వద్ద నమోదయ్యాయి. పుణె, ముంబై, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, కోల్‌కతాలలో 22 క్యారెట్లు రూ. 1,38,340, 24 క్యారెట్లు రూ. 1,50,920గా ఉన్నాయి.

ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు (గ్రాముకు)

చెన్నై..

24 క్యారెట్లు- రూ. 15,219, 22 క్యారెట్లు - రూ. 13,950, 18 క్యారెట్లు - రూ. 11,635

ముంబై..

24 క్యారెట్లు - రూ. 15,137, 22 క్యారెట్లు- రూ. 13,875, 18 క్యారెట్లు - రూ. 11,353

బెంగళూరు..

24 క్యారెట్లు - రూ. 15,137, 22 క్యారెట్లు- రూ. 13,875, 18 క్యారెట్లు - రూ. 11,353

హైదరాబాద్..

24 క్యారెట్లు - రూ. 15,137, 22 క్యారెట్లు- రూ. 13,875, 18 క్యారెట్లు - రూ. 11,353

విజయవాడ..

24 క్యారెట్లు - రూ. 15,137, 22 క్యారెట్లు- రూ. 13,875, 18 క్యారెట్లు - రూ. 11,353

విశాఖపట్నం..

24 క్యారెట్లు - రూ. 15,137, 22 క్యారెట్లు- రూ. 13,875, 18 క్యారెట్లు - రూ. 11,353

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+