బంగారం ధరల్లో లాభాల మోత
దేశంలో బంగారం ధరలు పుంజుకున్నాయి. దేశీయ, అంతర్జాతీయంగా స్పాట్ బంగారం ధరలో భారీ కదలిక చోటు చేసుకుంది. అంతర్జాతీయంగా స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు సుమారు 4,751.68 డాలర్లు పలికింది. మొత్తం మీద, బంగారం ఈ వారంలో సుమారు రెండు శాతం లాభాన్ని నమోదు చేసింది. ఉద్రిక్తతలు తగ్గడం, కాల్పుల విరమణ తర్వాత ముడి చమురు ధరలు 15 శాతానికి పైగా తగ్గడం యూఎస్ డాలర్‌ను బలహీనపరిచింది. దీని ప్రభావం బంగారం ధరలపై పడింది.
ఈ పరిణామాల మధ్య 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం 1,52,360 రూపాయలకు చేరుకోగా, 22 క్యారెట్ల బంగారం కూడా పెరిగింది. 10 గ్రాములకు 1,39,660 రూపాయలుగా నమోదైంది. ప్రధాన నగరాల్లో 24 క్యారెట్ల బంగారం ధరలను పరిశీలిస్తే.. ముంబై, కోల్‌కతా, హైదరాబాద్‌లలో 10 గ్రాములకు రూ. 1,52,360గా నిలిచింది. చెన్నైలో మాత్రం ప్రీమియంతో రూ. 1,54,100 పలికింది.

దేశ రాజధానిలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,52,510గా నమోదైంది. 22 క్యారెట్ల బంగారం ముంబై, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్‌లలో 10 గ్రాములకు రూ. 1,39,660 వద్ద ట్రేడ్ అయింది. చెన్నైలో దీని ధర రూ. 1,41,260 కాగా, ఢిల్లీలో 10 గ్రాములకు రూ. 1,39,810కి చేరింది. వెండి ధరలు కూడా కిలో రేటు 100 పెరుగుదలను నమోదు చేశాయి. ఢిల్లీ, ముంబై, కోల్‌కతాలో వెండి కిలో రూ. 2,60,100 వద్ద పలకగా, చెన్నైలో ఈ రేటు రూ. 2,65,100 వద్ద స్థిరపడింది.
ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు (గ్రాముకు)
చెన్నై..
24 క్యారెట్లు- రూ. 15,382, 22 క్యారెట్లు - రూ. 14,100, 18 క్యారెట్లు - రూ. 11,760
ముంబై..
24 క్యారెట్లు - రూ. 15,284, 22 క్యారెట్లు- రూ. 14,010, 18 క్యారెట్లు - రూ. 11,463
బెంగళూరు..
24 క్యారెట్లు - రూ. 15,284, 22 క్యారెట్లు- రూ. 14,010, 18 క్యారెట్లు - రూ. 11,463
హైదరాబాద్..
24 క్యారెట్లు - రూ. 15,284, 22 క్యారెట్లు- రూ. 14,010, 18 క్యారెట్లు - రూ. 11,463
విజయవాడ..
24 క్యారెట్లు - రూ. 15,284, 22 క్యారెట్లు- రూ. 14,010, 18 క్యారెట్లు - రూ. 11,463
విశాఖపట్నం..
24 క్యారెట్లు - రూ. 15,284, 22 క్యారెట్లు- రూ. 14,010, 18 క్యారెట్లు - రూ. 11,463

Click it and Unblock the Notifications